breaking news
ibrahimpatnam in krishna district
-
జోగి రమేష్‌పై పోలీసుల కక్షసాధింపు చర్యలు
సాక్షి, విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మైలవరం నియోజక ఇన్‌ఛార్జి జోగి రమేష్‌పై కక్షసాధింపు చర్య కొనసాగుతోంది. ఎస్ఐపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఏపీ బంద్ సందర్భంగా (శుక్రవారం) జోగి రమేష్ తనతో అసభ్యకరమైన పదజాదంలో మాట్లాడారంటూ ఇబ్రహీంపట్నం ఎస్ఐ టి.శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు సీఐ పవన్ కిషోర్ శనివారం కేసు నమోదు చేశారు. గతంలోనూ జోగి రమేష్‌ను తప్పుడు కేసులో ఇరికించేందుకు విఫలయత్నం జరిగిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల తీరుపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. తాజాగా బంద్ నేపథ్యంలో జోగి రమేష్ పరుష పదజాలం ఉపయోగించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 1000 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా జోగి రమేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కొండపల్లి-ఇబ్రహీంపట్నం గ్రామాలలో పాదయాత్ర నిర్వహించారు. అయితే ఆటోలో ప్రయాణిస్తున్న కట్టె రాములు అనే ప్రయాణికుడు గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు పాదయాత్ర కారణంగానే రాములు మరణించాడని హల్చల్ చేసి జోగి రమేష్‌పై కేసు నమోదుకు యత్నించిన విషయం విదితమే. -
పొంగిన ఏనుగుగడ్డ వాగు: రాకపోకలు బంద్
ఇబ్రహీంపట్నం: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఇబ్రహీంపట్నం మండలం కొడికలపూడి గ్రామం వద్ద ఉన్న ఏనుగుల గడ్డవాగు గురువారం తెల్లవారుజామున పొంగింది. దాంతో కొడికలపూడి, చిలుకూరు, దామలూరు గ్రామాల మధ్య రహదారి కొట్టుకుపోయింది. దీంతో సదరు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. అంతేకాకుండా వాగు నీళ్లు గ్రామాల్లోని నివాసాల్లోకి ప్రవేశించాయి. అందువల్ల ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొందని గ్రామస్థులు వెల్లడించారు.