breaking news
Indian girl Geeta
-
గీత వచ్చేసింది
న్యూఢిల్లీ: ఏడేళ్ల వయసులో పొరపాటున భారత్ సరిహద్దు దాటి దశాబ్ద కాలంగా పాకిస్తాన్లో నివసిస్తున్న మూగ, చెవిటి యువతి గీత(23) ఎట్టకేలకు స్వదేశానికి చేరుకుంది. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీ విమాశ్రయానికి చేరుకుంది. స్వదేశానికి చేరుకున్న గీతకు ఆనందోత్సాహాల నడుమ ఘనస్వాగతం లభించింది. బాలికలు, మహిళలు పెద్ద సంఖ్యలో ఎయిర్ పోర్ట్ కు తరలివచ్చి ఆమెకు స్వాగతం పలికారు. గీత తల్లిదండ్రులు, బంధువులు విమానాశ్రయానికి తరలివచ్చారు. గీత రాక పట్ల వారంతా సంతోషం వ్యక్తం చేశారు. కాసేపట్లో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను కలవనుంది. పాక్‌లో ఆమె బాగోగులు చూస్తున్న స్వచ్ఛంద సంస్థలోని ఐదుగురు సభ్యులు కూడా భారత్‌కు వచ్చారు. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి అవి సరిపోలితే గీతను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తారు. ఇస్లామాబాద్‌లోని భారత్ కార్యాలయం పంపిన ఫోటోలో నుంచి తన తండ్రి, తల్లి, సోదరీమణులను గీత గుర్తించడంతో ఆమెను స్వదేశానికి తీసుకువచ్చారు. కాగా, పాకిస్థాన్ నుంచి వచ్చిన గీతను రాజకీయ నేతలు స్వాగతించారు. గీత స్వదేశం చేరుకోవడం ఆనందకర పరిణామమని, ఆమెకు మంచి జరగాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. -
'పాక్ లో ఆ అమ్మాయితో మాట్లాడండి'
న్యూఢిల్లీ: రైలు ప్రయాణంలో పొరపాటున పాకిస్థాన్‌కు వెళ్లి దశాబ్దకాలంగా అక్కడే నివసిస్తున్న అమ్మాయి గీతను కలసి మాట్లాడాల్సిందిగా పాక్‌లో భారత హైకమిషనర్‌ను విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సూచించారు. దాదాపు ఎనిమిదేళ్ల వయసు ఉన్నపుడు లాహోర్ రైల్వేస్టేషన్లో ఎటువెళ్లాలో తెలీక తిరుగుతున్న మాట్లాడలేని అమ్మాయిని పంజాబ్ రేంజర్స్ సైనికులు చేరదీసి కరాచీలోని ఓ ఫౌండేషన్‌కు అప్పజెప్పిన ఉదంతం తాజాగా సామాజిక వెబ్సైట్లలో విస్తతమైన సంగతి తెలిసిందే. సామాజిక కార్యకర్త అన్సార్ బర్మీ ట్వీట్‌కు స్పందించి, పాక్ హైకమిషనర్ టీసీఏ రాఘవన్‌ను కరాచీకి వెళ్లి గీతతో మాట్లాడి వివరాలు సేకరించి ఆమె కుటుంబం జాడను కనుక్కోండని కోరినట్లు సుష్మా ట్విటర్లో వెల్లడించారు. దీంతో సుష్మాస్వరాజ్ చొరవకు అన్సార్ కతజ్ఞతలు తెలిపారు.