breaking news
	
		
	
  new Ferrari
- 
            
                                     
                                                                                                       
                                   
                అదర్ పూనావాలా కొత్త కారు - ఫోటోలు
 - 
      
                   
                               
                   
            చేతికొచ్చిన గంటకే కాలి బూడిదైన ఫెరారీ

 లండన్: ఖరీదైన ఫెరారీ కారు చేతికి వచ్చిన గంటలో కాలి బూడిదై పోయింది. సెంట్రల్ ఇంగ్లండ్‌లో గురువారం మధ్నాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అనూహ్య ప్రమాదంలో సుమారు 260,000 డాలర్ల విలువైన (రూ. కోటి 67లక్షలు) కొత్త ఫెరారీ కారు మంటలకు ఆహుతి కావడం కలకలం రేపింది.
 
 సౌత్ యార్క్ షైర్ పోలీసులు శుక్రవారం ప్రచురించిన ఒక ఫేస్బుక్ పోస్ట్ ప్రకారం యార్క్ షైర్ సమీపంలో ఎం 1 మోటార్ వే లో ఫెరారీ 430 స్క్యూడెరియా మంటల్లో కాలి బూడిదిగా మారిపోయింది. అయితే ఈ ప్రమాదంనుంచి డ్రైవర్ స్వల్ప గాయాలతో బతికి బయటపడ్డాడు. ఇది ఫెరారీ కారు అనీ, ఒక గంట క్రితమే తాను తీసుకున్నట్టు పోలీసులకు చెప్పారు. అయితే అతి వేగమే కారణం కాకపోయి వుండవచ్చని పోలీసులు అభిప్రాయపడ్డారు. కానీ డ్రైవర్ "చాలా లక్కీ" అని తెలిపారు. గత రెండు వారాలుగా ఇలాంటి ప్రమాదాలుఅనేకం జరిగాయని అప్రమత్తంగా ఉండాలని వాహనదారులను హెచ్చరించారు. 
 
 
 


