తలుపులమ్మ అమ్మవారి జాతర ప్రారంభం
నిత్యం గ్రామాల్లో గరగల సంబరాలు
25న జాగరణ, 26న తీర్థం,
అమ్మవారి ఊరేగింపు
తుని రూరల్ :
తలుపులమ్మ తల్లి పుట్టింటి సంబరాలుగా పేర్కొనే గంధ అమావాస్య జాతరోత్సవాలు సాంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం 7.04 గంటలకు లోవకొత్తూరు రామాలయంలో గరగలను కళాకారులు లోవ దేవస్థానానికి తీసుకువెళ్లారు. అక్కడ శుభ్రపర్చిన గరగలను అమ్మవారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం చైర్మ¯ŒS కరపా అప్పారావు, అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ఎస్.చంద్రశేఖర్, మాజీ చైర్మ¯ŒS దూలం మాణిక్యం, ధర్మకర్తలు గరగలను శిరస్సుపై అధిష్టించి నృత్యాలు చేయడం ద్వారా గరగల సంబరాన్ని, జాతరోత్సవాలను ప్రారంభించారు. శుక్రవారం నుంచి రోజూ పరిసర గ్రామాల్లో గరగల సంబరం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈఓ, చైర్మ¯ŒS విలేకరులతో మాట్లాడుతూ మునుపెన్నడులేని విధంగా లోవకొత్తూరు గ్రామంలోగల నాలుగు ఎకరాల స్థలంలో అమ్మవారి జాతరోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. విద్యుత్ దీపాలంకరణలు, పలు సాంస్కృతిక, ప్రదర్శనలు ఏర్పాటు చేశామన్నారు. 25న రాత్రి జాగరణ, 26న అమ్మవారి ఊరేగింపు, తీర్థంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. ధర్మకర్తలు యాదాల లోవకృష్ణ, అత్తి అచ్యుతరావు, దూలం సత్యనారాయణ, సూపరింటెండెంట్లు కె.వి.రమణ, ఎల్.వి.రమణ, ఆలయ ఇ¯ŒSస్పెక్టర్ గుబ్బల రామకృష్ణ, పలువురు భక్తులు పాల్గొన్నారు.