breaking news
Kakatiya Colony
-
పిల్లలు పుట్టడం లేదని...
నాగోలు: పిల్లలు పుట్టడం లేదని మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన మందసాని రాజ్యం (30) బ్రహ్మయ్యలు భార్యాభర్తలు. వీరికి 14 సంవత్సరాల క్రితం వీరికి వివాహమైంది. 10 సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి మన్సూరాబాద్ వీకర్‌సెక్షన్ కాలనీలో నివాసముంటున్నాడు. వివాహమైన కొత్తలో ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు. అప్పటి నుంచి పిల్లలు పుట్టకపోవడంతో రాజ్యం తీవ్ర మనస్తాపానికి గురైంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. రెండు రోజుల క్రితం భర్త బ్రహ్మయ్య సింగరాయకొండలో జరిగే వినాయక చవితి ఉత్సవాలకు వెళ్లాడు. కాకతీయ కాలనీలో నివాసముండే బాబాయ్ ఇంటికి రాజ్యం శుక్రవారం వచ్చింది. ఇంటికి వెళ్లి తిరిగి వస్తానని వెళ్లి తిరిగి రాలేదు. దీంతో శనివారం బంధువులు ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. -
అగంతకుల బీభత్సం
హుజూరాబాద్ : తాళం వేసి ఉన్న ఇంట్లోకి గుర్తుతెలియని అగంతకులు చొరబడి నానా బీభత్సం సృష్టించి న సంఘటన హుజూరాబాద్ కాకతీయ కాలనీ లో మంగళవారం చోటుచేసుకుంది. పట్టణంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధిం చిన వివరాలిలా ఉన్నాయి. పూల్గం రాజయ్య అనే రిటైర్డ్ ఉద్యోగి కాకతీయకాలనీలో నివాసముంటున్నాడు. ఆయన కుమారుడు పూల్గం సతీశ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. సతీశ్‌కు హైదరాబాద్‌లో కిడ్నీ ఆపరేషన్‌కాగా కుటుంబసభ్యులంతా మూడురోజులక్రితం అక్కడకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది అగంతకులు ఆ ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించారు. దుస్తులు, వస్తువుల దహనం దుండగులు బీరువాలను పగులగొట్టగా నగదు, ఆభరణాలు, విలువైన వస్తువులు లభించలేదు. ఇంట్లోని కంప్యూటర్ను ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో బీరువాలోని దుస్తులు, మంచాలు, ఇతర ఫర్నిచర్‌కు నిప్పంటించారు. దీంతో దుస్తులు, వస్తువులన్నీ బూడిదగా మారాయి. ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు గమనించి తలుపులు తీయడంతో ఇంట్లో ఎవరూ లేరు. వెంటనే మంటలు ఆర్పివేసి పోలీసులకు సమాచారమిచ్చారు. చంపుతామంటూ గోడలపై రాతలు వస్తువులను దహనం చేయగా ఇంటిగోడలన్నీ నల్లగా మసిబారాయి. ఈ గోడలపై ‘మిమ్మల్ని చంపుతా’ అంటూ పలుచోట్ల బెదిరింపు రాతలు రాశారు. అయితే ఇటీవలికాలంలో దొంగల బెడ ద ఎక్కువకావడంతో ఈ సంఘటనకు పాల్పడింది దొంగలా? లేక ఈ కుటుంబంతో శత్రుత్వం ఉన్నవారు ఎవరైనా చేశారా? అనే కోణం లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని సీఐ శ్రీనివాస్ చెప్పారు.