breaking news
mosquito story
-
చినబాబు రాకపోతాడా.. దోమకు చప్పట్లు!
బడ్జెట్ మీద చర్చలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి సభలో నవ్వులు పూయించారు. సీరియస్ అంశాలకు కూడా సామెతలు, పిట్ట కథలు చెబుతూ మొత్తం సభలో అందరూ హాయిగా నవ్వుకునేలా చేశారు. ముందుగా 'నందోరాజా భవిష్యతి' కథను గుర్తుచేశారు. రైతు రుణాలు ఎప్పుడు మాఫీ అవుతాయంటే నందోరాజా భవిష్యతి, డ్వాక్రా రుణాలు ఎప్పుడు మాఫీ అవుతాయంటే నందోరాజా భవిష్యతి.. ఇలా ప్రతి అంశానికీ అదే మంత్రం పఠిస్తున్నారన్నారు. అది ఏంటంటే, రాజు గారికి ఇద్దరు భార్యలున్నారని, చిన్నభార్య కొడుకు నందుడని అన్నారు. చిన్న భార్యకు ఊళ్లో అన్నిచోట్లా అప్పులేనని, వాటిని ఎప్పుడు తీరుస్తారంటే.. ఏదో ఒక రోజు నందుడు రాజు కాకపోతాడా, అప్పులన్నీ తీర్చకపోతానా అన్నారన్నారు. అలాగే ఇప్పుడు కూడా ఏదో ఒకరోజు చినబాబు రాకపోతాడా.. రుణమాఫీ చేయకపోతామా, చినబాబు రాకపోతాడా.. డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోతామా అన్నట్లు పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. అలాగే, చివర్లో ఒక దోమ కథ కూడా వినిపించారు. పిల్ల దోమ పుట్టిన తర్వాత తొలిసారి ప్రపంచంలోకి వెళ్లి ఒక రోజంతా తిరిగి వచ్చిందని.. వచ్చిన తర్వాత దాని తల్లి దోమ, తండ్రి దోమ కలిసి ప్రపంచం ఎలా ఉందని అడిగారని రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. దానికి పిల్ల దోమ.. ''నాకింత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని మీరు ఇంతవరకు చెప్పనే లేదు, నేను బయటకు వెళ్లగానే అందరూ చప్పట్లు కొడుతున్నారు'' అందని, మన ప్రభుత్వం తీరు కూడా అలాగే ఉందని అన్నారు. దీంతో ఒక్కసారిగా సభలో నవ్వులు విరిశాయి. -
కేసీఆర్.. దోమ కథ!
-
కేసీఆర్.. దోమ కథ!
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దోమ కథ చెప్పి అందరినీ ఆకట్టుకున్నారు. తెలంగాణ హరితహారం ప్రారంభోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా చిలుకూరులో ఆయన ప్రసంగించారు. దోమ గురించి, ముఖ్యమంత్రి గురించి ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం... ''చెత్త ఎక్కడుంటే అక్కడే దోమ ఉంటది. దోమ ఎవరినైనా కుడతది. ఎమ్మెల్యేని, మంత్రిని, ముఖ్యమంత్రినైనా కుడతది. దానికి అడ్డం లేదు. అది సోషలిస్టు దోమ. తన ఎదురుగా వచ్చేది మంత్రా కాదా.. ఊరి సర్పంచా కాదా.. కుట్టచ్చా కుట్టకూడదా అని చూసి ఆగదు. కుట్టిందంటే ఏ మలేరియానో, చలిజ్వరమో వస్తది.. పోయి దవాఖానలో పడతరు'' అన్నారు. అయితే సీఎం కేసీఆర్ ఏ దోమను ఉద్దేశించి అన్నారో, ఎవరిని కుడుతుందన్నారో, కుడితే ఏమవుతుందని అన్నారన్నది మాత్రం.. పాఠకుల ఊహకే వదిలేస్తున్నాం.