breaking news
Law and Order Powers to Governor
-
హైదరాబాద్‌పై పెత్తనానికి చంద్రబాబు యత్నం
-
హైదరాబాద్‌పై పెత్తనానికి చంద్రబాబు యత్నం
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం హైదరాబాద్‌లో శాంతిభద్రతల అంశం తెలంగాణ ప్రభుత్వానిదేనని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ జీవన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు శాంతిభద్రతలు గవర్నర్‌కు కట్టబెట్టేలా విభజన చట్టాన్ని సవరించాలనుకోవటం సరికాదని ఆయన సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు కట్టబెట్టేందుకు కేంద్రం ఓ ముసాయిదా బిల్లును రూపొందించిన విషయం తెలిసిందే. అది రాజ్యాంగ వ్యతిరేకమని, సమాఖ్య స్పూర్తికి విరుద్ధమని జీవన్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక సెంట్మెంట్ను రెచ్చగొట్టేలా గవర్నర్‌ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ను పాలించాలని చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ శాంతిభద్రతలను గవర్నర్‌కు కట్టబెడితే జరగబోయే పరిణామాలకు చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాల్సి ఉంటుందని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా పార్టీ నేతను చూపలేకపోవడంతో కాంగ్రెస్ పరాజయం పొందిందని ఆయన అన్నారు. స్థానిక ఎన్నికల ఫలితాలను సమీక్షించుకుని పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటామని జీవన్ రెడ్డి తెలిపారు.