విరాట్ కోహ్లికి కెరీర్ బెస్ట్ ర్యాంక్
దుబాయ్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్‌సలో తన కెరీర్లో అత్యుత్తమ స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టు అనంతరం తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో అతను నాలుగో స్థానంలో నిలిచాడు. విశాఖపట్నం టెస్టులో రెండు ఇన్నింగ్సలలో కలిపి 248 పరుగులు చేయడంతో గత వారపు 14వ ర్యాంక్ నుంచి ఏకంగా పది స్థానాలు ఎగబాకి తొలిసారి టాప్-10లో స్థానం దక్కించుకున్నాడు.
కెరీర్లో మొదటిసారి అతను 800 ర్యాంకింగ్ పారుుంట్ల మార్క్‌ను కూడా దాటడం విశేషం. ఈ జాబితాలో స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, పుజారా 9వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. టెస్టు బౌలర్లలో భారత స్పిన్నర్ అశ్విన్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇందులో జడేజా ఒక స్థానం మెరుగుపర్చుకొని 6వ ర్యాంక్‌లో నిలిచాడు.