breaking news
High Life Ex-po
-
‘హై లైఫ్ ఎగ్జిబిషన్’ లో అలరించిన మోడల్స్
-
హైలైఫ్ ఎక్స్పో...
దేశంలోని వివిధ నగరాల డిజైనర్లు రూపొందించిన ఫ్యాషన్, లైఫ్‌సై ్టల్ ఉత్పత్తుల ప్రదర్శనకు హైలై ఫ్ ఎక్స్పో వేదిక కానుంది. మాదాపూర్ హెచ్ఐసీసీలో ఈనెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న హైలైఫ్ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, లగ్జరీ ప్రదర్శనలో 150 మందికి పైగా ఫ్యాషన్ డిజైనర్లు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ముంబై, ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, లక్నో, పుణే, బెంగళూరు, కోల్‌కతా వంటి అనేక ప్రాంతాల నుంచి ఆభరణాలు, డిజైనర్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, హోమ్ డెకార్స్, ఫర్నిషింగ్, గిఫ్టింగ్, వేలాది రకాల లైప్‌స్టైల్ యాక్సెసరీస్ అందుబాటులో ఉంచనున్నారు. ఈ ప్రదర్శన జూలై 3 నుంచి 5వ తేదీ వరకు కొనసాగనుందని నిర్వాహకులు తెలిపారు. కూచిపూడి ప్రదర్శన ప్రభుత్వ గుర్తింపు పొందిన ఈ సంస్థ 2005 నుంచి కూచిపూడిలో పలు ప్రదర్శనలు ఇచ్చింది. వార్షికోత్సవం రోజున గురువుతో పాటు 50 మంది విద్యార్థులతో ప్రదర్శన నిర్వహించనున్నారు. నిర్వహణ : భోగిరెడ్డి శ్రావ్య, సుమధుర ఆర్ట్ అకాడమీ డెరైక్టర్ అండ్ గురువు వేదిక : శృంగేరీ శంకరమఠం ప్రాంతం : మోతీనగర్, హైదరాబాద్ తేదీ : 2 జూలై (బుధవారం) సాయంత్రం 6.30 - 8 వరకు.