breaking news
MLA Kalamata Venkataramana
-
రెండేళ్లలో పరిష్కారం : కలమట
ఓ నదీ తీర గ్రామంలో ఇన్ని సమస్యలా.. గ్రామంలో పర్యటించిన తరువాత, అక్కడి ప్రజలతో మాట్లాడాక వారు ఎలా బతుకుతున్నారా? అని అశ్చర్యం వేసింది. వందలాది ఎకరాల పంట పొలాల్లో ఇసుక మేటలు వేసినా ఎవరో వచ్చి ఏదో చేస్తారన్న ఆశతోనే రైతులు జీవిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారంలో 2006 నుంచి ప్రభుత్వాలు, జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. నేను దీన్ని రెండేళ్లలో పరిష్కరిస్తాను. ముఖ్యంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళతాను. గతంలో ప్రతిపక్ష నేత గాఉన్నప్పుడు చంద్రబాబు ఈప్రాంతంలో పర్యటించారు. వీరి సమస్యలు ఆయనకు తెలుసు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకు వివరించి నిధులు మంజూరుకు కృషి చేస్తాను. గ్రామం నుంచి గర్బిణులను, రోగులను అత్యంత కష్టం మీద మంచానికి కట్టి వైద్యం కోసం తీసుకు వెళతారు. ఈ కష్టాలను సీఎంకు వివరించి గ్రామాభివృద్ధికి చర్యలు తీసుకుంటాను. ప్రతి ఏడాది వంశధారకు వరదలు వస్తే ఈ గ్రామం జలదిగ్బంధంలో ఉంటుంది. అలాంటప్పుడు జిల్లా కలెక్టర్లు గ్రామాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడి వెళుతున్నా తగిన చర్యలు తీసుకోక పోవడం బాధాకరం. ఇప్పటి కలెక్టర్‌కు సమస్య వివరించి తగిన చర్యలు తీసుకుంటాను. -
బాబు తొలి సంతకాలు ‘హుద్‌హుద్’లో కలిశాయి
* ఎమ్మెల్యే కలమట వెంకటరమణ * రద్దు చేసిన పింఛన్లు పునరుద్ధరించాలి పాతపట్నం : ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార సమయంలో చంద్రబాబు చేసిన ఐదు సంతకాలు హుద్‌హుద్ తుపానులో కొట్టుకుపోయాయని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఎద్దేవా చేశారు. ఆయన శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. చంద్రబాబు రుణమాఫీలు వట్టి బూటకమని అందరికీ తెలుసన్నారు. బెల్టుషాపులు రద్దు చేస్తామని వారం రోజులు హడావుడి చేసి ఆ తరువాత అనుబంధ దుకాణాల పేరుతో మరిన్ని మద్యం దుకాణాలు తెరిచిన ఘనత చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. పింఛనే జీవనాధారంగా బతుకుతున్న వేలాది మంది పింఛన్లు రద్దు చేసిన బాబుకు వారి ఉసురు తగలక తప్పదన్నారు. వివిధ కారణాలతో పాతపట్నం నియోజక వర్గంలో సుమారు 3వేలమంది పింఛన్లు రద్దు చేశారని ఆయన పేర్కొన్నారు. వాటిని వెంటనే పునరుద్ధరించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. గాంధీ జయంతి రోజునే మోసాలకు ఎంచుకున్న బాబు నిరంతర విద్యుత్, రూ.2లకు 20లీటర్లు మినరల్ వాటరు ఏమైందన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లకు కనిపిస్తున్నవి సింగపూర్ లాంటి రాజధాని, ఇసుక అమ్మకాలేనని ఆరోపించారు. ఇసుక విధానంతో పేదవాడు గూడుకట్టుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు గంగు వాసుదేవరావు, ఎన్.లక్ష్మణరావు, ఆర్.రమణ, ఎస్.ప్రభాకరరావు, ఇ.సింహాచలం, ఎ.కర్రెన్న, ఇ.వసంతరావు, బి.అప్పారావు, కె.ఎరకయ్య, ఎన్.సూర్యరావు, జి.లుట్టిబాబు తదితరులు ఉన్నారు.