పార్టీ బలోపేతానికి పాదయాత్ర చేస్తా
నల్లగొండ : కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చే దిశగా ఇతర జిల్లాల్లోని పార్టీ ఎమ్మెల్యేలను సంప్రదించి త్వర లో పాదయాత్రకు స్వీకారం చుడతానని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా మంగళవారం స్థానిక డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నాయత్వ లోపం వల్ల పార్టీ పరాజయం పాలైందని, అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చే క్రమంలో కూడా నాయక త్వం సరిగా వ్యవహరించలేదని అన్నారు. వచ్చే ఎన్నిక ల నాటికి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. కేసీఆర్ ఘనత వల్ల తెలంగాణ వచ్చిందని చెప్తున్న టీఆర్ఎస్ నాయకులు వాస్తవాలు విస్మరించి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.
రాష్ట్రాన్ని ప్రకటించిన సోనియా గాంధీని కలిసి కృతజ్ఞతలు తెలిపేందుకు కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీకి వెళ్లిన సంగతిని విస్మరించొద్దన్నారు. సీఎం కేసీఆర్‌తో స్నేహపూర్వకంగా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీ, ఉదయస ముద్రం ప్రాజెక్టుల వల్ల జిల్లా ప్రజలకు తాగు, సాగునీరు కష్టాలు తీరుతాయన్న ఉద్దేశంతోనే కే సీఆర్‌ను పలు సందర్భాల్లో కలవడం జరిగిందన్నారు. అంతే తప్పా కాంగ్రెస్ పార్టీని వీడతానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పార్టీలోని కొందరు వ్యక్తులు లేనిపోని అపోహలు సృష్టించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి, ఎంపీపీలు పాశంరామిరెడ్డి, రజిత పాల్గొన్నారు.