breaking news
Natural delivery
-
భార్య..భర్త..ఓ మిడ్ వైఫ్..!
నగరంలో ఇటీవల సహజ (నేచురల్) డెలివరీకి ప్రాధాన్యతతో పాటు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, ‘మిడ్ వైఫ్’ పేరిట ఓ ప్రాచీనమైన విధానమే తనదైన ఆధునిక రూపంలో విస్తృతంగా అందుబాటులోకి వస్తోంది. గర్భిణులకు మరింత సురక్షితమైన, మందుల రహితమైన, హాస్పిటల్ ఆధారిత, సిజేరియన్ డెలివరీలకు ప్రత్యామ్నాయంగా ఈ మిడ్ వైఫ్ సేవలు నగరంలో వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఒకప్పుడు అంటే మన అమ్మమ్మల కాలంలో మంత్రసాని పేరిట కాన్పులు చేసే మహిళలు ఉండేవారు. ఏ శిక్షణా లేకపోయినా వంశపారంపర్య వృత్తిగా వీరు అత్యంత చాకచక్యంగా ఇంటికి వచ్చి మరీ తమ సేవలు అందించేవారు. ఇప్పుడు దాదాపు అదే కాన్సెప్‌్టతో మిడ్ వైఫ్ గా తిరిగి ఆధునికులకు చేరువైంది. మిడ్ వైఫ్ అంటే ప్రత్యేక శిక్షణ పొందిన ప్రసూతి నిపుణురాలు అని పేర్కొనవచ్చు. వీరు గర్భిణులు, మహిళలకు గర్భధారణ నిర్ధారితమైన దగ్గర నుంచి సహజ ప్రసవం వరకూ వెన్నంటి ఉంటారు. అంతేకాదు వీరు ప్రసవానంతర కాలంలో సహాయం చేస్తారు. నేచురల్ బర్త్‌కు వీరు అత్యంత ప్రోత్సాహం ఇస్తారు. ప్రసవ సమయంలో ప్రత్యక్ష పర్యవేక్షణ, భావోద్వేగ సహాయం అవసరమైన మద్దతునూ అందిస్తారు. ప్రత్యేక ఆస్పత్రులు సైతం.. నగరంలో పలు కార్పొరేట్ ఆస్పత్రులతో పాటు మిడ్ వైఫ్ సేవలు అందించే ప్రత్యేక ప్రసవ కేంద్రాలు సైతం ఏర్పాటవ్వడం విశేషం. గచి్చ»ౌలి, బంజారాహిల్స్, మాదాపూర్ వంటి సంపన్న నివాస ప్రాంతాల్లోనే ఇవి ఎక్కువగా నెలకొన్నాయి. కొన్ని ప్రసూతి కేంద్రాలు, డౌలా క్లినిక్స్, బర్తింగ్ సెంటర్లు ఇప్పుడు మిడ్ వైఫ్ సేవలను అందుబాటులోకి తెచ్చాయి. వీటిలో బర్త్ విలేజ్, ఫెర్నాండెజ్ ఫౌండేషన్, హెల్తీ మదర్ బర్త్ సెంటర్, ది సాంక్టమ్ నేచురల్ బర్త్ సెంటర్. వంటివి కొన్ని కేంద్రాల్లో మిడ్ వైఫ్ లు గర్భిణులకు సరైన ఆహార మార్గదర్శనం, ప్రీ–నాటల్ కౌన్సిలింగ్, ప్రసవ వ్యాయామాలు, మెడిటేషన్ తరగతులు, ఎమోషనల్ సపోర్ట్ కూడా అందిస్తున్నారు. మిడ్ వైఫ్ విధానానికి కారణాలివే.. డాక్టర్ ఆధారిత హాస్పిటల్ ప్రసవాల్లో అధిక జోక్యం, అధిక మందుల వాడకం పట్ల విముఖత కలిగిన వారు, ఎట్టి పరిస్థితుల్లోనూ సిజేరియన్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నవారు, సహజమైన, వ్యాధుల రహిత ప్రసవాన్ని ప్రసవానంతర సేవలు కోరుకునే వారు వీరిని ఎంచుకుంటున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లోనూ.. నగరానికి చెందిన ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 2011లో దేశంలో మొట్టమొదటి మిడ్ వైఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మిడ్ వైఫ్ విధానాన్ని ప్రభుత్వాస్పత్రుల వరకూ విస్తరించే దిశగా పరిశీలన చేస్తోంది. ఇటీవల నేషనల్ మిడ్ వైఫ్ కోర్సులు సైతం ప్రారంభమయ్యాయి. దీని వల్ల కొత్తగా ట్రైనింగ్ పొందిన మిడ్ వైఫ్స్ ఈ రంగంలోకి వస్తున్నారు. ఏదేమైనా నేచురల్ డెలివరీల పట్ల పెరుగుతున్న అవగాహన, ఆసక్తి వల్ల మిడ్ వైఫ్ విధానం నగరవాసులకు ఒక ఆరోగ్యకరమైన, భావోద్వేగపూరితమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. సేవల ధరలు ఇలా.. ఈ మిడ్ వైఫ్ సేవలు అందుకోవాలనుకునే వారి కోసం ప్రాథమిక ప్యాకేజీ రూ.40,000 నుంచి రూ.70,000 వరకూ ఉన్నాయి. ఇందులో గర్భధారణ సమయంలో రెగ్యులర్ కన్సల్టేషన్, 8–10 విజిట్లు, ప్రీ నాటల్ కౌన్సిలింగ్, బర్త్ ప్లాన్ తయారీ, ప్రసవ సమయంలో మిడ్ వైఫ్ సపోర్ట్ (ఇన్–సెంటర్), పోస్ట్‌నాటల్ ఫాలో–అప్ (1 లేదా 2 విజిట్లు) వంటివి ఉంటాయి. అలాగే అడ్వాన్స్డ్ బర్తింగ్ సెంటర్ ప్యాకేజీ : రూ.80,000 నుంచి రూ.1,50,000 వరకూ ఛార్జ్ చేస్తారు. దీనిలో ఉమెన్ ఎడ్యుకేషన్ సెషన్స్ లామాజ్ / బెర్తింగ్ క్లాసెస్ వాటర్ బర్త్ ఎంప్షన్, ఇంటిగ్రేటెడ్ డౌలా (పోషక సహాయం) సపోర్ట్, బర్తింగ్ టబ్, సౌండ్ థెరపీ, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటాయి. అదే విధంగా హోం బర్త్ ప్యాకేజీ ఎంచుకుంటే రూ.1,20,000 – రూ.2,00,000 వరకూ ఖర్చు అవుతుంది. దీనిలో భాగంగా మిడ్ వైఫ్ + అసిస్టెంట్ బృందం ఇంటికి వస్తారు. మానిటరింగ్ ఎక్విప్మెంట్ అమరుస్తారు. అత్యవసర జాగ్రత్తల కోసం హాస్పిటల్ సపోర్ట్.. వంటివి ఉంటాయి. కొందరు మిడ్ వైఫ్స్ వ్యక్తిగతంగానూ సేవలు అందిస్తూ తమ ప్రతి విజిట్కూ రూ.2,000 నుంచి రూ.4,000 మధ్య ఛార్జ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆరోగ్య బీమా సంస్థలు మిడ్ వైఫ్ సేవలను కవరేజ్ ఇవ్వడంలేదు. దీంతో కొన్ని బర్తింగ్ సెంటర్లు తమదైన పాలసీలను కూడా అందిస్తున్నాయి. ( చదవండి: హార్ట్ ఫెయిల్యూర్ అంటే..? ఈ పరిస్థితి ఎందువల్ల వస్తుంది..) -
‘ఆపరేషన్’ సిజేరియన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించి, సహజ ప్రసవాలను పెంచేందుకు వైద్య శాఖ కృషి చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో సిజేరియన్లు 10 నుంచి 15 శాతానికి మించకూడదు. కాగా, 2023–24లో రాష్ట్రంలో ఏడు లక్షలకు పైగా ప్రసవాలు జరగ్గా, వీటిలో 4.48 లక్షల ప్రసవాలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేశారు. వీటిలో 50 శాతం మేర సిజేరియన్ ఆపరేషన్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు అవసరం లేకపోయినా చేసిన సిజేరియన్ ఆపరేషన్లే. ఇలాంటి ప్రసవాలు చేసిన ఆస్పత్రులపై వైద్య శాఖ చర్యలకు ఉపక్రమించింది.ఇందులో భాగంగా వంద శాతం సిజేరియన్లు చేసిన డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోని 104 నెట్వర్క్ ఆస్పత్రులకు ఇటీవల షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీటికి ఆ ఆస్పత్రుల యాజమాన్యాలు ఇప్పటికే వివరణ ఇచ్చాయి. సాధారణ ప్రసవం చేయడానికి వీల్లేని పరిస్థితుల్లో గర్భిణులు ఆస్పత్రులకు రావడం వల్లే సిజేరియన్ ఆపరేషన్లు చేసినట్లు అన్ని ఆస్పత్రులు వివరణ ఇచ్చినట్టు తెలిసింది. అదే విధంగా తొలి కాన్పు సిజేరియన్ ఉండటం వల్ల రెండో కాన్పు కూడా సిజేరియన్ చేశామన్నారు. ఆస్పత్రులు ఇచ్చిన వివరణలను వైద్య శాఖ అధికారులు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆస్పత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. కర్నూలులో అత్యధికంగా సిజేరియన్లు 2023–24లో రాష్ట్రవ్యాప్తంగా 3.28 లక్షలు సిజేరియన్ ప్రసవాలు జరిగాయి. సిజేరియన్ ఆపరేషన్లలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో 23,500 సిజేరియన్లు జరగ్గా, వీటిలో 16,678 ప్రైవేటు ఆస్పత్రుల్లో చేశారు. 20,059 సిజేరియన్లతో పశి్చమ గోదావరి రెండో స్థానంలో, 19,855తో అనంతపురం మూడో స్థానంలో ఉన్నాయి.45 శాతం అనవసరమే సిజేరియన్ ప్రసవాలను నియంత్రించడంలో భాగంగా 2022 ఏప్రిల్ నుంచి అక్టోబర్ మ«ధ్య రాష్ట్రవ్యాప్తంగా 62 ఆస్పత్రుల్లో 278 ఆపరేషన్లపై వైద్య శాఖ ఆడిట్ నిర్వహించింది. వీటిలో 155 సిజేరియన్లు ( 55 శాతం) గర్భిణుల ఆరోగ్య పరిస్థితి, ఇతర కారణాలతో అవసరం మేరకే చేసినట్లు తేలింది. మరో 72 కేసుల్లో (26 శాతం) అవసరం లేకపోయినా సిజేరియన్ ఆపరేషన్లు చేసినట్టు ఆధారాలతో తేలింది.. మిగిలిన 53 కేసుల్లో (19 శాతం) సిజేరియన్‌కు అవసరమైన ఆధారాలు ఏమీ లేనట్టు తేలింది. అంటే 45 శాతం సిజేరియన్లు అవసరం లేకుండానే చేసినట్లు తేలింది.⇒ ప్రైవేట్ ఆస్పత్రులు సిజేరియన్ల వైపు మొగ్గు చూపడానికి కారణాలు ⇒ సాధారణ ప్రసవంతో పోలిస్తే సిజేరియన్‌కు ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం ఇస్తున్న ఫీజు ఎక్కువగా ఉండటం ⇒ సాధారణ ప్రసవం చేయాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో గర్భిణి, కడుపులోని బిడ్డ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తూ ఉండాలి. ఇందుకోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిపుణులైన నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండరు.⇒ సాధారణ ప్రసవానికి ప్రయతి్నస్తున్న సమయంలో కొన్ని సందర్భాల్లో సిజేరియన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో చిన్నపాటి నర్సింగ్ హోమ్‌లు, ఆస్పత్రులకు ప్రత్యేకంగా 24/7 ఆనస్తీíÙయా వైద్యుడు అందుబాటులో లేకపోవడం. ⇒ యువ వైద్యుల్లో సాధారణ ప్రసవాలు చేయడానికి తగినంత అనుభవం, ఆత్మవిశ్వాసం లేకపోవడం. ⇒సిజేరియన్ ప్రసవం వల్ల కలిగే సమస్యలను వివరించి, సాధారణ ప్రసవానికి సిద్ధపడేలా గర్భిణి, కుటుంబ సభ్యులను కౌన్సెలింగ్ చేసే ప్రయత్నం కూడా చేయకపోవడం. -
ఒక్కో సహజ ప్రసవానికి రూ.3వేలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సహజ ప్రసవాలను ప్రోత్సహిస్తూ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సహజ ప్రసవాలు చేసే వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు ఖరారు చేస్తూ వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. దీని ద్వారా ఒక్కో సహజ ప్రసవానికి రూ.3 వేల చొప్పున చెల్లిస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) మొదలుకొని బోధనాస్పత్రుల వరకూ అన్ని స్థాయిల ఆస్పత్రులకు ఈ నిబంధన వర్తిస్తుందని రిజ్వీ పేర్కొన్నారు. వివిధ స్థాయిల ఆస్పత్రుల్లో 2021–22 సంవత్సరంలో ఎన్ని సహజ ప్రసవాలు చేశారన్న విషయాన్ని లెక్కించి, ఆ మొత్తంలో 85 శాతాన్ని గీటురాయిగా పరిగణిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ఆయా ఆస్పత్రుల్లో చేసే ప్రసవాల్లో కనీసం 85 శాతం సహజ కాన్పులు చేయాల్సి ఉంటుంది. అంటే 85 శాతం కంటే అధికంగా చేసిన సహజ కాన్పులను లెక్కించి, ఒక్కో కాన్పుకు రూ.3 వేల చొప్పున వైద్య సిబ్బందికి అందజేస్తారు. ఇప్పటికే ఏయే స్థాయి ఆస్పత్రుల్లో సగటున నెలకు ఎన్ని ప్రసవాలు చేస్తున్నారు? అందులో సహజ ప్రసవాలెన్ని? అనే వివరాలు సేకరించారు. ఆ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. బోధనాస్పత్రుల్లో నెలకు 350, జిల్లా ఆస్పత్రులు, మాతాశిశు సంరక్షణ ఆస్పత్రుల్లో నెలకు 250, ఏరియా ఆస్పత్రుల్లో నెలకు 150, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు 50, 24 గంటలపాటు పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు 10, సాధారణ పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు 5 సహజ ప్రసవాలను గీటురాయిగా నిర్ణయించారు. ఆ మైలురాయిని అధిగమించిన ఒక్కో ప్రసవానికి వైద్య సిబ్బందిలో డాక్టర్‌కు రూ.వెయ్యి, మిడ్వైఫ్/స్టాఫ్‌నర్సు/ఏఎన్ఎంకు రూ.వెయ్యి, ఆయా/పారిశుధ్య సిబ్బందికి రూ.500, ఏఎన్ఎంకు రూ.250, ఆశా కార్యకర్తకు రూ.250 చొప్పున మొత్తంగా రూ.3 వేలు ఒక్కో కాన్పుకు చెల్లిస్తారు. ప్రతి ప్రసవ సమాచారాన్ని ఆస్పత్రిలో ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉంటుందని రిజ్వీ వివరించారు. -
ఆపరేషన్లు లేకుండా కాన్పులు!
సాక్షి, హైదరాబాద్: సహజ ప్రసవాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాన్పుల్లో శస్త్ర చికిత్సలను తగ్గించాలని భావి స్తోంది. కాన్పు సమయంలో శస్త్ర చికిత్స (ఆపరేషన్లు)ల తీరు రాష్ట్రంలో ప్రమాదకరంగా ఉంది. వైద్య ప్రమాణాల ప్రకారం కాన్పు శస్త్రచికిత్సలు 15 శాతానికి మించొద్దు. కానీ, ఈ విషయంలో తెలంగాణ 58 శాతంతో దేశం లోనే మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ ఆరో గ్య సంస్థసహా పలు అంతర్జాతీయ, జాతీయ సంస్థలు మన రాష్ట్రంలో కాన్పు శస్త్ర చికిత్సల పెరుగుదలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తు న్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ శస్త్రచికిత్స కాన్పులే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కొత్తగా ‘మిడ్ వైఫరీ నర్సు ప్రాక్టీషనర్ డిప్లొమా’కోర్సును ప్రారంభిస్తోంది. గ్రామాల్లో సంప్రదాయంగా ఉండి ఇప్పుడు కనుమరుగైన వ్యవస్థను శాస్త్రీయ కోర్సు రూపంలో అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. మొదటగా ఈ నెల 15న కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ కోర్సును ప్రారంభిస్తోంది. 18 నెలలపాటు శిక్షణ ‘మిడ్ వైఫరీ నర్సు ప్రాక్టీషనర్ డిప్లొమా’ కోర్సు 18 నెలలు ఉంటుంది. ఒక బ్యాచ్‌లో 30 మందికి శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో వసతి, భోజన సౌకర్యాలను ప్రభుత్వమే భరిస్తుంది. జీఎన్ఎం/బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ప్రభుత్వ సర్వీస్‌లో ఉన్న 40 ఏళ్లలోపు వారు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. కాన్పు చికిత్సలో మూడు నుంచి ఐదేళ్ల అనుభవం కలిగి మిడ్ వైఫరీ కోర్సుపై ఆసక్తి ఉన్న స్టాఫ్ నర్సుల (రెగ్యులర్, కాంట్రాక్టు)ను ఈ కోర్సుకు ఎంపిక చేస్తారు. శిక్షణ అనంతరం వీరిని జిల్లాలో ప్రస వాలు అధికంగా జరిగే ఆస్పత్రుల్లో నియ మిస్తారు. వీరికి రెగ్యులర్ వేతనానికి అదనంగా నెలకు రూ.15 వేలు చెల్లిస్తారు. సహజ ప్రసవా లకు నమ్మకమైన నిపుణులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కోర్సును నిర్వహించనున్నారు. గర్భధారణ జరిగినప్పటి నుంచి మహిళకు అవసరమైన వైద్యసహాయం, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నవజాతశిశువుకు అందించాల్సిన సేవలపై శిక్షణ ఉంటుంది. ప్రసవ మరణాలను నిరోధించడమే లక్ష్యం గర్భధారణ, ప్రసవ సంబంధ కారణాలతో కలిగే అనారోగ్యాలను, మరణాలను నిరోధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తల్లీ బిడ్డల సంరక్షణకు అవసరమైన అన్ని చర్యలను, జాగ్రత్తలను తీసుకునేలా చేయాలని, మాతృత్వం మధురమైన అనుభూతిగా మిగలాలని ప్రభుత్వం మిడ్ వైఫరీ కోర్సును ప్రవేశపెడుతోంది. సహజకాన్పుల కోసం వృత్తి నిపుణులను తీర్చిదిద్దడం దేశంలోనే మొదటిసారి. – వాకాటి కరుణ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ -
భర్త కన్నప్ప
తండ్రిది పేగుబంధం. కాబట్టి... కన్న కూతురికి చిన్న కష్టం వచ్చినా ఆ కన్నపేగు కలుక్కుమంటుంది. మరి భర్తది?... కట్టిపడేసిన తాడు బంధం. కానీ... భార్య గర్భందాల్చాక ఆ తాడుబంధం తోడుబంధం కావాల్సిందే. భర్తగా మీరు మీ భార్యను ఎంతగా ప్రేమించినా బిడ్డను కడుపున మోయలేరుగా! భార్యను ఎంత ఇష్టంగా చూసుకున్నా పురిటి నొప్పులు మీరు పడలేరుగా! భార్యను ఎంత గారాం చేయాలనుకున్నా వేవిళ్లు మీరు తెచ్చుకోలేరుగా! నిజమే... మీరు కనలేరు. బాధనూ కనలేరు. బిడ్డనూ కనలేరు. అందుకే మీరు భర్త ‘కన్న’ప్ప అయిపోండి. భర్తగా బాధ్యత పంచుకోండి. మీ భార్య ‘కన్న’ కలలను నెరవేర్చండి. ఆమె పురిటినొప్పులను మరిచేంతగా గారాం చేయండి. అన్ని జాగ్రత్తలను దగ్గరుండి మీరే తీసుకోండి. తన ఇంట పండంటి పాప నడయాడాలని కోరుకున్న ప్రతి భర్తా... తన భార్యను కంటిపాపలా చూసుకోవాలి. కంటి పాప బాగుంటేనే కదా చంటిపాపైనా, ఇంటి పాపైనా ఆరోగ్యంగా ఉండేది! అందుకోసం తొలుత దృష్టిసారించాల్సింది క్రమం తప్పకుండా కావాల్సిన ఆమె ఫాలో అప్లు. గర్భవతికి ఇచ్చే సంరక్షణలో ఒక్కరిని చూసుకుంటే ఇద్దరిని చూసుకున్నట్టు! అలా చూసేవాడే నిజమైన హీరో. గర్భవతిని ఒక్కసారి హాస్పిటల్‌కు తీసుకెళ్తే... ఇద్దరిని తీసుకెళ్లినట్లు... ఈ ఒక్క చర్యతో ఈ లోకంలోకి రాబోయే చిన్నారికి మరో వందేళ్ల జీవితాన్ని భరోసాగా ఇచ్చినట్టే! ఇక్కడి తొమ్మిదంశాలపై దృష్టిసారిస్తే తొమ్మిది నెలల భారాన్ని భర్తా మోసినట్టే... గర్భవతి తన కడుపున బిడ్డను మోసే వ్యవధి తొమ్మిది నెలలు. దీనికి సరిగా భర్త కనీసం తొమ్మిది అంశాలపై దృష్టి నిలిపితే నవమాసాల తర్వాత కువకువలడే చిన్నారి నట్టింట్లోని ఉయ్యాలలోకి వచ్చేస్తుంది. ఆ తొమ్మిది అంశాలివి... తొలి ప్రాధాన్యం సహజ ప్రసవం కోసం... గర్భం దాల్చిన ప్రతి మహిళా తనకు సహజ ప్రసవం (వెజైనల్ డెలివరీ) కావాలని కోరుకుంటుంది. ప్రసవం తర్వాత కోలుకునే సమయం తక్కువ కావడం, అంతా స్వాభావికంగా జరిగిపోవడం వంటి కారణాల వల్ల ఆమెలో ఈ కోరిక ఉంటుంది. అయితే... ఏదైనా ముప్పు వాటిల్లితే, పెద్ద ప్రాణాన్ని, చిన్న ప్రాణాన్ని కాపాడుకునేందుకు ఆధునిక వైద్యశాస్త్రం శస్త్రచికిత్స ప్రక్రియను ఆవిష్కరించింది. అదే సిజేరియన్. దీనికి తోడు కాన్పు కష్టమవుతుందని అనిపిస్తే ఆ సమయంలో అనుసరించాల్సిన ప్రణాళికను బట్టి డెలివరీ విధానాలను ఎంచుకుంటారు. మొదట అసిస్టెడ్ వెజైనల్ డెలివరీ, ఫోర్సెప్స్ డెలివరీ... కోసం ప్రయత్నిస్తారు. ఇవేవీ కుదరకపోతే సిజేరియన్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ తల్లి, బిడ్డ ఇద్దరి క్షేమం కోరుతూ చేసే ప్రసవాలు. సహజ ప్రసవం అంటే... చాలామందిలో యోని మార్గం ద్వారా బిడ్డ సునాయాసంగా బయటకు వచ్చేస్తుంది. నిర్దిష్టంగా ఏ సమయానికి ప్రసవం జరుగుతుందనేది ఎవరూ చెప్పలేరు. కానీ 36 వారాల గర్భధారణ సమయం పూర్తయ్యాక దాదాపుగా 37 – 40 వారాల మధ్యలో ఈ ప్రవసం జరుగుతుంది. రకరకాల ప్రసవాలివి... ప్రసవాలు అనేక రకాలుగా చేస్తారు. వీటన్నింటిలో యోని ద్వారా ప్రసవం కావడం సహజమైన ప్రక్రియ. తల్లి, బిడ్డ పరిస్థితిని బట్టి... ప్రతి గర్భవతి విషయంలో వారివారికి ఎదురయ్యే సంక్లిష్టతలు వేరుగా ఉంటాయి. వాటిని బట్టి వారికి అనుసరించాల్సిన ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. దానిని డాక్టర్లు నిర్ణయిస్తారు. అసిస్టెడ్ / ఆపరేటివ్ వెజైనల్ డెలివరీ: సాధారణ ప్రసవం జరిగే సమయంలో అసిస్టెడ్ డెలివరీ ప్రక్రియ సహాయపడుతుంది. ఈ ప్రక్రియలో శిశువు తల వద్ద శూన్య ప్రదేశం (వ్యాక్యూమ్) ఏర్పరచడం ద్వారా ప్రసవం తేలిగ్గా అయ్యేలా చూస్తారు. ఇది ప్రసవ సమయంలో అక్కడి పరిస్థితిని బట్టి డాక్టర్లు ఎంచుకునే ప్రక్రియ. ఇందులో డాక్టర్లు చిన్నారి తల వద్ద ఒక వాక్యూమ్ పంప్‌ను పంపుతారు. ఈ ప్రక్రియను అవలంబించడం వల్ల ద్వారా యోని మార్గం (బర్త్ కెనాల్) నుంచి బిడ్డ ప్రసవం తేలిగ్గా అయ్యేలా చూడవచ్చు. ఫోర్సెప్స్ డెలివరీ : ఈ ప్రక్రియలో యోని మార్గం ద్వారా బిడ్డను బయటకు తీసుకు వచ్చేందుకు డాక్టర్లు ఫోర్సెప్స్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. దీని ద్వారా బయటకు వచ్చేందుకు వీలుగా చిన్నారి తలకు ఒక మార్గదర్శనం దొరుకుతుంది. ఫలితంగా బిడ్డ తేలిగ్గా బయటకు వస్తుంది. సిజేరియన్ (సి–సెక్షన్) డెలివరీ : ఈ తరహా ప్రసవంలో పొట్ట మీది నుంచి గర్భసంచికి చిన్న గాటు (కోత) పెడతారు. బిడ్డను ఇలా బయటకు తీయడం అనేది ఒక్కోసారి ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. కొన్నిసార్లు సాధారణ ప్రసవం కష్టమైనప్పుడు... అంటే గర్భసంచి బిడ్డ కదలికలు మొదలయ్యి... బయటకు రావడానికి కష్టమవుతుంటుంది. అప్పుడు బిడ్డకు శ్వాస అందదు. అప్పుడు తక్షణం సిజేరియన్ చేయడానికి నిర్ణయం తీసుకుంటారు. అలాగే కడుపులో బిడ్డ అపసవ్య దిశలో ఉండడం, పేగు మెడకు చుట్టుకోవడం వంటి కాంప్లికేషన్స్ ఉన్నా కూడా సి సెక్షన్ చేయాల్సి రావచ్చు. వ్యాయామ రీతులు అనుసరించేలా చూడటం... క్రమం తప్పకుండా వ్యాయామం : గర్భంతో ఉన్నప్పుడు రోజూ వ్యాయామం చేయడం వల్ల పెల్విస్ కండరాలు, కాళ్లలో ఉండే కండరాలకు బలం చేకూరుతుంది. వీటిలో కీగల్స్ అనే తరహా వ్యాయామాలు కీలకం. పెల్విస్ స్ట్రెచెస్, టిల్ట్స్, డీప్ స్క్వాట్స్ లాంటివి చేయడం ద్వారా పెల్విస్ కండరాలు గట్టిపడి నార్మల్ డెలివరీకి దోహదం చేస్తాయి. అయితే పొట్ట మీద ఒత్తిడి పడే వ్యాయామాల వల్ల మొదటికే మోసం రావచ్చు. కాబట్టి డాక్టర్ సూచించిన వ్యాయామాలను మాత్రమే చేయించాలి. బ్రీతింగ్ వ్యాయామాలు : ఇవి తల్లిలోని ప్రతి అవయవానికి ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యాన్ని పెంచి, బిడ్డనూ ఆరోగ్యంగా ఉంచుతాయి. ∙ప్రీనేటల్ యోగా: గర్భం దాల్చిన మహిళ మనసు ఎప్పుడూ శాంతంగా ఉండాలి. ప్రీ–నేటల్ యోగాసనాలు శరీరానికి సాగేగుణాన్నీ (ఫ్లెక్సిబిలిటీ) పెంచుతాయి. గర్భిణి వ్యాయామం చేసేటప్పుడు భర్త దగ్గర ఉండడం చాలా అవసరం. ప్రతికూలమైన అంశాలకు దూరంగా ఉండటం... ప్రసవ సమయంలో వారికి ఎదురైన చేదు అనుభవాలను గూర్చి ఎవరైనా చెబుతుంటే, గర్భిణి వాటిని వినకపోవడమే మంచిది. ఎందుకంటే పురిటి నొప్పులు, వాటి వల్ల కలిగే ఇబ్బందులు... ప్రతి ఒక్కరికీ ఒకేలా ఉండవు. అంతేకాదు... ఒకే మహిళలో సైతం నొప్పులు ఒక కాన్పులో ఉన్నట్లు మరొక కాన్పులో ఉండవు, తేడాలు ఉంటాయి. కాబట్టి ప్రసవం నొప్పుల గురించి ఆందోళన పడడం కంటే మానసికంగా సిద్ధమై ధైర్యంగా ఉండాలి. నొప్పులు లేకుండా ప్రసవం అయ్యేందుకు ‘పెయిన్లెస్ డెలివరీ’లు కూడా చేస్తున్నారు. దీన్నే ‘ఎపిడ్యూరల్ ఎనాల్జీషియా’ అంటారు. ఇతరుల చేదు అనుభవాలు భార్య దరిజేరకుండా భర్త కూడా జాగ్రత్త తీసుకోవాలి. సమతుల ఆహారం అందించడం సరైన పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. దీనివల్ల తల్లి ఆరోగ్యమే కాకుండా, బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆకుకూరలు, తాజాపండ్లు, పాలు, గుడ్లు, మాంసకృత్తులు ఎక్కువగా తీసుకోవాలి. రక్తహీనత రాకుండా కాపాడుకోవాలి. గర్భిణికి మంచి ఆహారాన్ని సమకూర్చడం, ఆమెకి తినాలనిపించిన రుచుల కోరిక తీర్చాల్సిన బాధ్యత భర్తదే. గర్భం... ప్రసవంపై అవగాహన! ప్రీ–నేటల్ బర్త్ విషయంలో నిర్వహించే తరగతులకు భార్యతోపాటు భర్త కూడా వెళ్లాలి. డాక్టర్‌ను అడిగి మీలో కలిగే చిన్న చిన్న సందేహాలను సైతం తీర్చుకోవాలి. ప్రెగ్నెన్సీకి సంబంధించిన పుస్తకాలు ఇద్దరూ చదవాలి. వాటి వల్ల ప్రసవం గురించి కలిగే అపోహలు తొలగిపోతాయి. అప్పుడు ధైర్యంగా ఉండగలుగుతారు. కంటి నిండా నిద్ర! గర్భవతులు నిద్రకు తగినంత ప్రాధాన్యం ఇవ్వాలి. సాధారణ సమయంలో నిద్ర కంటే గర్భిణికి ఎక్కువ నిద్ర అవసరం. ఏడో నెల దాటాక మధ్యాహ్నం నిద్ర తప్పనిసరి. దానివల్ల బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది. ప్రసవం కోసం ఆసుపత్రికి ఎప్పుడెళ్లాలి? గర్భం దాల్చారని తెలిసినప్పటి నుంచి ఓ చిన్నారి పాపాయి ఎప్పుడెప్పుడు తమ చేతుల్లోకి వస్తుందా, ఎప్పుడు తమ ఒళ్లోకి వస్తుందా అని చాలా ఆత్రుతగా ఎదురుచూస్తారు. ప్రసవించే తేదీని ఉజ్జాయింపుగా డాక్టర్లు చెప్పిన నాటి నుంచి ఆ అద్భుతమైన ప్రసవ ఘడియ కోసం కాబోయే తల్లిదండ్రుల పాటు బంధుమిత్రులంతా ఉద్విగ్నంగా వేచిచూస్తారు. అయినా ప్రసవం అయ్యే తేదీ నిర్దిష్టంగా ఫలానా రోజనీ, ఫలానా సమయానికి తప్పక నొప్పులు వస్తాయని ఎవరూ చెప్పలేరు. అయినప్పటికీ కొన్ని సూచనల ద్వారా ప్రసవ చిహ్నాలను గుర్తుపట్టవచ్చు. అవి... ⇒ ఇది మొదటి గర్భ ధారణ అయితే... ప్రవవానికి కొద్ది రోజుల ముందు పొట్ట బరువంతా కిందికి జారినట్లుగా అనిపిస్తుంది. దాంతో తుంటి మీద బరువు తగ్గిన అనుభూతి ఉంటుంది. ⇒ రుతుస్రావం సమయంలో కండరాలు బిగుసున్న రీతిలోనే పొట్టపై కండరాలు బిగుసుకుపోతూ, వదులవుతుంటాయి. కొద్ది కొద్దిగా మ్యూకస్ జిగురు పదార్థం గర్భాశయ ముఖద్వారం నుంచి స్రవించడం వల్ల అక్కడి ప్రాంతం వదులవుతున్న అనుభూతి కలుగుతుంది. ⇒ ఉమ్మనీటి సంచి (బిడ్డ చుట్టూ ఆవరించుకుని ఉండే ద్రవం ఉన్న సంచి) అకస్మాత్తుగా పగిలిపోయి ఒక్కసారిగా ఉమ్మనీరంతా యోని నుంచి బయటకు చిమ్ముతుంది. ⇒ అప్పటి వరకూ అనుభవంలోకి వచ్చిన బిడ్డ కదలికలు కాస్త మందగిస్తాయి. ⇒ యోని నుంచి రక్తస్రావం లేదా అదేపనిగా నొప్పి కనిపిస్తాయి. పైన పేర్కొన్న లక్షణాల్లో ఏవైనా మీకు కనిపిస్తుంటే వెంటనే మీరు డాక్టర్‌ను సంప్రదించాలని గుర్తుంచుకోండి. రకరకాల ఇన్ఫెక్షన్స్ గర్భధారణ సమయంలో యోనిలో ఇన్ఫెక్షన్స్ రావడం చాలా సాధారణం. అందుకే ఆ సమయంలో డాక్టర్ సూచించిన మేరకు తరచూ వైద్యపరీక్షలు చేయించుకోవాలి. గర్భధారణ సమయంలో యోని సంబంధితమైన ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే డాక్టర్లు వాటికి తగిన మందులు ఉపయోగించి సురక్షితమైన ప్రసవం జరిగేలా చూస్తారు. యోనిలో ఇన్ఫెక్షన్: గర్భం దాల్చి ఉన్న సమయంలో మహిళల్లో యోనిలో ఇన్ఫెక్షన్ రావడం చాలా సాధారణ సమస్య. మరీముఖ్యంగా రెండో త్రైమాసికంలో. ఈ ఇన్ఫెక్షన్ క్యాండిడా అనే ఒక రకమైన ఫంగస్ వల్ల వస్తుంది. ఇక బ్యాక్టీరియల్ ప్రజాతికి చెందిన సూక్ష్మజీవుల పెరుగుదల వల్ల కూడా యోనిలో ఇన్ఫెక్షన్స్ రావచ్చు. యోని సంబంధమైన ఇన్ఫెక్షన్ కనిపించినప్పుడు డాక్టర్ సహాయం తీసుకోండి. మీ సమస్య తీవ్రత, లక్షణాల తీవ్రత ఆధారంగా డాక్టర్లు తగిన చికిత్స అందిస్తారు. మూత్రనాళ ఇన్ఫెక్షన్ : గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల మూత్రనాళంలోనూ కొన్ని మార్పులు వస్తాయి. ఇవి మహిళల్లో మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ వచ్చేందుకు ఆస్కారమిస్తాయి. దీనికి తోడు గర్భవతుల్లో గర్భసంచి క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఇవి మూత్రకోశం (బ్లాడర్)పై క్రమంగా ఒత్తిడిని పెంచుతూ పోతుంది. ఫలితంగా మూత్రవిసర్జనకు వెళ్లినప్పుడు మూత్రం అంతా బయటకు వెళ్లక కొంత మూత్రం లోపలే మిగిలిపోయేలా చేస్తుంది. ఇలా అక్కడే నిలిచిపోయిన మూత్రం ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. సమయానికి దీనికి చికిత్స అందించకపోతే అది మూత్రపిండాలను సైతం దెబ్బతీయవచ్చు. మూత్రనాళ ఇన్ఫెక్షన్ సమస్య చాలా అరుదుగా మాత్రమే తీవ్రమైన ఆరోగ్య సమస్యను ఎచ్చిపెడుతుంది. అది తీవ్రమైన ప్రభావం గనక చూపిందంటే... ఆ ఇన్ఫెక్షన్ మూత్రపిండాల వరకు పాకుతుంది. గర్భందాల్చినప్పుడు ఇలాంటి దుష్ప్రభావాల వల్ల నెలలు నిండకముందే ప్రవసం కావడం, తక్కువ బరువుతో నెల తక్కువ బాలలు పుట్టడం వంటి సమస్యలు వస్తాయి. సహాయం కోసం డాక్టర్‌ను ఎప్పుడు కలవాలి? ⇒ చాలా ఎక్కువ మొత్తంలో తెల్లబట్ట అవుతున్నప్పుడు ⇒ యోనిలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లుగా లక్షణాలు కనబడుతున్నప్పుడు ⇒ మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ ఉన్న లక్షణాలు కనబడుతున్నప్పుడు రెగ్యులర్‌గా మందులు... భార్య క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించేలా చూడాల్సిన బాధ్యత భర్తదే. డాక్టర్ రాసిన మందులు... అంటే ఫోలిక్ యాసిడ్, ఐరన్, క్యాల్షియమ్ టాబ్లెట్స్ లాంటివి తప్పనిసరిగా వాడేలా చూడాలి. ఆమెకి తినాలనిపించినవ రుచులు కూడ. భార్య ప్రసవ వేదనను భర్త అనుభవించడు. కనీసం పైన పేర్కొన్న తొమ్మిదంశాలను పాటిస్తే భార్యపడే అదనపు వేదనను పంచుకున్నవాడవుతాడు. డాక్టర్ పి. సరోజ సీనియర్ కన్సల్టెంట్, ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ బర్త్‌రైట్ బై రెయిన్ బో, ఎల్.బి.నగర్ హైదరాబాద్