breaking news
lower courts
-
టెక్–ఫ్రెండ్లీగా కింది కోర్టులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతికతకు మరింతగా వినియోగించుకుంటూ కింది స్థాయి న్యాయస్థానాలను ‘టెక్–ఫ్రెండ్లీ’గా తయారుచేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. గురువారం ఆరి్టకల్ 370 రద్దుపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ సమయంలో సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే కింది కోర్టులు సాంకేతిక పుంజుకోవాల్సిన అవసరం ఉందంటూ చేసిన వాఖ్యపై సీజేఐ స్పందించారు. కోవిడ్ కష్టకాలంలో అన్ని వ్యవస్థలూ స్తంభించిపోయినా న్యాయస్థానాలను ప్రతిరోజూ నడపాల్సి వచి్చందని గుర్తుచేశారు. ఈ–కోర్టుల ప్రాజెక్టు మూడో దశకు కేంద్రం కేటాయించిన భారీ బడ్జెట్ కారణంగా న్యాయవ్యవస్థ ముఖ్యంగా కింది కోర్టుల్లో సాంకేతిక పుంజుకొంటుందని సీజేఐ ఆశాభావం వ్యక్తంచేశారు. న్యాయస్థానాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనకు ఇతోధిక నిధులు సమకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర అత్యంత ముఖ్యమైనదని గుర్తుచేశారు. -
దిగువ కోర్టులకు జడ్జీల్ని నియమించండి
న్యూఢిల్లీ: దిగువ కోర్టుల న్యాయాధికారుల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని హైకోర్టులను కేంద్రం కోరింది. నియామకానికి సంబంధించి త్వరితగతిన పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించాలని 24 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లేఖ రాశారు. ఆగస్టు 14 వరకు దేశవ్యాప్తంగా 2.76 కోట్ల కేసులు జిల్లా, దిగువ కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయని వివరించారు. ‘జిల్లా, దిగువ కోర్టులకు సంబంధించి 2013లో మంజూరు చేసిన 19,158 పోస్టుల సంఖ్యను ఈ ఏడాది జూన్ నాటికి 22,444 వరకు పెంచాం. 2018 జూన్ 30 నాటికి 17,221 మంది జడ్జీలు విధులు నిర్వర్తిస్తుండగా, మరో 5,223 పోస్టులు ఖాళీగా ఉన్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. -
రేప్ బాధితులను అనుమానంతో చూడొద్దు: సుప్రీం
అత్యాచార బాధితులు తాము చేస్తున్న ఆరోపణలు వాస్తవమేనని నిరూపించుకోడానికి సాక్ష్యాల కోసం వారిని ఇబ్బంది పెట్టకూడదని, వారిని అనుమానంతో చూడొద్దని సుప్రీంకోర్టు దిగువ కోర్టులకు స్పష్టం చేసింది. బాధితులు ఇచ్చే ప్రకటనల ఆధారంగానే ఇలాంటి కేసులలో నిందితులపై నేరారోపణలు రుజువు చేయొచ్చని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఏఎం సాప్రేలతో కూడిన ధర్మాసనం తెలిపింది. అత్యంత అరుదైన కేసులలో మాత్రమే ఆమె చేసిన ప్రకటనలు వాస్తవానికి దూరంగా ఉన్నాయన్న అనుమానం వస్తేనే, అందుకు కారణాలేంటో కూడా చెప్పి చేయాలని అన్నారు. బాధితులు చెప్పే విషయాలను నమ్మడానికి బదులు.. వాళ్లను అనుమానించడం వారిని మరింత అవమానాలకు గురిచేస్తుందని, అలాంటి సమయాల్లో బాధితులు చెప్పే విషయాలను యథాతథంగా పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం చెప్పింది. అనుమానం, అపనమ్మకం, శంకలతో కూడిన అద్దాలతో అత్యాచార బాధితులైన బాలికలు లేదా మహిళలు చెప్పే సాక్ష్యాలను చూడకూడదని జస్టిస్ సిక్రీ ఈ తీర్పులో పేర్కొన్నారు. ఒకవేళ వాళ్లు చెప్పే విషయాలు నమ్మశక్యంగా లేవనిపిస్తే.. అప్పుడు ఆమె చెప్పేదాన్ని సమర్థించేలా మరిన్ని సాక్ష్యాలు మాత్రం కోరొచ్చని అన్నారు. ఇది కూడా అత్యంత అరుదైన కేసులలో మాత్రమే చేయాలన్నారు. తొమ్మిదేళ్ల వయసున్న మేనకోడలిపై అత్యాచారం చేసిన వ్యక్తికి 12 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు జారీచేసింది. బాలిక, ఆమె తల్లి చెబుతున్న విషయాల్లో చిన్నపాటి తేడాలు ఉన్నందున కేసును కొట్టేస్తూ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం తోసిపుచ్చింది. ఘటన జరిగిన మూడు సంవత్సరాల తర్వాత బాలిక కుటుంబం ఫిర్యాదు చేసిందని కూడా హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ కేవలం ఆలస్యం అయినంత మాత్రాన అది తప్పుడు ఫిర్యాదుగా భావించకూడదని, ఇలాంటి సందర్భాలలో సామాజిక కారణాల వల్ల కూడా ఫిర్యాదు చేయడానికి వెనకాడే అవకాశం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. దాదాపు 80 శాతం అత్యాచార కేసులలో నిందితులు శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారని, అందులోనూ తెలిసినవారే ఎక్కువగా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని సుప్రీం అభిప్రాయపడింది. కుటుంబ సభ్యులే అత్యాచారాలు చేసినప్పుడు వివిధ కారణాల వల్ల ఫిర్యాదు చేయడానికి కూడా ఇబ్బంది పడతారని తెలిపింది.