జిల్లాకు కొత్తగా ఆరుగురు డీఎస్పీలు
విజయనగరం క్రైం: పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం జిల్లాలో కొత్తగా ఆరు డీఎస్పీ పోస్టులను మంజూరుచేసింది. గతంలో స్పెషల్‌బ్రాంచ్, మహిళా, ట్రాఫిక్, డీసీఆర్బీ, సీసీఎస్ పోలీసు స్టేషన్‌కు ఎస్ఐలే స్టేషన్ హౌస్ అధికారిగా ఉండేవారు. అయితే మూడేళ్లకిత్రం ఈ స్టేషన్లకు అప్‌గ్రేడ్ చేస్తూ సీఐ స్థాయి అధికారులను స్టేషన్ హౌస్ అధికారులుగా నియమించారు. ప్రస్తుతం ఆ స్టేషన్లనే స్థాయి పెంచుతూ డీఎస్పీ స్థాయి అధికారులను నియమించారు.
అలాగే ఎస్సీఎస్టీ సెల్ బాధ్యతలను విజయనగరం డీఎస్పీ చూసేవారు. ఇప్పుడు ప్రత్యేక డీఎస్పీని నియమించారు.విశాఖరేంజ్కు చెందిన ఐదుగురు సీఐలకు, కర్నూల్ రేంజ్ నుంచి ఒక సీఐకు డీఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ జిల్లాలో నియమించారు. విశాఖరేంజ్కు చెందిన ఎల్.రాజేశ్వరరావును ట్రాఫిక్ పోలీసు స్టేషన్ డీఎస్పీగా, టి.త్రినాథరావును స్పెషల్బాంచ్ డీఎస్పీగా, కె.కుమారస్వామిని జిల్లాకు కొత్తగా ఆరుగురు డీఎస్పీలు మహిళా స్టేషన్ డీఎస్పీగా, కె.ప్రవీణ్‌కుమార్‌ను డీసీఆర్బీ డీఎస్పీగా, ఎ.ఎస్.చక్రవర్తిని సీసీఎస్ డీఎస్పీగా, కర్నూల్ రేంజ్ సీఐ సయ్యద్ మున్వర్ హుస్సేన్‌ను ఎస్సీఎస్టీ సెల్ డీఎస్పీ గా నియమించారు.
ఎస్సీఎస్టీ సెల్‌కు ప్రత్యేక డీఎస్పీ
ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులను డీఎస్పీ స్థాయి అధికారి దర్యాప్తు చేయాల్సి ఉంది. ఈ నేపధ్యంలోనే ఆ కేసులు దర్యాప్తును పర్యవేక్షించేందుకు పూర్తిస్థాయిలో ప్రత్యేకంగా డీఎస్పీని నియమించారు. గతంలో ఎస్సీఎస్టీ కేసులను సీఐ స్థాయి అధికారి విచారిస్తే డీఎస్పీలకు సంతకాలుచేయడానికి పరిమితమవుతున్నారన్న విమర్శలున్నాయి. డీఎస్పీకి అనేక రకాల పనులు కేసులు ఉండడంతో అట్రాసిటీ కేసులపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేవారు కాదు. ప్రస్తుతం ఎస్సీఎస్టీ సెల్‌కు ప్రత్యేక డీఎస్పీని నియమించడంతో కేసుల దర్యాప్తు సత్వరం పూర్తయ్యే అవకాశం ఉంది.