breaking news
Nalin Singh
-
బీహెచ్ఈఎల్ సీఎండీగా నలిన్ షింగల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్ సంస్థ బీహెచ్ఈఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నలిన్ షింగల్ నియమితులయ్యారు. ఈనెల ఒకటో తేదీ నుంచి ఐదేళ్లు ఈయన పదవీకాలం ఉండనుందని కంపెనీ ప్రకటించింది. ఉద్యోగ విరమణ, తదుపరి ఆదేశాలకు లోబడి పదవీకాలం ఉంటుందని స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో వివరించింది. -
ఇండియా ఫండ్ ఫెస్ట్‌కు 6,527 దరఖాస్తులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బిజినెస్ స్ట్రాటజీ కన్సల్టింగ్ కంపెనీ నేషియో కల్టస్ నిర్వహిస్తున్న ఇండియా ఫండ్ ఫెస్ట్‌కు 21 దేశాల నుంచి 6,527 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 663 కంపెనీలు షార్ట్‌లిస్ట్ కాగా, మోస్ట్ ఫండబుల్ స్టార్టప్స్ జాబితాలో 42 నిలిచాయని ఫెస్టివల్ మెంటార్ నళిన్ సింగ్ తెలిపారు. మే 12న బెంగళూరులో జరిగే ఫెస్ట్‌లో ఏంజెల్ ఇన్వెస్టర్లు, పెట్టుబడి సంస్థలతో ఈ 42 కంపెనీలు భేటీ అవుతాయని చెప్పారు. నేషియో కల్టస్ రూపొందించిన ఫండింగ్ రెడీనెస్ స్కోరు ఆధారంగా షార్ట్ లిస్ట్ అయిన కంపెనీలకే ఇన్వెస్టర్లు నిధులు సమకూరుస్తారని వివరించారు. మోస్ట్ ఫండబుల్ స్టార్టప్స్ జాబితాలో షోస్క్వేర్డ్, బ్లూ వాటర్ ఆల్కలైన్ సొల్యూషన్స్ తదితర 8 కంపెనీలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవని ఫెస్టివల్ చైర్మన్ దినేశ్ సింగ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. వ్యాపారానికి ఉన్న శక్తి, ఉత్పాదన, సేవల పరిపక్వత, మార్కెట్ అవకాశాలు, ఎంత పెట్టుబడి పెట్టొచ్చు, బలాలు, సవాళ్లు, వ్యవస్థాపకుల సామర్థ్యం వంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఫండింగ్ రెడీనెస్ రిపోర్టును నేషియో కల్టస్ తయారు చేస్తోంది.