రిలయన్స్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్
రిలయన్స్ రిటైల్ ఎల్వైఎఫ్ బ్రాండులో మరో కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎల్వైఎఫ్ విండ్ 7ఎస్ పేరుతో 4జీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ సపోర్ట్‌తో ఈ ఫోన్‌ను దేశీయ మార్కెట్లోకి ఆవిష్కరించింది. దీని ధర రూ.5,699గా కంపెనీ నిర్ణయించింది. విండ్ 7 విజయంతో విండ్ 7ఎస్ పేరుతో దీన్ని తీసుకొచ్చింది.
ఈ ఫోన్ ఫీచర్లు...
5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే
1.3గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్
2 జీబీ ర్యామ్
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
128 జీబీ వరకు విస్తరణ మెమరీ
8 ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
2250 ఎంఏహెచ్ బ్యాటరీ
9 గంటల 4జీ టాక్‌టైమ్, 5 గంటల వీడియో ప్లే బ్యాక్, 32 గంటల నాన్-స్టాప్ మ్యూజిక్‌ను ఈ ఫోన్ ఆఫర్ చేస్తోంది.