breaking news
Harvesting Plan
-
బిహార్‌లో మేఘా ప్రాజెక్టు పూర్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) బిహార్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంచి నీటి సరఫరా ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసింది. హర్ ఘర్ గంగాజల్ మొదటి దశ పనులతో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రమైన బోధ్ గయా, గయా, రాజ్‌గిర్ నగరాల తాగునీటి కష్టాలు తీరిపోనున్నాయి. శుద్ధి చేసిన గంగాజలాలు ఇకపై ఈ ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. భౌగోళిక పరిస్థితుల కారణంగా గంగా నదీ జలాలు అందుబాటులో లేని ఈ ప్రాంతాలకు వరద నీటిని తాగునీరుగా మార్చేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వరద నీటిని ఎత్తిపోతల ద్వారా రిజర్వాయర్లలో నింపి, శుద్ధిచేసి 365 రోజులు ప్రజలకు తాగునీరు సరఫరా చేసేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రాజెక్టులో భాగంగా 151 కిలోమీటర్ల పొడవు పైప్‌లైన్, నాలుగు వంతెనలతోపాటు రైల్వే ఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. -
ఖరీఫ్ సాగు లక్ష్యం.. 12.96 లక్షల ఎకరాలు
{పణాళిక వెల్లడించిన వ్యవసాయ శాఖ సబ్సిడీపై 1.22 లక్షల క్వింటాళ్ల విత్తనాలు పత్తి సాగు తగ్గుతుందని అంచనా రుణాలపై రూపొందని కార్యాచరణ హన్మకొండ : ఖరీఫ్ సాగుకు కొత్త ఆశలతో వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి అనుకూల వాతావరణం ఉంటుందనే అంచనాలతో సాగు ప్రణాళికను సిద్ధం చేసింది. జూన్ నుంచి మొదలయ్యే ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 12,96,000 ఎకరాల్లో పంటలు సాగయ్యేలా లక్ష్యం పెట్టుకుంది. సన్న, చిన్నకారు రైతుల కోసం 1,22,402 క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేయాలని నిర్ణయించింది. ఖరీఫ్‌లో సాగు చేసే పంటల కోసం 2,44,181 టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేసింది. వ్యవసాయ రంగానికి అవసరమైన కీలక అంశాలతో వ్యవసాయ శాఖ జిల్లా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ వివరాలను సోమవారం వెల్ల్లడించారు. జిల్లాలో ప్రధాన పంటగా ఉన్న పత్తి సాగు ఖరీఫ్‌లో తగ్గనుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోం ది. 5,25,000 ఎకరాల్లో పత్తి పంట సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ చెబుతోంది. గత ఖరీఫ్‌లో జిల్లాలో ఈ పంటను 6,19,070 ఎకరాల్లో సాగు చేశారు. గత ఏడాదితో పోల్చితే పత్తి సాగు ఈసారి 94,070 ఎకరాలు తగ్గనుందని అంచనా వేస్తోంది. వరి సాగు విస్తీర్ణం పెరగనుంది. వరుసగా రెండేళ్లు కరువుతో జిల్లాలో వ్యవసాయరంగం కుదేలైంది. తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండిపోయూయి. సాగు కోసం వేసిన విత్తనాలు ఖర్చు కూడా రైతుల చేతికి రాలేదు. వచ్చే సీజనులో పెట్టుబడి ఖర్చులు లేని దయనీయ స్థితిలో రైతులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాం కులు ద్వారా అవసరమైన మేరకు రైతులకు రుణాలు ఇప్పించి ప్రణాళిక ప్రకారం పంటలు సాగయ్యేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఖరీఫ్ రుణ ప్రణాళికపై అధికారులు ఇంకా కార్యాచరణ రూపొందించలేదు. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైనా రుణ ప్రణాళిక లేకపోవడం వ్యవసాయరంగంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని రైతు సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.