అశోక్ మౌనం ఎందుకో?
షిఫ్ట్ ఆపరేటర్ నుంచి అంగన్వాడీ పోస్టుల వరకు అమ్మకాలే
రైతన్నను నట్టేట ముంచిన ప్రభుత్వం
హైకోర్టు అనుమతి ద్వారా అంగన్వాడీ నియామక పత్రం తెచ్చుకున్నా అమలు చేయని అధికారులు :
మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య
గజపతినగరం రూరల్: విజయనగరం జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గం లో అంగన్వాడీ పోస్టులను స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అంగట్లో అమ్ముకున్నట్లు అమ్మేసుకున్నారని పత్రికల్లో ఆధారాలతో సైతం వెలువడడంతో అధికార పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరి గెడుతున్నాయని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నేత బొత్స అప్పలనరసయ్య అన్నా రు. నీతి,నిజాయితీలకు మారు పేరుగా చెప్పుకుంటున్న కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు పత్రికల్లో వచ్చిన ఈవార్తలకు స్పం దించరా?చూసీ చూడనట్లు వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు. బుధవారం ఆయన గజపతినగరంలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలోని అంగన్వాడీ, షిప్ట్ఆపరేటర్, ఔట్ సోర్సింగ్ పోస్టులు బేరాలు పెట్టి మరీ అమ్ముకోవడం దారుణమన్నారు.
ఇలాంటి దౌర్భాగ్యస్థితి గజపతినగరం నియోజకవర్గానికి గతంలో ఏనాడూ రాలేదని ఆవేదన వెలిబుచ్చారు. అశోక్ గజపతి రాజు వెంటనే స్పందించి అవినీతి అక్రమాలు జరుగుతున్న ఈపోస్ట్లవ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు జరిపించి నిజానిజాలు తేల్చాలని అప్పలనర్సయ్య డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని గంట్యాడ నంబర్ -2 అంగన్వాడీ పోస్టు నియామకం అక్రమంగా జరిగిందంటూ చందక ధనలక్ష్మి హైకోర్టులో నిరూపించి తనకు అర్హత ఉందంటూ నియామ క పత్రం తెచ్చుకున్నా అధికారులు అమలు చేయకుండా తాత్సారం చేస్తుండడం విడ్డూరం గా ఉందన్నారు. ఈ విషయమై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి యోచిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఈ వ్యవహారానికి సంబంధించి నిబంధనలు అతిక్రమించిన అధికారులను వది లి పెట్టేది లేదని హెచ్చరించారు. లోగిశ గ్రామంలో అనర్హులకు పెన్షన్లు మంజూరు చేశారంటూ నిరూపించినా ఎంపీడీఓ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆమెను సైతం వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. చంద్రన్న కానుకలు అంటూ హెరిటేజ్ ప్రొడక్ట్ అమ్మకాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పాటుపడుతున్న సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. సమావేశంలో స్థానిక వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు బూడివెంకటరావు, డి.దేవుడు బాబు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గారతవుడు, స్థానిక పీఏసీఎస్ అధ్యక్షుడు కరణం ఆదినారాయణ పాల్గొన్నారు.