breaking news
nephew abhishek banerjee
-
ఆందోళనకరంగా సీఎం మేనల్లుడి ఆరోగ్యం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమాల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు. రోడ్డు ప్రమాదానికి గురైన వారం రోజుల తర్వాత కూడా అభిషేక్ ఆరోగ్యం మెరుగుపడలేదు. అభిషేక్ చికిత్స పొందుతున్న బెల్లె వ్యూ క్లినిక్ ఆదివారం హెల్తె బులెటిన్ విడుదల చేసింది. ఆయన జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారని, ఇప్పటికీ కృత్రిమ శ్వాస అందిస్తున్నారని తెలిపారు. గత రెండు రోజులుగా రాత్రి వేళల్లో అభిషేక్ హృదయ స్పందన నిలకడగా లేకపోవడం వైద్యులకు ఆందోళన కలిగిస్తోంది. అభిషేక్ తలకు, ముఖంపై గాయాలయ్యాయి. 14 మందితో కూడిన వైద్యుల బృందం అభిషేక్ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆయనకు త్వరలో సర్జరీ చేయనున్నారు. కాగా అభిషేక్‌కు నిర్వహించిన పరీక్షల ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని వైద్యులు చెప్పారు. మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అభిషేక్ బెనర్జీ (29) తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. హుగ్లీ జిల్లాలోని ముర్షిబాద్ లో పార్టీ మీటింగ్ కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో రత్నపూర్ వద్ద ప్రమాదం జరిగింది. -
ముఖ్యమంత్రి మేనల్లుడికి రోడ్డు ప్రమాదం
కోల్ కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ(29) మంగళవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. హుగ్లీ జిల్లాలోని ముర్షిబాద్ లో పార్టీ మీటింగ్ కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో రత్నపూర్ వద్ద ప్రమాదం జరిగినట్లు తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గాపూర్ ఎక్స్ ప్రెస్ వే వద్ద బెనర్జీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనట్లు చెప్పారు. ప్రస్తుతం స్ధానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను కోల్ కతాలోని ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయమైనట్లు సమాచారం.