breaking news
Komodo Dragons
-
అంతరించిపోతున్న జాబితాలోకి మరిన్ని జీవులు
పరి: ప్రపంచపటంపై అంతరించిపోతున్న జీవుల జాబితాలోకి మరిన్ని జీవులు చేరుతూనే ఉన్నాయి. 2014తో పోలిస్తే షార్క్‌లు, రే చేపల జనాభా మరింతగా కుంచించుకుపోయిందని తాజాగా విడుదలైన రెడ్లిస్టు చెబుతోంది. అంతర్జాతీయంగా ఉనికి ప్రమాదంలో పడిన జీవజాలం వివరాలను ఐయూసీఎన్(ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) నమోదు చేస్తుంటుంది. తాజాగా కొమొడో డ్రాగన్ కూడా అంతరించే ప్రమాదం ఉన్న జీవుల జాబితాలోకి ఎక్కిందని ఐయూసీఎన్ తెలిపింది. పెరుగుతున్న సముద్రమట్టాలు, ఉష్ణోగ్రతలు పలు జీవజాతుల సహజ ఆవాసాలను ధ్వంసం చేస్తున్నాయని వివరించింది. చెట్ల విషయానికి వస్తే ఎబొని, రోజ్‌వుడ్ జాతుల చెట్లు అంతర్ధాన ముప్పును ఎదుర్కొంటున్నాయి. షార్క్, రే చేపల అంతరించే ముప్పు 2014లో 33 శాతం ఉండగా, 2021నాటికి 37 శాతానికి పెరిగిందని తెలిపింది. చేపలవేట, వాతావరణంలో మార్పులు ఇందుకు కారణమని, సముద్రషార్కుల జనాభా 1970తో పోలిస్తే ప్రస్తుతం 71 శాతం తగ్గిపోయిందని తెలిపింది. అయితే దేశాల మధ్య ఒప్పందాల కారణంగా ట్యూనా జాతి చేపల జనాభాలో పెరుగుదల కనిపించిందని ఐయూసీఎన్ డైరెక్టర్ బ్రూనో ఒబెర్లె చెప్పారు. సంస్థ పరిశీలిస్తున్న 1,38,000 జాతుల్లో దాదాపు 38వేల జాతులు అంతర్ధానమయ్యే ప్రమాదంలో ఉన్నాయి. పక్షుల్లో దాదాపు 18 జాతుల ఉనికి అత్యంత ప్రమాదకర అంచుల్లో ఉందని సంస్థ తెలిపింది. కరిగిపోతున్న మంచు తో 2100 నాటికి దాదాపు 98 శాతం ఎంపరర్ పెంగి్వన్లు నశించిపోయే ప్రమాదం ఉందంది. -
పైసా లేకుండా ప్రపంచ పర్యటనకు వెళ్లొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : ఆకాశ్ మల్హోత్ర గత జూలై, ఆగస్టు రెండు నెలలు ఇండోనేసియాలో ఒంటరిగా పర్యటించారు. కొమడో డ్రాగన్ల (రాక్షస బల్లులు)ను ప్రత్యక్షంగా వీక్షించడంతోపాటు సముద్ర గర్భంలోని అందాలను తిలకించడానికి స్కూబా డైవింగ్ చేశారు. మంటా రేస్‌గా ఆంగ్లంలో పిలిచే షార్క్ జాతికి చెందిన అతి భారీ జలచరం (8 మీటర్ల వెడల్పు దాదాపు 1400 కిలోల బరువు)తో కలిసి సముద్ర గర్భంలో ఈత కొట్టారు. అద్భుతమైన సూర్యోదయాన్ని ప్రత్యక్షంగా చూడడమే కాకుండా దాన్ని కెమెరా కన్నులో బంధించేందుకు మౌంట్ బాటూర్లోని క్రియాశీలక అగ్ని పర్వతాన్ని అధిరోహించారు. దేశ, విదేశాల్లో పర్యటించడం ద్వారా అనూహ్య అనుభవాలను, అనిర్వచనీయ అనుభూతులను పొందవచ్చని భావించే మల్హోత్ర ఈసారి ఇండోనేషియా పర్యటనకు వెళ్లారు. ఆయన అనుభవాలన్నీ తీపి గుర్తులే కాదు. ఆయన బాలి నగరంలో ఉన్నప్పుడు భూకంపం వచ్చింది. ఓ మాల్ శిథిలాలు కూలుతుంటే అందులోనుంచి అందరితోపాటు ఆయన బయటకు పరుగెత్తికొచ్చారు. 26 ఏళ్ల ఆకాశ్ మల్హోత్రకు ప్రపంచం తిరగడమంటే ఎంతో పిచ్చి. ఆయన గత నాలుగేళ్లలో 34 దేశాలు తిరిగొచ్చారు. రెండు నెలలు భారత్‌లో ఉంటే, నాలుగు నెలలు విదేశాల్లో తిరుగుతుంటారు. ‘డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ’ని నడిపే ఆకాశ్ తన పర్యటన పిచ్చికి అనుకూలంగా తన జీవన విధానాన్ని మార్చుకున్నారు. దేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా రోజుకు కేవలం నాలుగు గంటలే పనిచేస్తారు. మిగతా సమయమంతా పర్యటనలోనే గడుపుతారు. ఆయన భారత్‌కు వచ్చినప్పుడు మాత్రమే తన క్లైంట్లను నేరుగా కలుసుకుంటారు. విదేశాల్లో ఉన్నప్పుడు ఫోన్లపైనే సలహాలు, సంప్రతింపులు నడుస్తాయి. ఆయన తన పర్యటన ఫొటోలను ఎప్పటికప్పుడు ‘ఇన్స్టాగ్రామ్’లో పోస్ట్ చేయడం ద్వారా కూడా డబ్బులు వస్తాయి. ఏ దేశానికి ఎంత చీప్‌గా వెళ్లవచ్చో, ఏయే ట్రావెల్ ప్యాకేజీలు ఎలా ఉంటాయో, వాటిని ఎలా ఎంపిక చేసుకోవచ్చో, ఎక్కడ ఎంత చీప్‌గా ఆనందాన్ని ఆస్వాదించవచ్చో.. కిటికులన్నీ ఆకాశ్‌కు తెలుసు. ఆయన తన ‘వాండర్ విత్ స్కై’ వెబ్సైట్ ద్వారా తనలాంటి పర్యాటకులతో వీటిని షేర్ చేసుకుంటున్నారు. ప్రముఖ అమెరికా వ్యాపారవేత్త టిమ్ ఫెర్రీస్ రాసిన ‘ది 4–అవర్ వర్క్ వీక్’ పుస్తకాన్ని చదివి తాను స్ఫూర్తి పొందానని ఆయన చెబుతున్నారు. ఆకాశ్లాగా ప్రపంచ దేశాల్లో తిరగాలన్నా ఆసక్తి నేటి యువతరంలో ఎక్కువగా పెరుగుతోంది. ముఖ్యంగా సాంకేతిక రంగాల్లో పనిచేస్తే యువతలో ఈ ఆసక్తి ఎక్కువగా ఉంటోంది. స్కై స్కానర్ ఇండియా నిర్వహించిన ‘ది మిలీనియల్ ట్రావెల్ సర్వే–2017’ నివేదిక ప్రకారం 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యనున్న నేటి తరంలో 62 శాతం మంది ఏడాదికి రెండు నుంచి ఐదు సార్లు దేశ, విదేశాల్లో పర్యటిస్తున్నారు. పది శాతం మంది మాత్రం ఏడాదికి ఆరు నుంచి పది సార్లు పర్యటనలకు వెళుతున్నారు. ఇలా దేశ, విదేశీ పర్యటనలను ఇష్టపడుతున్న యువతలో స్త్రీ, పురుషులు ఆఫీసు సెలవుల్లో ఉన్న వెసలుబాటును బట్టి దగ్గరి ప్రాంతాలు, దూర ప్రాంతాల పర్యటనలను ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఆకాశ్ లాంటి ప్రపంచ పర్యటనను పిచ్చిగా ప్రేమించే వాళ్లు ఉద్యోగాలు వదిలేసి సొంతంగా ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ పర్యటిస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్న టెక్కీలకు దేశ, విదేశాలు తిరిగేందుకు డబ్బులు ఎలా వస్తున్నాయన్నా సందేహం రావచ్చు. కూడబెట్టుకుంటున్న సొమ్ము సరిపోకపోతే వారంతా ట్రావెల్ రుణాలు తీసుకుంటున్నారు. ఇదో కొత్త ట్రెండ్. వారికి ఈ రుణాలు ఇవ్వడం కోసమే ‘క్యూబెరా, ఫింజీ, ఫేర్‌సెంట్, రూబిక్యూ’ లాంటి ఆర్థిక సంస్థలు పుట్టుకొచ్చాయి. కొలాటరల్ గ్యారంటీ, ఈ గ్యారంటీ, ఆ గ్యారంటీ అనే తలనొప్పి షరతులు లేకుండా ఈ సంస్థలు బ్యాంకులకన్నా తక్కువ ఒడ్డీతో ట్రావెల్ రుణాలను అతి సులువుగా మంజూరు చేస్తున్నాయి. అయితే ఆ సంస్థలు రుణాలు మంజూరు చేస్తున్న వారిలో 80 శాతం మంది ఉద్యోగులే ఉంటున్నారు. గత రెండేళ్లలోనే ట్రావెల్ రుణాలు 12 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగాయని ఉద్యోగులకు, ఇతరులకు వ్యక్తిగత లోన్లను మాత్రమే మంజూరు చేసే సాంకేతిక సంస్థ ‘క్యూబెరా’ తెలిపింది. గతేడాది ట్రావెల్ రుణాలు కావాలంటూ తమ సంస్థకు దాదాపు 1700 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 728 మంది దరఖాస్తుదారులు 28 ఏళ్ల లోపు వారేనని పేర్కొంది. తమ సంస్థ నుంచి రుణాలు కోరుతున్న ఐదు ముఖ్య కారణాల్లో ట్రావెల్ ఒకటని ‘క్యూబెరా’ వ్యవస్థాపకుడు అనుభవ్ జైన్ తెలిపారు. ట్రావెల్ రుణాల్లో రిస్క్ ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఉద్యోగస్థులవడం, అందులో యువకులు అవడం, పర్యటించాలనే ఉత్సాహం ఎక్కువగా ఉండడం వల్ల అంత రిస్క్ తమకు ఎదురు కావడం లేదని ఆయన అన్నారు. తామిచ్యే మొత్తం రుణాల్లో ట్రావెల్ రుణాలు గతేడాది ఐదారు శాతం ఉండగా, ఇప్పుడు 15, 16 శాతానికి చేరుకున్నాయని ఆయన వివరించారు. ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకుండా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు తాము 12 శాతం వ్యక్తిగత రుణాలు పర్యటనల కోసం మంజూరు చేశామని ‘ఫింజీ’ సహ వ్యవస్థాపకులు, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అభినందన్ సంఘమ్ తెలిపారు. తాము ట్రావెల్ రుణాలను మంజూరు చేస్తుండడం వల్ల ముందుగా ఎకానబీ క్లాస్‌ను ఎన్నుకున్న పర్యాటకులు ఆ తర్వాత లగ్జరీ క్లాస్‌కు మారుతున్నారని కూడా ఆయన చెప్పారు. తాము కూడా ఆరు శాతం రుణాలను ట్రావెల్‌కే ఇస్తున్నామని, వీరి సంఖ్య గత రెండేళ్లుగా పెరుగుతోందని ‘ఫేర్‌సెంట్’ వెబ్ సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రజత్ గాంధీ తెలిపారు. తాము పెళ్లిళ్లకు, హానీమూన్లకు కూడా రుణాలను మంజూరు చేస్తున్నామని ఆయన తెలిపారు. జేబులో పైసా లేకపోయినా ట్రావెల్ రుణాలను, ట్రావెల్ ప్యాకేజీలను సద్వినియోగం చేసుకొని ప్రపంచ దేశాల్లో పర్యటించవచ్చని ఆకాశ్ మల్హోత్ర సూచిస్తున్నారు. -
అబ్బా.. డ్రాగన్ దెబ్బ..!!
భూమిమీద జీవించి ఉన్న బల్లిజాతుల్లో అతిపెద్దవి కొమొడొ డ్రాగన్లన్న సంగతి తెలిసిందే. మిగతా మాంసాహార జీవులతో పోల్చుకుంటే కొమొడోలు వేటాడే విధానం భయానకంగా, మరింత తెలివితేటలతో కూడి ఉంటుంది. ఇండోనేసియాలోని ప్రఖ్యాత కొమొడొ ఐలాండ్ లో రెండు భయంకరమైన కొమొడో డ్రాగన్లు ఓ మేకను వేటాడిన దృశ్యాలు చూస్తే అది నిజమని ఇట్టే అర్థం అవుతుంది. రష్యాకు చెందిన జూలియా సుడుకోవా అనే ఫొటోగ్రాఫర్ సాహసోపేతంగా తీసిన ఈ ఫొటోలు సోషల్ నెట్ వర్క్ లో పలువురి మన్ననలు పొందాయి. -
కొమొడోలు రాత్రిపూట వేటాడలేవా..?
జంతు ప్రపంచం కొమొడో డ్రాగన్స్ బల్లి జాతికి చెందినవి. దాదాపు పది అడుగుల వరకూ పొడవు పెరుగుతాయి. ప్రపంచంలో ఇవే అతి పొడవైన బల్లులు!ఇవి గడ్డిభూములు, మైదానాలు, రుతు పవనారణ్యాలలో ఎక్కువగా నివసిస్తాయి. ఇండోనేసియాలోని ఓ దీవిలో కొమొడోలు అత్యధిక సంఖ్యలో కనిపిస్తాయి. అందువల్లనే ఆ దీవిని కొమొడో ఐల్యాండ్ అని పిలుస్తుంటారు!కొమొడోలు పూర్తిగా మాంసాహారులు. గుర్రాలు, పందులు, గేదెలు, పక్షులు, పాములు, చేపలు... అవీ ఇవీ అని లేదు. ఆకలేస్తే దేనినైనా స్వాహా చేస్తాయి!కొమొడోలు పట్టుకు పదిహేను నుంచి ముప్ఫై గుడ్లు పెడతాయి. అయితే వాటిని పొదగవు. పిల్లలు తయారైన తర్వాత, అవే లోపల్నుంచి గుల్లను పగులగొట్టి బయటకు వస్తాయి! ఇవి కొన్నిసార్లు తమ పిల్లలను కూడా తినేస్తాయి. అందుకే గుడ్డులోంచి బయటకు రాగానే పిల్లలు చెట్లు ఎక్కేస్తాయి. నాలుగేళ్లు వచ్చేవరకూ చెట్లమీదే నివసిస్తుంటాయి. ఎందుకంటే... శరీరం భారీగా పెరిగాక కొమొడోలు చెట్లు ఎక్కలేవు. కాబట్టి తాము సురక్షితంగా ఉంటామన్న ఉద్దేశంతో పిల్లలు చెట్లమీదే ఉంటాయి. శరీరం కాస్త పెరిగాక, ఇంకే ప్రమాదం ఉండదని కిందకు వచ్చేస్తాయి. కొమొడోలకు రాత్రిపూట కళ్లు సరిగ్గా కనిపించవు. అందుకే పగటిపూట సంచరించినట్టు రాత్రిపూట సంచరించవు. ఆహారాన్ని కూడా పగలే వేటాడతాయి. వీటికి వినికిడి శక్తి కూడా తక్కువే! ఇవి వేటాడవు. వేటాడటం కోసం వెంటాడవు. మాటు వేసి, తమ దగ్గరకు వచ్చిన వాటినే చంపి తింటాయి! వీటి లాలాజలంలో యాభై రకాల బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే ఇది ఒక్కసారి ఏ జంతువునైనా కరిచిందంటే, దాని ్టఒంట్లోకి విషం వెళ్లి ప్రాణాలు తీసేస్తుంది. అందువల్లే కొమొడోలకు వేట తేలికవుతుంది! ఇవి అద్భుతంగా ఈదుతాయి. ఆహారం దొరకనప్పుడు, ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఒక దీవి నుంచి మరో దీవికి తేలికగా ఈదుకుంటూ వెళ్లిపోతుంటాయి!