'మండలానికో మినీ ట్యాంక్‌బండ్'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మండలానికి ఒక మినీ ట్యాంక్‌బండ్‌ను ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు వెల్లడించారు. చెరువుల పునరుద్ధరణపై ఆదివారం హైదరాబాద్‌లో జిల్లా అధికారులతో హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
డిసెంబర్ నుంచి ప్రజల భాగస్వామ్యంతో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ముందుగా ఆసక్తి చూపించే గ్రామాల్లోనే చెరువులు పూడికతీత పనులు ప్రారంభిస్తామన్నారు. చెరువుల్లో పూడిక తీసిన మట్టిని రైతుల పొలాల్లోకి తరలిస్తామని హరీష్ రావు చెప్పారు.
కృష్ణా బోర్డు ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయనుంది. అందుకోసం ఈ రోజు సాయంత్రం హరీష్ రావు న్యూఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర జలవనరులు శాఖ మంత్రి ఉమాభారతిని కలసి కృష్ణా బోర్డు ఆదేశాలపై ఫిర్యాదు చేయనున్నారు.