ఆర్టీసీ బస్సులో రూ. 3లక్షల నగదు చోరీ
గుంటూరు: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి నుంచి భారీ సొమ్మును దొంగలించిన సంఘటన గుంటూరు జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. మాచర్ల- పిడుగురాళ్ల ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న రమేష్ అనే ధాన్యం వ్యాపారి బ్యాగునుంచి భారీ నగదును దోపిడీ దొంగలు అపహరించారు. తన బ్యాగ్ నుంచి 3లక్షల రూపాయలను దొంగలు అపహరించినట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.