ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి మరో క్రేజీ సినిమా రానుంది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి, సైకో పాత్రలో నటించిన ఈ మూవీ.. థియేటర్లలో అదరగొట్టేసింది. ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇప్పుడు ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమే. లేటు వయసులో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్న ఈయన.. గతేడాది ఓ మూవీలో స్వలింగ సంపర్కుడి పాత్రలో కనిపించారు. ఇప్పుడు 'కలం కవల్' చిత్రంలో సైకో తరహా పాత్రలో కనిపించి అందరికీ షాకిచ్చారు. డిసెంబరు 5న ఈ చిత్రం థియేటర్లలో రిలీజై హిట్ అయింది. ఇప్పుడీ చిత్రం సోనీ లివ్ ఓటీటీలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. జనవరి అని చెప్పారు గానీ ప్రస్తుతానికి తేదీ ఏం వెల్లడించలేదు.(ఇదీ చదవండి: ప్రాణాలు తీసుకున్న ప్రముఖ సీరియల్ హీరోయిన్)ఈ వీకెండ్ అంటే జనవరి 2న లేదంటే జనవరి 9న స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ 'కలం కవల్' చిత్రం అందుబాటులోకి వస్తుంది. ఈ మేరకు పోస్టర్, ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో మమ్ముట్టితో పాటు 'జైలర్' ఫేమ్ వినాయకన్ కీలక పాత్ర చేశాడు.'కలం కవల్' విషయానికొస్తే.. పైకి సౌమ్యుడిగా కనిపించే స్త్రీ లోలుడు.. సైకో కిల్లర్‌గా మారి అమ్మాయిల్ని, మహిళల్ని చంపేస్తుంటాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ కనుక్కొనే విస్తుపోయే నిజాలు ఏంటనేది మెయిన్ స్టోరీ. సైకోగా మమ్ముట్టి కనిపించగా.. పోలీస్‌గా వినాయకన్ చేశాడు. ఒకప్పుడు దేశంలో సంచలనం సృష్టించిన సైనేడ్ మోహన్ స్టోరీని ఈ సినిమా కోసం కొంచెం స్ఫూర్తిగా తీసుకున్నారు.(ఇదీ చదవండి: కొత్త ఏడాది స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలివే)The legend returns, darker and deadlier. Mammootty in a performance that will leave you breathless. Biggest blockbuster of the season, #Kalamkaval streaming this January only on Sony LIV!#Mammootty @mammukka #Vinayakan #MammoottyKampany #JithinKJose @rajisha_vijayan pic.twitter.com/3ggagRwcAe— Sony LIV (@SonyLIV) December 29, 2025