ప్రైవేట్ విద్యా సంస్థల లొల్లి
హైదరాబాద్: నగరంలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చైతన్యపురిలో రెండు విద్యా సంస్థల మధ్య విభేదాలు రోడ్డెక్కాయి. శ్రీకృష్ణవేణి హైస్కూలు యాజమాన్యానికి బాసర కోచింగ్ సెంటర్ నిర్వాహకుల మధ్య ఇటీవల గొడవ జరిగింది. కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీపై శ్రీకృష్ణవేణి హైస్కూల్ సిబ్బంది బుధవారం దాడి చేశారు. ఈ ఘటనకు నిరసనగా బాసర కోచింగ్ సెంటర్ నిర్వాహకులు శ్రీకృష్ణవేణి హైస్కూల్ ఎదుట విద్యార్థులతో సహా మధ్యాహ్నం ధర్నాకు దిగారు.