breaking news
Meena mukheskumar
-
టీడీపీ కోసం సీఈఓ ముకేశ్ కుమార్ కొత్త రూల్
-
సర్కారుదే ‘ఆప్షన్’
అభీష్టానికి భిన్నంగా ఐఏఎస్‌ల కేటాయింపు ఆంధ్రాకు గ్రేటర్ అధికారులు సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఐఏఎస్‌ల కేటాయింపుల అంశం నగరంలో కలకలం రేపింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లోని వివిధ విభాగాల్లో కొనసాగుతున్న కొందరు ఉన్నత స్థాయి అధికారులు తెలంగాణలో ఉండాలని కోరుకున్నప్పటికీ ఆ అవకాశం లభించలేదు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడంతో వారు అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాము తెలంగాణలో ఉంటామని ఆప్షన్ ఇచ్చుకున్నప్పటికీ అవకాశం రాని వారిలో హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా, జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ ఎ.బాబు ఉన్నారు. గతంలో జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్‌గా పనిచేసిన నవీన్‌మిట్టల్ తెలంగాణకు ఆప్షన్ ఇచ్చుకోగా, ఇక్కడేఉంచారు. గ్రేటర్‌లోని కీలక సంస్థలైన జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల ఉన్నతాధికారులిద్దరినీ ఆంధ్రప్రదేశ్‌కే కేటాయించడం హాట్ టాపిక్‌గా మారింది. వీరిలో హెచ్ఎండీఏ కమిషనర్ దాదాపు రెండున్నరేళ్లుగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా సోమేశ్‌కుమార్ గత అక్టోబర్‌లో వచ్చారు. స్పెషల్ కమిషనర్ ఎ.బాబు ఇటీవలే జీహెచ్ఎంసీకి బదిలీపై వచ్చారు. సోమేశ్ కుమార్, నీరభ్‌కుమార్ ప్రసాద్‌లిద్దరూ బీహార్‌కు చెందినవారు. ఇద్దరూ తాము పనిచేస్తున్న సంస్థల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే పేరుంది. సోమేశ్ కుమార్ గత సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా, ఇటీవలి సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు.