12న కీర్తి పుర స్కారాల ప్రదానం
నాంపల్లి: తెలుగు భాషా సాహిత్యం, కళలు, సంసృ్కతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం తదితర రంగాల్లో విశేష కృషి చేసిన 36 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాలు ప్రదానం చేయనుంది. ఈ నెల 12వ తేదీన నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ కళా మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందని రిజిస్ట్రార్ ఆచార్య కె.తోమాసయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైస్‌చాన్సెలర్ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగే సభలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొంటారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 36 మంది ప్రముఖులను రూ.5,116 నగదు, శాలువా, పురస్కార పత్రంతో సన్మానించనున్నారు.