breaking news
myskin
-
నేనే గనుక నిర్మాతనైతే ఆ సినిమా ఎప్పుడో రిలీజ్ అయ్యేది: ఆండ్రియా
ఆండ్రియా( Andrea Jeremiah) అంటే నటి మాత్రమే కాదు.. అంతకు మించి. గాయని, రచయిత్రి.. వీటన్నింటికీ మించి బోల్డ్ నటి. ఏ తరహా పాత్రనైనా చేయడానికి వెనుకాడని డేరింగ్ బ్యూటీ అంటూ కోలీవుడ్‌లో గుర్తింపు ఉంది. ఈమె పలు భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్న ఆండ్రియా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ భామ అన్నది గమనార్హం. ఈమె 2014లో నటించిన పిశాచు చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఆ చిత్రానికి సీక్వెల్‌కు దర్శకుడు మిష్కిన్ దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు విజయ్‌సేతుపతి క్యామియో పాత్రను పోషించిన ఈ చిత్రంలో నటి పూర్ణ, సంతోష్ ప్రతాప్, నమితా కృష్ణమూర్తి, అజ్మల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. రాక్పోర్ట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మురుగానందం నిర్మించిన ఈ చిత్రం చాలా కాలం క్రితమే నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని సమస్యల కారణంగా విడుదలలో ఆలస్యం జరుగుతోంది. పైగా పిశాచు–2 చిత్రంలో ఆండ్రియా నటన ఆదుర్స్ అంటూ దర్శకుడు మిష్కిన్ ప్రచారం చేశారు. అయితే గత మూడేళ్లుగా ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. కాగా ఈ చిత్రం విడుదల గురించి ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న నటి ఆండ్రియాను అడగ్గా తాను నటించడం మాత్రమే చేయగలను కానీ చిత్రాన్ని రిలీజ్ చేయగలనా? అని ప్రశ్నించారు. అలాగే తానే నిర్మాతనైనే పిశాచు చిత్రాన్ని ఎప్పుడో విడుదల చేసేదాన్ని అని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా నటి ఆండ్రియా నటించిన మనుషీ చిత్రం కూడా వివాదాల్లో చిక్కుంది. ప్రస్తుతం ఈ భామ నో ఎంట్రీ, మాస్క్ చిత్రాల్లో నటిస్తున్నారు.పిశాచు–2 ఆలశ్యానికి కారణం ఏంటిఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ అనే సంస్థ ‘పిశాచి–2’ విడుదలను అడ్డుకుంది. సినిమా హక్కుల విషయంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ చిత్ర నిర్మాణ సంస్థ రాక్‌ఫోర్ట్ బ్యానర్ వారు తమకు రూ. 4.85 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. చట్టపరమైన వివాదాలతో పాటు ఈ సినిమాలో ఆండ్రియా నగ్నంగా నటించినట్లు దర్శకుడు మిష్కిన్ వెల్లడించారు. అయితే, ఈ సన్నివేశాలను పూర్తిగా చిత్రీకరించలేదని, ఫొటోలు మాత్రమే తీసినట్లు చెప్పారు. ఈ అంశం కూడా సినిమాపై వివాదాన్ని పెంచింది. -
ఆ క్రేజీ డైరెక్టర్‌తో విజయ్ సేతుపతి మరోసారి
అప్పట్లో సినిమా ఛాన్సుల కోసం విజయ్ సేతుపతి తెగ తిరిగాడు. ఇప్పుడు తమ సినిమాల్లో నటించాలని దర్శకులు అతడి చుట్టూ తిరుగుతున్నారు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా డిఫరెంట్ పాత్రల్లో నటిస్తూ బోలెడంత గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు, తమిళ, హిందీల్లో నటిస్తూ 50 చిత్రాల మైలురాయిని టచ్ చేశాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాలు రిలీజ్) విజయ్ సేతుపతి హీరోగా నటించిన 'మహారాజా' సినిమా త్వరలో రిలీజ్ కానుంది. మరోవైపు మిస్కిన్ దర్శకత్వంలో 'పిశాచి 2'లోనూ విజయ్ లీడ్ రోల్ చేశాడు. ఇది కూడా విడుదల కావాల్సి ఉంది. ఇప్పుడు మరోసారి విజయ్‌తో సినిమా చేయాలని మిస్కిన్ ప్లాన్ చేస్తున్నాడు. త్వరలో ఈ ప్రాజెక్ట్ మొదలు కానుంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 ఎలిమినేషన్.. నయని పావని రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) -
పిల్లలు, మహిళలు నా సినిమాలు చూడకండి
సినిమా ప్రమోషన్ సమయంలో ఏ డైరెక్టర్ అయినా మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ప్రచారం చేసుకుంటారు. అయితే తమిళ దర్శకుడు మిస్కిన్ మాత్రం ఇందుకు భిన్నంగా ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. తన సినిమాను చిన్న పిల్లలు, మహిళలు చూడొద్దంటూ తానే ప్రచారం చేస్తున్నాడు. ఇటీవల 'తర్కపు' అనే తమిళ సినిమా ఆడియో ఫంక్షన్ లో పాల్గొన్న మిస్కిన్ ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. పిశాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన మిస్కిన్, ఈ వ్యాఖ్యలతో సౌత్ ఇండస్ట్రీలో సంఛలనం సృష్టిస్తున్నాడు. సినిమా అంటేనే పెద్దలకోసం తీస్తారని, అలాంటి సినిమాలను కుటుంబ సమేతంగా చూడాలనుకోవటం ఏంటని ప్రశ్నిస్తున్నాడు. అంతేకాదు ఒకవేళ మీరు మీ పిల్లలతో కలిసి సినిమా చూడాలి అనుకుంటే ఏ యానిమేటెడ్ సినిమాకో లేక 'మై డియర్ కుట్టిచేతన్' లాంటి చిన్న పిల్లల సినిమాకో వెళ్లండి అంటూ ఘూటుగా స్పందించాడు. డైరెక్టర్ తాను అనుకున్న భావం తెర మీదకు రావటం కోసం కొన్నిసార్లు అసభ్యకరమైన పదాలు వాడక తప్పదని చెప్పాడు మిస్కిన్. తన తదుపరి చిత్రానికి సెన్సార్ బోర్డ్ తప్పకుండా 'ఏ' సర్టిఫికేట్ ఇస్తుందన్న మిస్కిన్... పిల్లలు, మహిళలు మాత్రం ఆ సినిమాను చూడొద్దన్నాడు. ఈ స్టేట్మెంట్ ఇవ్వటంలో మిస్కిన్ ధైర్యాన్నిమెచ్చుకున్నా, ప్రేక్షకుల్లో కేవలం ఒక వర్గం మాత్రమే చూస్తే సినిమా వసూళ్ల విషయంలో కష్టం అంటున్నారు సినీ జనాలు.