happiest country
-
మాది ఆనందం.. మీది అనుబంధం..
బహుశా ఫిన్లాండ్ అనే చిన్న దేశం గురించి మిగిలిన సందర్భాల్లో ఎవరూ ఎక్కువ ముచ్చటించుకోకపోవచ్చు.. కానీ యేటా మార్చి నెల్లో మాత్రం కచ్చితంగా ఆ దేశం టాక్ ఆఫ్ ది వరల్డ్ అవుతుంది. ఎందుకంటే గత కొన్నేళ్లుగా హ్యాపీనెస్ ఇండెక్స్‌లో తొలిస్థానంలో ఫిన్లాండ్ నిలుస్తోంది కాబట్టి. అదే క్రమంలో తాజా హ్యాపీ నెస్ ఇండెక్స్‌లోనూ ఫిన్లాండ్ తొలిస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ దేశపు మహిళ.. మన తెలుగింటి కోడలు రైతా ముచ్చర్ల ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..ఫిన్లాండ్..‘హ్యాపీ’ బ్రాండ్.. మా దేశంలో పేద ధనిక గొప్ప తారతమ్యాలు ఉండవు. వాటికి చిన్నవయసులోనే పాతరేస్తారు.. దాదాపు 90 శాతం విద్యావ్యవస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉంటుంది. స్కూల్స్‌లో, కాలేజీల్లో డబ్బుల్ని బట్టి, హోదాల్ని బట్టి విద్యార్థులను విభజించడం ఉండదు కాబట్టి చిన్న వయసులోనే ఈక్వాలిటీ అనేది బాగా నాటుకుంటుంది. దీని వల్ల 100 శాతం అక్షరాస్యత సాధించగలిగారు. అలాగే చదువుతో పాటు ప్రతి నగరంలోనూ శిక్షణా సంస్థలు ఉంటాయి. విభిన్న రకాల కళలు, సామర్థ్యాలలో రాణించాలనుకునేవారు ఎవరైనా సరే వయసుతో ప్రమేయం లేకుండా నామమాత్రపు రుసుముతోనే నేరి్పంచే శిక్షణా సంస్థలు ఉంటాయి. అభిరుచులే.. ఆనంద మార్గాలు.. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అభిరుచి/హాబీ మా దేశంలో తప్పకుండా ఉంటుంది. అక్కడ కూడా సినిమాలు ఉంటాయి కానీ.. వాటికన్నా కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలే ఎక్కువ ఉంటాయి. దానికి కళల పట్ల, కళారంగాల పట్ల వ్యక్తుల్లో ఉన్న అభిరుచే కారణం కావచ్చు.హరితం.. లంచాల రహితం.. పిల్లలను ప్రకృతికి దగ్గరగా ఉంచడానికి అక్కడ ప్రాధాన్యత ఇస్తారు. దాదాపు ప్రతి నగరానికీ ఆనుకుని ఒక అడవి ఉంటుంది. అందులో నెలకు ఒక్క రోజైనా పిల్లలను స్వేచ్ఛగా విహరించేలా చూస్తారు. రాజకీయాలు సంపాదనకు మార్గంగా భావించడం ఉండదు. రాజకీయాలనే కాదు, ఏ రంగమైనా సరే లంచగొండితనం జీరో అని చెప్పొచ్చు. తద్వారా ఒకరిని ఒకరు దోపిడీ చేస్తారనే భయాలు ఉండవు. అలాగే ఏ అర్ధరాత్రయినా సరే భద్రంగా సంచరించవచ్చు.. దొంగతనాలు, నేరాల రేటు కూడా అత్యంత స్వల్పం. ఒకరినొకరు అనుమానించుకోవడం, అపనమ్మకాలతో బంధాలు వంటివి అక్కడ కనపడవు. అన్నీ బాగున్నా.. అనుబంధాల్లో మీరే మిన్న.. ఫిన్లాండ్.. చాలా విషయాల్లో బాగున్నా.. అనుబంధాల్లో మాత్రం భారత దేశంతో పోలిస్తే వెనుకబడే ఉందని అనుభవపూర్వకంగా చెప్పగలను. తెలుగు అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని నగరానికి వచి్చన యువతిగా.. ఈ దేశపు అనుబంధాలు నాకు ఆశ్చర్యానందాలను కలిగించాయి. పరస్పరం కేరింగ్ ఇక్కడ ఎక్కువ. వ్యక్తుల మధ్య అనుబంధాలకు ఇక్కడ ఇస్తున్నంత విలువ అక్కడ కనపడదు. అక్కడ విడాకుల సంఖ్య కూడా ఇక్కడితో పోలిస్తే ఎక్కువే. స్వేచ్ఛా ప్రియత్వం ఎక్కువగా ఉండడం వల్ల 20 నిమిషాల్లో పెళ్లి తంతు ముగించినట్టుగానే బంధాలకూ అంతే వేగంగా, సులభంగా వీడ్కోలు పలుకుతారు. దీనివల్లే అక్కడ ఒంటరితనం బాధితులు ఎక్కువగా కనబడతారు. అదే సమయంలో ఇక్కడ ఉన్నంత పోటీ తత్వం కూడా అక్కడ ఉండదు. అన్ని రకాలుగానూ ఇతరుల్ని మించి ఎదగాలనే తపన, ఆరాటం ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆ క్రమంలోనే తమ హోదాలు, అంతస్తులు.. వగైరాలను ప్రదర్శించుకోవడం కూడా జరుగుతుంటుంది. అక్కడ ఇలాంటివి ఏ మాత్రం కనిపించవు. -
భారత్ కన్నా పాలస్తీనా, ఉక్రెయిన్ వెరీ వెరీ హ్యాపీ
వాషింగ్టన్/ లండన్: రోజువారీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనాసరే వాటిని సమర్థవంతంగా పరిష్కరించుకుంటూ ముందుకుసాగే పౌరులున్న దేశంలో నిరంతరం ఆనందం వెల్లివిరుస్తుంది. ఫిన్లాండ్లో ప్రజలు ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. గురువారం విడుదలైన ప్రపంచ ఆనందమయ దేశాల నివేదిక–2025లో ఫిన్లాండ్ అత్యంత సంతోషకర దేశంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.నంబర్‌వన్ ర్యాంక్‌ను ఫిన్లాండ్ సాధించడం ఇది వరసగా ఎనిమిదోసారి కావడం విశేషం. డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. భారత్ 118వ ర్యాంక్ సాధించింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సి టీలోని వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ వార్షిక నివేదికను రూపొందించారు. ఆయా దేశాల పౌరుల ఆదాయాల వ్యయాలు, వృద్ధి మాత్రమే కాకుండా వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు, పరస్పర నమ్మకం, సామాజిక మద్దతు, ఆత్మ సంతృప్తి, ఆయుర్దాయం, స్వేచ్ఛ, దానగుణం, అవినీతి స్థాయి తదితర అంశాలను బేరీజు వేసుకుని ఈ నివేదికకు తుదిరూపునిచ్చారు.మీ జీవితాలకు మీరు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు? వంటి విభిన్నమైన ప్రశ్నలకు ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల ప్రజల సమాధానాలు రాబట్టి నివేదికను తయారుచేశారు. విశ్లేషణ సంస్థ గాలప్, అమెరికా సుస్థిరాభివృద్ధి పరిష్కారాల నెట్‌వర్క్‌లతో కలిసి ఈ నివేదికను సిద్ధంచేశారు. అంతర్జాతీయ ఆనందమయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఈ జాబితాను విడుదల చేశారు.భారత్ కంటే మెరుగైన స్థానంలో పొరుగుదేశాలుగత ఏడాది 126వ ర్యాంక్‌తో పోలిస్తే భారత్ ఈసారి మెరుగ్గా 118వ ర్యాంక్ సాధించింది. అయితే భారత్‌కు పొరుగున ఉన్న దేశాలు అంతకంటే మెరుగైన స్థానాల్లో నిలిచాయి. చైనా 68వ ర్యాంక్, నేపాల్ 92 ర్యాంక్, పాకిస్తాన్ 109వ ర్యాంక్ సాధించాయి. యుద్ధంలో మునిగిపోయిన పాలస్తీనా ప్రాంతం, ఉక్రెయిన్ సైతం భారత్ కంటే మెరుగైన ర్యాంక్‌లు పొందటం విశేషం. పాలస్తీనా ప్రాంతం 108వ ర్యాంక్, ఉక్రెయిన్ 111వ ర్యాంక్ సాధించాయి. అయితే శ్రీలంక 133వ ర్యాంక్, బంగ్లాదేశ్ 134వ ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాయి. బ్రిటన్‌కు 23 ర్యాంక్ దక్కింది. మొత్తం జాబితాలో అఫ్గానిస్తాన్ చిట్టచివరన నిలిచింది. గత ఏడాది అఫ్గానిస్తాన్‌కు 143వ ర్యాంక్ వస్తే ఈఏడాది 147వ ర్యాంక్ వచ్చింది.అమెరికాకు 24వ ర్యాంక్ప్రపంచ పెద్దన్నగా అన్ని దేశాలపై అమెరికా ఆధిపత్యం చెలాయిస్తోందిగానీ ఆ దేశ ప్రజలు ఆనంద విషయంలో అంతేస్థాయిలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోలేకపోయారు. అమెరికా కేవలం 24వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. 13 ఏళ్ల క్రితం 11వ స్థానంలో ఉన్న అమెరికా ఇçప్పుడు 24వ ర్యాంక్‌కు పడిపోయింది.ఇక హమాస్ యుద్ధంతో ఇజ్రాయెల్ పౌరులు విసిగిపోయారని వార్తలొస్తున్నా వ్యక్తిగత, సమాజ జీవితంలో వాళ్లు మెరుగ్గా ఉన్నారని నివేదిక ప్రకటించింది. జాబితాలో ఇజ్రాయెల్ 8వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. నెదర్లాండ్స్ (5), కోస్టారికా (6), నార్వే (7), ఇజ్రాయెల్ (8), లక్సెంబర్గ్ (9), మెక్సికో (10) తొలి 10 ఆనందమయ దేశాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. కోస్టారికా, మెక్సికోలు టాప్– 10లో నిలవడం ఇదే తొలిసారి. -
దేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏంటో తెలుసా?
భారతదేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా మిజోరాం నిలిచింది. ఈ మేరకు గురుగ్రామ్‌లోని మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ స్ట్రాటజీ ప్రొఫెసర్ రాజేష్ కె పిలానియా అధ్యయనం ప్రకారం దీన్ని ప్రకటించారు. నివేదిక ప్రకారం.. 100 శాతం అక్షరాస్యత సాధించడంలో భారతదేశంలోని మిజోరాం రాష్ట్రం రెండో స్థానం దక్కించుకుంది. అంతేగాదు ఇక్కడ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా విద్యార్థులు అభివృద్ధి చెందేలా పుష్కలమైన అవకాశాలను అందిస్తోంది. ఈ ఆనంద సూచికను కుటుంబ సంబంధాలు, పని సంబంధిత సమస్యలు, సామాజిక సమస్యలు, దాతృత్వం, మతం, ఆనందం, కోవిడ్-19 ప్రభావం, శారీరక మానసిక ఆరోగ్యంతో సహా ఆరు పారామితుల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. మిజోరాంలో ఐజ్వాల్‌లోని ప్రభుత్వ మిజో హైస్కూల్(జీహెచ్ఎంస్) విద్యార్థి..తన తండ్రి చిన్నతనంలో కుటుంబాన్ని విడిచిపెట్టడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ అతను చదువులో రాణించడం విశేషం. అదేవిధంగా జీఎంహెచ్ఎస్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థి నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ)లో చేరాలని ఆకాంక్షిస్తున్నాడు. అతని తండ్రి పాల ఫ్యాక్టరీలో పని చేస్తాడు, అతని తల్లి గృహిణి. ఆ ఇద్దరూ విద్యార్థులు తమ పాఠశాల కారణంగా తమ లక్ష్యాన్ని చేరుకుంటామనే భావంతో ఉన్నారు. అంతేగాదు మా ఉపాధ్యాయులు మాకు మంచి స్నేహితులు మేము వారితో ఏ విషయాన్నేనా పంచుకోవడానికి సందేహించం, భయపడం అని మరో విద్యార్థి చెప్పాడు. మిజోరాంలో అక్కడ ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులతో వారు ఎదుర్కొంటున్న ఏవైనా సమస్యలను పరిష్కరించడానికి క్రమం తప్పకుండా బేటీ అవుతారని తెలిసింది. పైగా అక్కడ చదువుల కోసం తల్లిదండ్రలు ఒత్తిడి చాలా తక్కువ. ప్రతి బిడ్డ లింగ భేదం లేకుండా ముందుగా సంపాదించడం ప్రారంభిస్తారని నివేదిక పేర్కొంది. అక్కడ ప్రజలు ఏ పనిని చిన్నదిగా భావించరు. యువకులు సాధారణంగా 16 లేదా 17 ఏళ్ల వయసు నుంచి ఉపాధి వెతుక్కుంటారు. దీంతోపాటు బాలికలు, అబ్బాయిలు అనే వివక్ష ఉండదని నివేదిక పేర్కొంది. ఇలా అనే అంశాల్లో సానూకూలత కనిపించడంతో మిజోరాం అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా నిలిచింది. (చదవండి: అది సరికాదు.. సాయిబాబా కేసును మరోసారి విచారించండి: సుప్రీం కోర్టు) -
ఫిన్లాండ్.. అంత సంతోషంగా ఎలా ఉంటుందో తెలుసా?
ఫిన్లాండ్.. మరోసారి హ్యాపీయెస్ట్ కంట్రీగా నిలిచింది. వరుసగా ఐదవ ఏడాది ఈ ఘనత సొంతం చేసుకుంది ఈ యూరోపియన్ కంట్రీ. ఐక్యరాజ్య సమితి వార్షిక సూచీ వివరాల ప్రకారం.. ఈ భూమ్మీద ఫిన్లాండ్ అత్యంత సంతోషకరమైన దేశంగా మొదటి స్థానంలో ఉంది. వరుసగా ఐదో ఏడాది World's Happiest Nation సూచీలో తొలిస్థానం సంపాదించుకుంది. సెర్బియా, బల్గేరియా, రొమేనియా సైతం ఈ లిస్ట్‌లో పుంజుకుని ముందుకు ఎగబాకాయి. ► ఇక ఈ సూచీలో ఘోరంగా పతనం అయ్యింది లెబనాన్, వెనిజులా, అఫ్గనిస్థాన్ దేశాలు. లెబనాన్.. ఆర్థిక సంక్షోభం కారణంగా జాబితాలో చివరి నుంచి రెండో ప్లేస్‌లో నిలిచింది. ► ఇక చివరిస్థానంలో ఉంది అఫ్గనిస్థాన్. గత ఆగష్టులో తాలిబన్లు దేశాన్ని స్వాధీనం చేసుకున్నాక మానవ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. ► వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్.. 2022లో వరుసగా పదవ ఏడాది రిలీజ్ అయ్యింది. ఆర్థిక, సోషల్ డేటా, ప్రజల ఆనందం యొక్క స్వంత అంచనా ఆధారంగా ఈ సూచీలో స్థానం కల్పిస్తారు. సూచీ స్కేల్ సున్నా నుంచి పది మధ్యగా ఉంటుంది. సగటున మూడేళ్ల కాలానికి గణిస్తారు. ఇదిలా ఉంటే.. తాజా నివేదిక ఉక్రెయిన్-రష్యా యుద్దం కంటే ముందుగానే రూపొందించారు. ► ఉత్తర యూరప్ దేశాల డామినేషన్ ఈ సూచీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఫిన్లాండ్ తర్వాత డెన్మార్క్ స్విట్జార్లాండ్, ఐస్‌ల్యాండ్, నెదర్లాండ్స్(హాల్యాండ్), నార్వే, స్వీడన్ ఉన్నాయి. ప్రత్యేక గౌరవం భూటాన్‌కు దక్కింది. భారత్ 136వ స్థానంలో నిలిచింది. ► ఫిన్లాండ్ జనాభా.. దాదాపు 5.5 మిలియన్. ఇక్కడి ప్రజల లైఫ్‌స్టయిల్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఫిన్లాండ్ ప్రజలు సంతోషం వచ్చినా.. దుఖం వచ్చినా గోల చేయరు. ఒక డిగ్నిటీతో సాగిపోతుంటుంది వాళ్ల లైఫ్. ► ముఖ్యంగా కరోనా టైంలో ఫిన్లాండ్ ప్రపంచానికి ఎన్నో పాఠాలు నేర్పింది. బహిరంగ వేడుకలను పరిమితంగా చేసుకోవాలన్న ప్రభుత్వ పిలుపును తూచా తప్పకుండా పాటించి క్రమశిక్షణలో తమకు తామే సాటని ప్రపంచానికి చాటి చెప్పారు. ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ ► విస్తారమైన అడవులు, సరస్సుల దేశం అది. బాగా పనిచేసే ప్రజా సేవలు, అధికారంపై విస్తృత విశ్వాసం ఉంటుంది అక్కడి ప్రజలకు. అలాగే నేరాలు తక్కువ. పైగా అసమానతలకు తావు ఉండదు. ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవిస్తుంటారు అక్కడి ప్రజలు. ► నాణ్యత విద్య, ఉచిత ఆరోగ్య సంరక్షణ, లింగ సమానత్వం, స్వచ్ఛమైన స్వభావం, అధిక వ్యక్తిగత స్వేచ్ఛ, బాగా పనిచేసే సమాజం.. Finland ప్రజల సంతోషానికి కారణాలు. ► కరోనా టైంలో ప్రపంచంలో చాలా దేశాలు తీవ్ర సంక్షోభంలో మునిపోయాయి. ప్రజలు మానసికంగా కుంగిపోయారు. అయితే ఫిన్లాండ్లో మాత్రం కరోనా ప్రభావం.. వాళ్ల సంతోషాన్ని దూరం చేయలేకపోయింది. -
‘వరల్డ్ హ్యాపియెస్ట్ కంట్రీ’గా ఫిన్లాండ్
బ్లూమ్‌బర్గ్: ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం (హ్యాపీయెస్ట్ కంట్రీ)గా ఫిన్లాండ్ వరుసగా మూడోసారి రికార్డుల్లోకి ఎక్కింది. మార్చి 20న వరల్డ్ హ్యాపినెస్ డే సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఈ ర్యాంకులను విడుదల చేసింది. ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు సుమారు 156 దేశాల ప్రజల జీవన స్థితిగతులు, సంతోషకరమైన జీవనశైలిని పరిశీలించి ఈ జాబితాను రూపొందించారు. జీడీపీ, సామాజిక మద్దతు, వ్యక్తిగత స్వేచ్ఛ, అవినీతి స్థాయి వంటి అంశాల్లో ఫిన్లాండ్ ప్రజలు సంతోషంగా ఉన్నారని పరిశోధనలో వెల్లడైంది. చదవండి: కరోనా: 'నిర్లక్ష్యం వహిస్తే లక్షల్లో ప్రాణాలు పోతాయి' సంతోషకర నగరాల జాబితాలో ఫిన్లాండ్ రాజధాని హెల్సింకి టాప్‌లో నిలిచింది. ఇక అతి తక్కువ సంతోషంగా ఉన్న దేశాల జాబితాలో ఆఫ్గనిస్తాన్ మొదటి స్థానంలో నిలిచింది. ఇండియా విషయానికి వస్తే అతి తక్కువ సంతోషంగా ఉన్న నగరాల జాబితాలో 10వ స్థానంలో నిలిచింది. అయితే అతి తక్కువ సంతోషంగా ఉన్న నగరాల జాబితాలో ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబుల్ మొదటి స్థానంలో నిలిచింది. ఇండియా నగరాల విషయానికి వస్తే అతి తక్కువ సంతోషకర నగరాల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ ఏడవ స్థానంలో నిలిచింది. కాగా.. ఫిన్లాండ్లో ఉండే విస్తారమైన అడవులు, వేల సంఖ్యలో సరస్సులు అక్కడి వాసులు ఆహ్లాదకర, సంతోషకరమైన వాతావరణంలో ఉండేలా ఉపకరించాయని తెలిసింది. ఇక జింబాబ్వే, సౌత్ సూడాన్, అప్ఘనిస్తాన్ ప్రపంచలోనే అతి తక్కువ సంతోషంగా ఉన్న దేశాల జాబితాలో ఉన్నాయి. చదవండి: ఏప్రిల్ 19న యుగాంతం; ఏంటి కథ? -
ఆనందంలో అట్టడుగున..!
సంతోష సూచిలో 121వ స్థానంలో భారత్ ⇒ తొలిస్థానంలో నార్వే ⇒ ఐరాస నివేదికలో వెల్లడి ఐక్యరాజ్యసమితి: భారతీయుల కంటే పాకిస్తానీయులే ఎక్కువ సంతోషకర జీవితాన్ని గడుపుతున్నారు.. మన కంటే ఇరాక్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశ వాసులే అధిక ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. కాగా సంతోషకర దేశాల జాబితాలో భారత్ 121వ స్థానానికి పరిమితమై అట్టడుగున నిలిచింది. ‘ప్రపంచ సంతోషకర దేశాల నివేదిక 2017’ ఈ విషయాన్ని వెల్లడించింది. అంతర్జాతీయ సంతోషకర దినోత్సవం సందర్భంగా సోమవారం ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో జాబితాను విడుదల చేశారు. మొత్తం 155 దేశాలకు ర్యాంకులు ప్రకటించారు. 2014–15 నివేదిక ప్రకారం భారత్ స్థానం 118 కాగా.. ఇప్పుడు నాలుగు స్థానాలు తగ్గి చైనా, పాకిస్తాన్, నేపాల్ కంటే వెనుకంజలో నిలిచింది. ప్రజల తలసరి ఆదాయం, సాంఘిక భద్రత, ఆరోగ్యకర జీవితం, నచ్చింది ఎన్నుకోవడంలో ఉండే స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతిపై జాగరూకత ఆధారంగా జాబితాను రూపొందించారు. వ్యక్తిగత అంశాలు సంతోషాన్ని ప్రభావితం చేస్తాయని ఈ నివేదిక వెల్లడించింది. డెన్మార్క్‌ను వెనక్కినెట్టి... ప్రపంచంలో అంత్యంత సంతోషకర దేశంగా నార్వే నిలిచింది. గతేడాది కంటే మూడు స్థానాలు ఎగబాకి నార్వే ఈ ఘనత సాధించింది. మూడేళ్లుగా నంబర్‌వన్‌గా కొనసాగుతున్న డెన్మార్క్ రెండోస్థానంతో సరిపెట్టుకుంది. చైనా (79), పాకిస్తాన్ (80), నేపాల్ (99), బంగ్లాదేశ్ (110), ఇరాక్ (117), శ్రీలంక (120) స్థానాల్లో నిలిచా యి. నార్వే, డెన్మార్క్ తర్వాతి స్థానాల్లో ఐస్లాం డ్, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్వీడన్ ఉన్నాయి. గతేడాది కంటే ఒక స్థానం తగ్గి అమెరికా 14వ స్థానం దక్కించుకుంది. 2012 నుంచి ఇంతవరకూ ఐదుసార్లు ఈ నివేదికల్ని విడుదల చేశారు. -
ప్రపంచంలో సంతోషంగా జీవిస్తున్న దేశం ఇదే
ప్రపంచంలో ప్రజలు అత్యంత సంతోషంగా జీవిస్తున్న దేశాల జాబితాలో ఈ ఏడాదికి డెన్మార్క్ అగ్రస్థానంలో నిలిచింది. 2015లో ఈ దేశం మూడోస్థానంలో ఉండగా.. ఈ ఏడాది మరింత పురోభివృద్ధి చెంది అగ్రస్థానానికి చేరిందని 'వరల్డ్ హాపీనెస్ లెవెల్స్' తాజా అధ్యయనలో తేలింది. జాతీయ స్థూల ఉత్పత్తిలో ప్రజల సగటు ఆదాయాన్ని, వారి ఆరోగ్య ఆయుర్దాయాన్ని, జీవితాన్ని ఎంపిక చేసుకోవడంలో ప్రజలకున్న స్వేచ్ఛను పరిగణనలోకి తీసుకొని 156 దేశాల జాబితాను రూపొందించగా, డెన్మార్క్‌కు మొదటి స్థానం లభించింది. స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నార్వే, ఫిన్లాండ్లు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. నోర్డాక్ దేశాలు మొదటి ఐదు స్థానాలను సాధించడం విశేషం. కామన్వెల్త్ దేశాలైన కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు పది స్థానాల లోపల చోటు దక్కించుకున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా 13వ స్థానంలో, జర్మనీ 16వ స్థానంలో, బ్రిటన్ 23 స్థానాల్లో నిలిచాయి. డబ్బు వెంట పరుగెత్తుతున్న అమెరికా లాంటి దేశాలకు ఇదో సందేశమని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ప్రత్యేక సలహాదారు జెఫ్రీ సాచ్స్ వ్యాఖ్యానించారు. మన సామాజిక స్వరూపం క్షీణించిపోతోందని, సామాజిక విశ్వాసం సన్నగిల్లుతోందని, ప్రభుత్వాల పట్ల ప్రజలు విశ్వాసం కూడా కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 'సామాజిక, పర్యావరణ ప్రాథమ్యాలను పట్టించుకోకుండా కేవలం ఆర్థిక అభివృద్ధిపైనే దేశాలు దృష్టి పెడితే అది మానవ సంక్షేమానికి అవరోధం అవడమే కాకుండా మానవ మనుగడకే ముప్పును తీసుకొస్తుంది' ప్రపంచ ప్రజల సంతోషం పట్ల అధ్యయనం చేసిన సంస్థ తన నివేదికలో వ్యాఖ్యానించింది. తూర్పు యూరప్ దేశాలైన లాత్వియా, స్లొవేకియా, ఉజ్బెకిస్తాన్, రష్యా లాంటి దేశాలు కూడా ప్రజలు సంతోషంగా జీవించేందుకు ప్రాధాన్యం ఇవ్వడంలో గతంలో కన్నా ఎంతో పురోగతి చెందాయని కూడా ఆ నివేదిక వెల్లడించింది.