breaking news
hollywood heroines
-
నటీమనీ
స్టార్స్‌ని సినిమాలోకి తీసుకుంటే, ప్రేక్షకుల్ని వాళ్లు థియేటర్‌కి రప్పించగలుగుతారు అంటారు. సార్ట్స్ చిన్నితెరపై దర్శనమిచ్చినా ప్రేక్షకులకు పండగే. స్టార్స్ క్రేజ్ అలాంటిది. ఆ క్రేజ్, వాళ్ల సంపాదన ఎప్పుడూ ఆశ్చర్యపరిచే టాపిక్కే. ప్రతి ఏడాది ఎవరెంత సంపాదిస్తున్నారు అని ఓ జాబితాను విడుదల చేస్తుంది ఫోర్బ్స్ మ్యాగజీన్. ఈ ఏడాది హాలీవుడ్ హీరోయిన్లు సంపాదన గురించి ఈ పత్రిక ఒక జాబితా విడుదల చేసింది. మరి.. ఏయే నటీమణి ఎంత ‘మనీ’ సంపాదిస్తున్నారో చూద్దాం. ‘మోడ్రన్ ఫ్యామిలీ’ టీవీ సిరీస్ స్టార్ సోఫియా వెర్గారా అత్యధికంగా సంపాదిస్తున్న నటీమణుల్లో మొదటి వరుసలో ఉన్నారు. 43 మిలియన్ డాలర్స్ ఆర్జిస్తూ ఆమె మొదటి వరుసలో ఉన్నారు. 43 మిలియన్లు అంటే మన కరెన్సీలో సుమారు 315 కోట్లు. ఆమె తర్వాతి స్థానంలో ఏంజెలినా జోలీ ఉన్నారు. సుమారు 35.5 మిలియన్లు (దాదాపు 256 కోట్లు) సంపాదిస్తున్నారు జోలీ. మూడో స్థానాన్ని గాల్ గాడోట్ సంపాదించారు. ఆమె సంపాదన 31 మిలియన్లు. ఆ తర్వాత మెలిసా మెకార్తీ (25 మిలియన్ డాలర్లు), మెరిల్ స్ట్రీప్స్ ( 24 మిలియన్ డాలర్లు), ఎమీలా బ్లంట్ (22.5 మిలియన్ డాలర్లు), నికోల్ కిడ్మన్ (22 మిలియన్ డాలర్లు), ఎలెన్ పోంపీ (19 మిలియన్ డాలర్లు), ఎలిజిబెత్ మోస్ (16 మిలియన్ డాలర్లు), వోయిలా డేవిస్ (15.5 మిలియన్ డాలర్లు)తో టాప్ టెన్‌లో ఉన్నారు. సాధారణంగా సినిమాల ద్వారా ఎక్కువ ఆర్జించడం చూస్తుంటాం. కానీ ఈ ఏడాది టాప్‌లో ఉన్న సోఫియా వెర్గారా సంపాదన భారీగా ఉండటానికి కారణం ప్రధానంగా రెండు పాపులర్ టీవీ షోలు కావడం విశేషం. మార్వెల్ నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తున్న ‘ది ఎటర్నల్స్’ కోసం భారీ పారితోషికం అందుకున్నారు ఏంజెలినా జోలీ. ఆమె ఆదాయంలో ఎక్కువ శాతం ఈ సినిమా నుంచే వచ్చిందని టాక్. సాధారణంగా ప్రతీ ఏడాది సినిమాలు ఎక్కువ చేసే స్టార్స్ అత్యధికంగా సంపాదిస్తున్నవారి జాబితాలో కనిపిస్తారు. కానీ ఈ ఏడాది టీవీ స్టార్స్ కూడా ఈ జాబితాలో కనిపించడం విశేషం. ఎలెన్ పోంపీ, ఎలిజిబెత్ మోస్, వోయిలా డేవిస్ టీవీ స్టార్సే. సినిమా విడుదలలు ఏమీ లేకపోవడం, కొత్త సినిమా ప్రాజెక్ట్స్ ప్రకటించకపోవడం వల్ల చిన్నితెర స్టార్స్ సంపాదన పెరిగిందని హాలీవుడ్ మీడియా పేర్కొంది. -
కొలిక్కి రాని హీరోయిన్ల నగ్న చిత్రాల కేసు
జెన్నిఫర్ లారెన్స్ లాంటి కొందరు హాలీవుడ్ తారల నగ్న చిత్రాలను హ్యాక్ చేసి ప్రపంచానికి లీక్ చేసిన ఘటన జరిగి సోమవారానికి సరిగ్గా ఏడాది. ఈ కేసును విచారణకు చేపట్టిన ఎఫ్‌బీఐ ఎంతోమంది ఐపీ చిరునామాలు గాలించినా, ఎన్నో కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నా నేటికి దోషులను పట్టుకోలేకపోయింది. కేసు ఇప్పటికీ తెరిచే ఉందని, మూసేయలేదని ఎఫ్‌బీఐ అధికారులు సోమవారం సెలవిచ్చారు. ఆపిల్ 'ఐక్లౌడ్' ఖాతాలను ఆగస్టు 31, 2014 నాడు హ్యాకర్లు హ్యాక్ చేసి కొంత మంది హాలీవుడ్ హీరోయిన్ల నగ్న చిత్రాలను బయటకు లాగారు. వాళ్లకు సంబంధించిన కొన్నివేల చిత్రాలను వివిధ వెబ్సైట్లలో పోస్ట్ చేశారు. ఇది అప్పట్లో ఎంతో సంచలనం సృష్టించింది. తమ సర్వర్లు పటిష్ఠంగానే ఉన్నాయని, తమ సర్వర్ల ద్వారా ఈ ఫొటోలు బయటకు పోలేదని, ఖాతాదారులు ఇచ్చిన బలహీనమైన పాస్వర్డ్స్ ద్వారానే ఈ నేరం జరిగిందని ఆపిల్ కంపెనీ తెలిపింది. ఇది సెక్స్ నేరం కిందకే వస్తుందని, దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని జెన్నిఫర్ లారెన్స్ బహిరంగంగా డిమాండ్ చేశారు. ఆ నాటి అనుభవంతో ఆపిల్ 'ఐక్లౌడ్' రెండంచెల భద్రతా వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇతరులు కొంత కష్టపడితే కనిపెట్టే పాస్‌వర్డ్స్‌ను ఇవ్వకూడదని, సులభంగా గుర్తుంటుందని భావించి పుట్టినరోజు తోనో, పుట్టిన ప్రాంతంతో, ఈ మెయిల్ చిరునామాతో పాస్వర్డ్స్ ఇవ్వరాదని సూచించింది. పక్కవారు కూడా కనిపెట్టలేని విధంగా పాస్వర్డ్స్ ఉండాలని చెప్పింది. ఎడల్ట్ డేటింగ్ వెబ్సైట్ 'ఆస్లీ మాడిసన్' మరో వెబ్సైట్ 'సోని పిక్చర్స్'ను ఇటీవల హ్యాకర్లు హ్యాక్ చేసిన నేపథ్యంలో సెక్యూరిటీ పాస్వర్డ్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ఆపిల్ కంపెనీ హెచ్చరించింది. ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా విశ్వసించదగ్గవి మాత్రమే కొనుగోలు చేయాలని సూచించింది.