breaking news
Laxmanrao
-
పదివేల కోట్లు కాదు.. లక్షన్నర కూడా లేదు!
తన వద్ద పదివేల కోట్ల రూపాయలు ఉన్నాయంటూ స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం సమయంలో ప్రకటించిన వ్యాపారవేత్త లక్ష్మణ్‌రావు ఇంట్లోను, కార్యాలయాల్లోను సోదాలు చేసిన ఆదాయపన్ను శాఖ అధికారులకు కళ్లు తిరిగాయి. సాధారణంగా తాము ఊహించిన దానికంటే ఎక్కువ ఉంటే అధికారులు ఆశ్చర్యపోతారు. కానీ ఈసారి మాత్రం చెప్పినది కొండంత అయితే.. అసలు ఉన్నది గోరంత మాత్రమే కావడంతో వాళ్లు ఉసూరుమన్నారు. బీఎల్ఆర్ బిల్డర్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఆయన, ఆయన భార్య బి.రమాదేవి డైరెక్టర్లుగా ఉన్నారు. 2014 మార్చి 31న వాళ్లు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద తమ ఆస్తుల వివరాలను ఫైల్ చేశారు. దాని ప్రకారం కంపెనీ ఆస్తుల మొత్తం విలువ రూ. 1.42 లక్షలు మాత్రమే. మొత్తం నాలుగు కంపెనీల్లో లక్ష్మణ్‌రావు డైరెక్టర్‌గా ఉన్నా, వాటిలో ఒక్కదానికి మాత్రమే బ్యాలెన్స్ షీటు సమర్పించారు. దాని ప్రకారమే ఈ విలువ లెక్కతేలింది. ఫిల్మ్‌నగర్‌లో టెన్నిస్ స్టార్లు, సినిమా నటులు, మంత్రులు నివసించే ఖరీదైన ప్రాంతంలోనే లక్ష్మణ్‌రావు కూడా ఉంటున్నారు. ఆ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలకు స్థానిక పోలీసులు కూడా సహకరించారు. ఈయన తన వద్ద మొత్తం పదివేల కోట్ల సొత్తు ఉన్నట్లు ఐడీఎస్ (స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం) సందర్భంగా చెప్పినా.. ఆ మొత్తం లేదని, కేవలం 1.42 లక్షలు మాత్రమే ఉందని తేలడంతో ఇంకా ఏమైనా వివరాలు తెలుస్తాయేమోనని సోదాలు కొనసాగిస్తున్నారు. ఆయన ఇద్దరు కొడుకులు, కోడళ్లను కూడా ఐటీ అధికారులు విచారిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి ఇప్పటికీ ఆ సోదాలు కొనసాగుతున్నాయి. -
చిత్రహింసలు పెట్టి చంపేశారు
వారం క్రితమే నా కొడుకును పట్టుకుని నిర్బంధించారు: ఆజాద్ తండ్రి నర్సీపట్నం: తన కుమారుడిని చిత్రహింసలు పెట్టి పోలీసులు అమానుషంగా చంపేశారని ఆజాద్ తండ్రి లక్ష్మణరావు ఆరోపించారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురి మృతదేహాలను గురువారంరాత్రి స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పౌరహక్కుల సంఘం నేతలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సంఘ ప్రతి నిధులు శుక్రవారం ఉదయమే ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మృతుడు ఆజాద్ తండ్రి లక్ష్మణరావు విలేకరులతో మాట్లాడుతూ 15 మంది పోలీసులు కాల్పులు జరిపితే కేవలం ఒకే ఒక్క తూటా ఆజాద్‌కు తగలడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వారం క్రితమే ఆజాద్‌ను పట్టుకుని నిర్బంధించి, కన్ను సైతం పీకి చిత్రహింసలకు గురిచేశారని పేర్కొన్నారు. మావోయిస్టు కీలక నేతల మృతదేహాలకు ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఆసిస్టెంట్ ప్రొఫెసర్ సమక్షంలో పోస్టుమార్టం చేయించాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఎన్కౌంటర్ మాదిరిగానే పోస్టుమార్టం సైతం బూటకంగానే జరిగిందన్నారు. అజాద్ సోదరి ఝాన్సీ మాట్లాడుతూ మానవత్వం లేకుండా మృతదేహాలను మూటలుగా కట్టి వదిలేశారన్నారు. కేవలం మీడియాలో వచ్చిన వార్తలు చూసి తామంతా ఇక్కడకు చేరుకున్నామని వివరించారు. కొయ్యూరు సీఐ సోమశేఖర్ ఆజాద్ కుటుంబసభ్యులు, ఆనంద్ సోదరుడు నాగేశ్వరావు నుంచి వాంగ్మూలం రికార్డు చేశారు. కమల కుటుంబ సభ్యులు రాకపోవడంతో ఆమె మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రిలోనే భద్రపరుస్తున్నట్టు సీఐ తెలిపారు. ఎన్కౌంటర్ వాస్తవమే.. విశాఖ రేంజి ఐజీ కుమార్ విశ్వజిత్ విశాఖ జిల్లా కొయ్యూరు మండ లం యు.చీడిపాలెం సమీపంలో జరిగిన ఎన్కౌంటర్ వాస్తవమేనని విశాఖ రేంజి ఐజీ కుమార్ విశ్వజిత్ శుక్రవారం ఇక్కడ తెలి పారు. ఎన్కౌంటర్లో మరణించిన ముగ్గురిని ఆజాద్ (ఈస్ట్ డివిజన్ చీఫ్), ఆనంద్(ఈస్ట్‌డివిజన్ డిప్యూటీ చీఫ్), కమల (ఏరియా కమిటీ మెంబరు)గా గుర్తించామన్నారు. కొయ్యూరు మండలంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా శిక్షణలో ఉన్న మావోయిస్టులు కాల్పులు జరిపారని, ఆత్మరక్షణార్థం పోలీ సు లు ఎదురు కాల్పులు జరిపారని చెప్పారు. ఆజాద్ కుటుంబసభ్యులు, బంధువులు, పౌరహక్కుల సంఘం నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. మృతదేహాల తరలింపు, పోస్టుమార్టం నిబంధనలకు లోబడి పూర్తిచేశామని చెప్పారు. ఘటనాస్థలంలో లభ్యమైన విప్లవ సాహిత్యం, ఏకే 47 తుపాకీ, రెండు ఎస్ఎల్ఆర్లు, 9 ఎంఎం పిస్టల్, రేడియో, జీపీఎస్, డెరైక్షనల్ మైన్, డే బైనాక్యులర్, 9 కిట్ బ్యాగులను ఆయన పరిశీలించారు.