breaking news
Jaywant Lele
-
బీసీసీఐ మాజీ కార్యదర్శి జయవంత్ లెలె మృతి
-
బీసీసీఐ మాజీ కార్యదర్శి జయవంత్ లెలె మృతి
వడోదర : బీసీసీఐ మాజీ కార్యదర్శి జయవంత్ లెలె గుండె పోటుతో మృతి చెందారు. వడోదరలోని తన నివాసంలో రాత్రి పొద్దు పోయాక లెలె మృతి చెందినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. లెలెకు భార్య ఒక కొడుకు, ఒక కుమార్తె వున్నారు. బీసీసీఐ సహాయ కార్యదర్శిగా తొలుత పనిచేసిన లెలె, 1996లో జగ్మోహన్ దాల్మియా ఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన కాలంలో బీసీసీఐ కార్యదర్శిగా పనిచేశారు. 1996 విల్స్ ప్రపంచ కప్‌ను విజయవంతం చేయడంలో లెలె కీలక పాత్ర పోషించారు ఈనెల13న తన 75వ జన్మదిన వేడుకలు జరుపుకున్న లెలె, ఇండియా ప్లేయర్లుగా సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వికెట్ కీపర్ నయన్ మోంగియాలను ప్రోత్సహించారు. లెలె మృతి పట్ల క్రికెటర్లు సంతాపం తెలిపారు.