breaking news
kadiri hospital
-
సీఐ దంపతులపై దూసుకెళ్లిన వాహనం
-
సీఐ దంపతులపై దూసుకెళ్లిన వాహనం
బుక్కపట్నం: అనంతపురం జిల్లా నల్లమాడ-బుక్కపట్నం రహదారిపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప పీటీసీ సీఐ అర్జున్ నాయక్ తీవ్రంగా గాయపడగా, ఆయన భార్య మృతి చెందారు. కడప పీటీసీ సీఐగా పనిచేస్తున్న అర్జున్నాయక్ స్వస్థలం నల్లమాడ మండలం అరవవాండ్లపల్లి తండా. మంగళవారం అర్జున్ నాయక్, ఆయన భార్య పద్మ(39)తన స్వగ్రామంలో వ్యవసాయ పనులు చేయించారు. రోడ్డుపై కంది పంటను ఎండబెట్టి రాత్రి వరకు నూర్పిడి చేయించారు. తర్వాత అక్కడే రోడ్డు పక్కన నిద్రిస్తున్న దంపతులను ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. దీంతో పద్మ అక్కడికక్కడే మృతి చెందగా అర్జున్నాయక్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను చికిత్స నిమిత్తం కదిరి ఆస్పత్రికి తరలించారు.