breaking news
IIM Students
-
IIM విద్యార్థుల పడుకొని నిరసన
-
ఐఐటీయన్లకు కరోనా కష్టాలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ).. ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీటు సాధించి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారి భవిష్యత్తుకు ఆకాశమే హద్దు.. ప్రతిభ ఆధారంగా ప్రపంచస్థాయి ఐటీ కంపెనీల్లో ఉద్యోగం.. నెలకు ఊహించనంత వేతనం.. విలాసవంతమైన జీవనం.. అబ్బురపరిచే భవిష్యత్తు.. ఇవన్నీ కరోనా ముందటి మాట. ఇప్పుడు ఐఐటీయన్ల పరిస్థితి కరోనా దెబ్బకు మారిపోయింది. నెలకు లక్షల రూపాయల వేతనం ఆఫర్ చేసిన కంపెనీలు కరోనా ధాటికి ఆ ఆఫర్లను రద్దు చేసుకుంటున్నాయి. లేదంటే వాయిదా వేస్తూ కొన్నాళ్లు ఆగమంటున్నాయి. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఐఐటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఓ విద్యార్థికి అమెరికాకు చెందిన ఓ ఐటీ కంపెనీ భారీ ఆఫర్ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం జూన్‌లో విధుల్లో చేరాలి. కానీ కరోనా కారణంగా అగ్రరాజ్యం అమెరికా అల్లాడిపోతోంది. కొత్త ఉద్యోగాలు మాట పక్కన పెడితే అక్కడి ప్రజల ప్రాణాలు కాపాడటమే గగనమైపోతోంది. దీంతో ఆ విద్యార్థి ఆఫర్‌ను సదరు కంపెనీ రద్దు చేసుకుంటున్నట్లు సమాచారమిచ్చింది. జూన్‌లో ఉద్యోగానికి వెళ్లాలని ఇప్పటికే సిద్ధమైన సదరు విద్యార్థి తన వీసా, ఇతర ఖర్చులకు రూ.2 లక్షల వరకు ఖర్చు చేశాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్నాడు. సాక్షి, హైదరాబాద్: పై రెండు సందర్భాలు భారతీయ మేధో సంపత్తికి అగ్ని పరీక్ష లాంటివే. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ దేశంలోని చురుకైన ప్రతిభావంతుల భవిష్యత్తును సంశయంలో పడేసింది. ఐఐటీలు, ఐఐఎంలలో చదువుకుని బ యటకొచ్చిన వారి బంగారు భవిష్యత్తును కరోనా వైరస్ కం గాళీలోకి నెట్టేసింది. 2019–20 విద్యా సంవత్సరంలో ఐఐటీ లు, ఐఐఎంల ద్వారా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇప్పటికే ఆయా విద్యాసంస్థల్లో నిర్వహించిన క్యాంప స్ ప్లేస్మెంట్ల ద్వారా ఉద్యోగాలు పొందారు. ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీలు, పలు రంగాలకు చెందిన వ్యాపార సంస్థలు వారిని ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నట్టు ఆఫర్ లెటర్లు ఇచ్చా యి. రెండు నెలల క్రితమే ఈ క్యాంపస్ ప్లేస్మెంట్లు పూర్తి కాగా, సదరు విద్యార్థులు ఉద్యోగాల్లో చేరే సమయం కూడా ఆసన్నమవుతోంది. కరోనా కారణంగా ఇప్పుడు ఆ ఆఫర్లు సందిగ్ధంలో పడ్డాయి. భారీ వేతనంతో ఆఫర్లు ఇచ్చిన కంపెనీలు కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యంతో వాటిని రద్దు చే సుకుంటున్నామని సమాచారమిస్తున్నాయి. మ రికొన్ని కంపెనీలు ఆఫర్లు రద్దు చేసుకోకపోయినా కొన్నా ళ్ల తర్వాత చెబుతామంటూ దాటవేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఐఐఎంల క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా ఉద్యోగా లు పొందిన వారిలో 40 మంది ఐఐటీయన్లు, 35 మంది ఐ ఐఎం విద్యార్థులకు ఇలాంటి సమాచారం వచ్చిందని తెలుస్తోంది. ఇంకా ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీ ల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగాలు పొందిన 50 వేల మంది భవిష్యత్తును కరోనా ఖతం చేసిందని అంచనా. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించే యోచన: కేంద్ర మంత్రి ఐఐటీ క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉద్యోగాలు పొంది కరోనా కారణంగా ఆఫర్లు రద్దయిన వారికి ప్రత్యేక ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దీనిపై దేశంలోని అన్ని ఐఐటీల డైరెక్టర్లతో మాట్లాడామన్నారు. సంక్షోభ సమయంలో దేశంలోని ప్రతిభావంతుల భవిష్యత్తుకు సాయం చేయాలని నిర్ణయిం చామన్నారు. ఆఫర్లను రద్దు చేసుకోవద్దని సోమవారమే ఆ యా కంపెనీలకు విజ్ఞప్తి చేసిన పోఖ్రియాల్.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఇబ్బందులు లేకుండా ప్లేస్మెంట్ డ్రైవ్స్ నిర్వహించాలని 23 ఐఐటీల డైరెక్టర్లకు సూచించారు. కిం కర్తవ్యం? ఐఐటీ, ఐఐఎంల విద్యార్థులకు కంపెనీలు పెద్ద ఆఫర్లే ఇ స్తుంటాయి. వార్షిక వేతనం కింద కనీసం రూ.10 లక్షలు తక్కువ కాకుండా ఆఫర్ చేస్తుంటాయి. ఇప్పుడు అలానే పొందిన ఉద్యోగాలు దక్కకపోవడంతో ఈ ఏడాది పాసై న వారి పరిస్థితి గందరగోళంలో పడనుంది. ఐటీ రంగం లో పాసవుట్ల ప్రాతిపదికనే భవిష్యత్తు ఉంటుంది. అం దు నా ఐఐటీలు, ఐఐఎంల్లో అయితే అది ప్రాధాన్యతాం శం. ప్రస్తుత ఆఫర్ రద్దయితే వచ్చే ఏడాది పాసవుట్లకే ప్రాధాన్యం ఉంటుంది. దీంతో మళ్లీ క్యాంపస్ ప్లేస్మెం ట్స్ నిర్వహణకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రద్దు చేసుకోకండి: ఏఐపీసీ ఐఐటీల్లో క్యాంపస్ ప్లేస్మెంట్ల కోసం ముందుకొచ్చిన కంపెనీలు విద్యార్థులకు ఇచ్చిన ఆఫర్లు రద్దు చేసుకోవద్దని ఆల్ ఐఐటీస్ ప్లేస్‌మెంట్స్ కమిటీ (ఏఐపీసీ) కోరింది. ఈ విషయమై ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ వి.రాంగోపాల్‌రావు ఇప్పటికే బహిరంగ విజ్ఞప్తి చేశారు. దేశంలోని ఐఐటీలు ఒక వ్యక్తి, ఒక ఉద్యోగ అవకాశం అనే విధానాన్ని కచ్చితంగా పాటిస్తున్నాయని, ఈ సమయంలో కంపెనీలు ఆఫర్లు రద్దు చేసుకుంటే ఆ విద్యార్థులు ప్రస్తుతానికి ఉద్యోగాలు లేని వారిగా మిగిలిపోతారని గత వారమే ఆయా కంపెనీలను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఇది క్లిష్ట సందర్భమని అందరం అర్థం చేసుకోగలం. కానీ మీ వాగ్దానాలను ఉపసంహరించుకోకండి. మీ వాగ్దానం అమల్లోకి వచ్చేందుకు కొంత జాప్యం జరిగితే ఫర్వాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చురుకైన విద్యార్థుల జీవితాలను వివాదాస్పదం చేయకండి. ఈ మాంద్యం నుంచి మీరు ఊహించిన దాని కంటే ముందుగానే వారు మిమ్మల్ని బయటపడేయగల సమర్థులు’అని ఆయన పోస్ట్ చేశారు. -
‘స్కామ్‌లతో దేశ ప్రతిష్టకు మచ్చ’
సాక్షి, షిల్లాంగ్ : కుంభకోణాలు దేశ ప్రతిష్టకు మాయని మచ్చగా మిగులుతాయని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల వెలుగు చూసిన బ్యాంకింగ్ స్కామ్‌లను ప్రస్తావిస్తూ ఇలాంటి కుంభకోణాలు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తాయని, కార్పొరేట్ విలువలకు తిలోదకాలు ఇవ్వడం వల్లే అనర్ధాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బ్రాండ్ ఇండియా బలోపేతానికి ఎగ్జిక్యూటివ్‌లు పలు సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉందని ఐఐఎం షిల్లాంగ్ వార్షిక స్నాతకోత్సవంలో వెంకయ్య పేర్కొన్నారు. భారత్‌ను బలోపేతం చేసేందుకు కార్పొరేట్ ఇండియాను దీటుగా మలిచేందుకు భవిష్యత్ బిజినెస్ లీడర్లుగా కృషి సాగించాలని ఐఐఎం గ్రాడ్యుయేట్లకు ఆయన పిలుపు ఇచ్చారు. జాతీయ దృక్పథంతో సామాజిక స్పృహతో పనిచేయాలని విద్యార్ధులను కోరారు. భవిష్యత్‌లో వ్యాపారం, ఉద్యోగం ఏది చేపట్టినా ఆర్థిక కోణంతో పాటు మానవతా దృక్పథంతోనూ నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. -
ఐఐఎం విద్యార్థులకు..ఎంబీఏ ‘పట్టా’!
ఐఐఎం బిల్లు–2017తో స్వయం ప్రతిపత్తి ఐఐఎంలు.. పరిచయం అక్కర్లేని, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు. కానీ.. అవి ఇచ్చే సర్టిఫికెట్లకు మాత్రం అంతర్జాతీయ గుర్తింపు విషయంలో ఒక్కో దేశంలో ఒక్కో నిర్ణయం. ఇన్స్టిట్యూట్స్లో పరిపాలనపరంగానూ పలు అడ్డంకులు. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను నియమించుకోవాలన్నా ఎన్నో నిబంధనలు. ఇలాంటి పరిస్థితికి ఫుల్స్టాప్ పెట్టే దిశగా ఐఐఎంలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తూ తెచ్చిన ఐఐఎం బిల్లు–2017కు ఇటీవల లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుతో ఇన్స్టిట్యూట్లకు, విద్యార్థులకు కలగనున్న ప్రయోజనాలపై విశ్లేషణ.. ఇక ఎంబీఏ, పీహెచ్డీ పట్టాలు ఇప్పటివరకు ఐఐఎంలు తాము అందిస్తున్న కోర్సులను పీజీ డిప్లొమా లేదా, ఎగ్జిక్యూటివ్ డిప్లొమా పేరుతో సర్టిఫికెట్లను జారీ చేస్తున్నాయి. వీటికి మార్కెట్పరంగా, ఉన్నత విద్య కోర్సుల్లో చేరడం విషయంలోనూ పలు దేశాల్లో మాస్టర్ స్థాయి గుర్తింపు లభించడం లేదు. పీహెచ్‌డీకి సమానమైనదని పేర్కొనే ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ (ఎఫ్‌పీఎం)ను సైతం పలు విదేశీ వర్సిటీలు పీహెచ్‌డీగా పరిగణించేందుకు సంకోచిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో.. ఐఐఎం బిల్లు–2017 అమలు ద్వారా ఐఐఎంలకు డిప్లొమాలకు బదులు డిగ్రీలు మంజూరు చేసే అవకాశం లభిస్తుంది. ఐఐఎంలు పీజీడీఎం, ఫెలో ప్రోగ్రామ్స్‌కు బదులు ఎంబీఏ, పీహెచ్‌డీలు ప్రదానం చేసే వీలు కలుగుతుంది. డైరెక్టర్ నియామకం తాజా బిల్లు ద్వారా కొత్త డైరెక్టర్‌ను నియమించుకోవడంలో ఐఐఎంలులోని బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌కు స్వీయ అధికారాలు కల్పిస్తారు. ఇప్పటివరకు ఈ విషయంలో హెచ్ఆర్డీ శాఖ ఆమోదం తీసుకోవాల్సి వచ్చేది. దీనివల్ల ఏళ్ల తరబడి డైరెక్టర్లు లేకుండానే ఇన్స్టిట్యూట్స్ నడవాల్సిన పరిస్థితి నెలకొంది. స్వయంప్రతిపత్తి కల్పించడం వల్ల ఒక డైరెక్టర్ పదవీ కాలం పూర్తవగానే కొత్త డైరెక్టర్‌ను నియమించుకునే వీలు కలుగుతుంది. ఫ్యాకల్టీ కొరతకూ పరిష్కారం ఐఐఎం–బిల్లు 2017లో ఫ్యాకల్టీ నియామకాల్లోనూ ఇన్స్టిట్యూట్లకు స్వయంప్రతిపత్తి ప్రతిపాదించారు. దీనివల్ల ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా ఐఐఎంలలో ఫ్యాకల్టీ కొరత సమస్యకు పరిష్కారం దొరకనుంది. విజిటింగ్ ఫ్యాకల్టీ, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీని ఆహ్వానించే విషయంలోనూ ఐఐఎంలకు స్వేచ్ఛ లభించనుంది. కోఆర్డినేషన్ ఫోరమ్ బిల్లు ప్రకారం అన్ని ఐఐఎంలకు కలిపి ఒక కోఆర్డినేషన్ ఫోరమ్ ఏర్పాటు కానుంది. దీనికి అన్ని ఇన్స్టిట్యూట్ల బీఓజీ చైర్ పర్సన్స్ ప్రాతినిథ్యం వహిస్తారు. వారిలోంచి ఒకరిని కోఆర్డినేషన్ ఫోరమ్ చైర్ పర్సన్‌గా ఎంపిక చేస్తారు. చైర్ పర్సన్ రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతారు. తద్వారా ప్రస్తుతం పలు అంశాలపరంగా ఒక్కో ఐఐఎంలో ఒక్కో తీరుగా అమలవుతున్న విధానాలకు తెరపడి.. కామన్ పాలసీ రూపొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రవేశ ప్రక్రియల్లో ఈ ఉమ్మడి విధానం వల్ల విద్యార్థులకు వ్యయప్రయాసల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇతర ప్రాంతాల్లో... విదేశాల్లో సైతం ప్రస్తుత నిబంధనల ప్రకారం ఐఐఎంలు.. అవి నెలకొన్న ప్రాంతంలోనే అకడమిక్ తరగతులను నిర్వహించే వీలుంది. ఐఐఎం–బిల్లు 2017 ద్వారా కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఇతర ప్రాంతాల్లోనూ లెర్నింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో విదేశాల్లో సైతం స్టడీ సెంటర్లను నెలకొల్పవచ్చు. ఈ సెంటర్లతో గ్లోబల్ ర్యాంకింగ్స్ పరంగా కీలక పారామీటర్‌గా ఉన్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ రేషియో విషయంలో ముందంజలో ఉండొచ్చు. సెంటర్ ఏర్పాటు చేసిన విదేశీ యూనివర్సిటీతో ఒప్పందం ద్వారా కొలాబరేటివ్ రీసెర్చ్ కార్యకలాపాలు నిర్వహించే అవకాశం కూడా లభిస్తుంది. ఇది కూడా గ్లోబల్ ర్యాంకింగ్స్ పరంగా పోటీ పడేందుకు, ముందు నిలిచేందుకు ఆస్కారం కల్పిస్తుంది. రీసెర్చ్‌కు ప్రాధాన్యం బిల్లులో మరో ప్రధానాంశం.. ఐఐఎంలు స్వయంగా రీసెర్చ్ యాక్టివిటీస్ దిశగా స్వతంత్రంగా వ్యవహరించడం. రీసెర్చ్‌కు అవసరమైన నిధుల సమీకరణ, ఎక్సే్ఛంజ్ ఒప్పందాలు, స్పాన్సర్డ్ రీసెర్చ్ కార్యకలాపాలు వంటివాటి విషయంలో సదరు ఐఐఎం గవర్నింగ్ కౌన్సిల్‌కే పూర్తి నిర్ణయాధికారాలు ఉంటాయి. ఈ ప్రతిపాదన విద్యార్థులకు రీసెర్చ్ యాక్టివిటీస్ పరంగా విద్యార్థులకు మేలు చేస్తుందని భావిస్తున్నారు. వైవి«ధ్యానికి ప్రాధాన్యం బిల్లులో మరో కీలకాంశం వైవిధ్యం (డైవర్సిటీ)కు ప్రాధాన్యం ఇవ్వడం. రిజర్వేషన్లు, జండర్ డైవర్సిటీ ద్వారా అన్ని వర్గాలకు ఐఐఎంలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టే వీలు కల్పిస్తోందీ బిల్లు. ఐఐఎంలు దేశవ్యాప్తంగా విస్తరించినా కొందరికే అవకాశం లభిస్తోంది. ఇలాకాకుండా ఫ్యాకల్టీ నియామకాల్లోనూ డైవర్సిటీని పాటించనున్నారు. దాంతోపాటు ఐఐఎంలలో ప్రవేశానికి నిర్వహించే క్యాట్ స్వరూపం అన్ని అకడమిక్ నేపథ్యాలవారికి అనుకూలంగా ఉండేలా చూడాలనేది కొత్త బిల్లులోని మరో ముఖ్యాంశం. ఫలితంగా ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ నేపథ్యం ఉన్నవారికే క్యాట్ అనుకూలం, మిగతా వారికి అవకాశాలు స్వల్పం అనే అభిప్రాయాలకు స్వస్తి పలికే చర్యలు చేపట్టే వీలు కలుగుతుంది. ముఖ్యాంశాలు మాస్టర్స్ డిగ్రీ ప్రదానం చేసే అధికారం ఫ్యాకల్టీ, డైరెక్టర్ల నియామకంలో స్వేచ్ఛ కొలాబరేటివ్ రీసెర్చ్ విషయంలో స్వతంత్రత డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సెంటర్స్ ఏర్పాటు అడ్మిషన్ ప్రక్రియలో లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్‌కు ఆస్కారం ఇచ్చేలా చర్యలు ఐఐఎం కోఆర్డినేషన్ ఫోరం ఏర్పాటు – ఫలితంగా అన్ని ఐఐఎంలలో ఒకే తరహా విధానాలు అమలయ్యే అవకాశం ప్రైవేటు బి–స్కూల్స్‌కు స్వయంప్రతిపత్తి! దేశంలో ప్రముఖ ప్రయివేట్ బి–స్కూల్స్‌కు కూడా స్వయంప్రతిపత్తి హోదా ఇచ్చే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విషయంపై అధ్యయనానికి ఇప్పటికే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఒక కమిటీని నియమించింది. ఐఐఎంలకు దీటుగా రాణిస్తూ ప్రపంచ స్థాయిలో పేరుపొందిన ప్రైవేటు ఇన్స్టిట్యూట్లు.. ప్రభుత్వ నియంత్రణ సంస్థల కారణంగా కార్యకలాపాలు, అకడమిక్స్ నిర్వహణలో ఇబ్బందులకు గురి కాకూడదనే ప్రైవేటు బి–స్కూల్స్‌కు అటానమస్ హోదా ఇచ్చే దిశగా హెచ్ఆర్డీ యోచిస్తున్నట్లు సమాచారం. అటానమస్ హోదాతో ప్రయోజనం ఐఐఎంలకు స్వయంప్రతిపత్తి హోదా కల్పించడం వల్ల అటు విద్యార్థులు, ఇటు ఇన్స్టిట్యూట్లకు ప్రయోజనం కలుగుతుంది. విద్యార్థులకు గ్లోబల్ ఎక్స్పోజర్ లభిస్తుంది. ఇన్స్టిట్యూట్లు కూడా ఎక్సే్ఛంజ్ ప్రోగ్రామ్స్ నిర్వహణ, కొలాబరేటివ్ రీసెర్చ్ పరంగా స్వతంత్రంగా వ్యవహరించే వీలు కలుగుతుంది. – ప్రొఫెసర్.దినేశ్ కుమార్, ఐఐఎం–బెంగళూరు