తిరుపతిలో ఐఈఏ మహాసభలు ప్రారంభం
తిరుపతి: తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలో ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ 99వ మహాసభలు మంగళవారం ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరుగుతున్న ఈ సభలను ముఖ్యమంత్రి చంద్రబాబు జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో హాజరైన ఆర్థికవేత్తలను ఉద్దేశించి అనంతరం ఆయన ప్రసంగించారు. సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవటం ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. కరువు పీడిత ప్రాంతాలపై డ్రోన్ల సాయంతో సర్వే చేపట్టి, అంచనా వేస్తున్నట్లు చెప్పారు.