తెలుగులోకి కన్నడ 'కలివీరుడు'
కన్నడ సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను కన్నడ చిత్రాలను బాగా ఆదరిస్తున్నారు. ఆ మధ్య కాంతార, విక్రాంత్ రోణ తదితర కన్నడ చిత్రాలకు తెలుగులో మంచి స్పందన లభించింది. దీంతో కన్నడ సూపర్ హిట్ చిత్రాలన్నీ ఇప్పుడు తెలుగులో విడుదలవుతున్నాయి. తాజాగా మరో కన్నడ బ్లాక్ బస్టర్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కన్నడ చిత్ర పరిశ్రమలో రియల్ స్టంట్స్, యాక్షన్ సీక్వెన్సులతో పేరు పొందిన నటుడు ఏకలవ్య హీరోగా నటించిన తొలి చిత్రం 'కలివీర'. ది ఇండియన్ వారియర్... అనేది ఉపశీర్షిక. అవిరామ్ రచన, దర్శకత్వంలో జ్యోతి ఆర్ట్స్ సంస్థ నిర్మించింది.
ఇప్పుడీ సినిమాను తెలుగులో ‘కలి వీరుడు’గా రాబోతుంది. ఈ చిత్రాన్ని ఈనెల 22న విడుదల చేసేందుకు నిర్మాత అచ్చిబాబు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులోనూ కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.ఈ చిత్రంలో చిరాశ్రీ హీరోయిన్. డేని కుట్టప్ప, తబలా నాని, అనితాభట్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.