breaking news
The growth rate
-
India eight core industries: మౌలిక పరిశ్రమల గ్రూప్ నిరాశ
న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్ డిసెంబర్లో తీవ్ర నిరాశను మిగిలి్చంది. అధికారిక గణాంకాల ప్రకారం వృద్ధి రేటు 3.8%గా నమోదయ్యింది. అంతక్రితం గడచిన 14 నెలల్లో గ్రూప్ ఇంత తక్కువ స్థాయి వృద్ధి రేటు నమోదుచేసుకోవడం ఇదే తొలిసారి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో 40% వెయిటేజ్ ఉన్న గ్రూప్‌లో బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ రంగాలు ఉన్నాయి. వీటిలో ఒక్క సహజ వాయువు రంగం (6.6%) పురోగమించింది. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి 1% క్షీణించింది. ఇక ఆరు రంగాల వృద్ధి రేట్లూ 2022 డిసెంబర్‌తో పోల్చితే 2023 డిసెంబర్లో తగ్గాయి. కాగా, ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య ఈ రంగాల వృద్ధి రేటు దాదాపు స్థిరంగా 8.1% వద్ద నిలిచింది. -
ఎగుమతుల మందగమనం
న్యూఢిల్లీ: దేశీ ఎగుమతుల వృద్ధి రేటు తక్కువ స్థాయిలో నమోదయ్యింది. గత యేడాది ఇదే నెలతో పోల్చితే కేవలం 7.33 శాతంగా ఉంది. దీనితో వాణిజ్యలోటు సైతం ఏడాది గరిష్ట స్థాయికి ఎగసింది. మే, జూన్ నెలల్లో ఈ వృద్ధి రేటు రెండంకెల్లో నమోదయ్యింది. ప్రభుత్వ గణాంకాల్లోకి వెళితే... జూలైలో ఎగుమతుల విలువ 27.72 బిలియన్ డాలర్లు దిగుమతుల విలువ 39.95 బిలియన్ డాలర్లు. ఇది వార్షిక ప్రాతిపదికన 4.25 శాతం ఎగసింది. ఈ నేపథ్యంలో వాణిజ్యలోటు (ఎగుమతులు-దిగుమతుల విలువ మధ్య వ్యత్యాసం) 12.22 బిలియన్ డాలర్లు. ఇది యేడాది గరిష్ట స్థాయి. రంగాల వారీగా చూస్తే... ఎగుమతుల్లో మంచి ఫలితాలను ఇచ్చిన రంగాల్లో జౌళి (13.3%), పెట్రోలియం ఉత్పత్తులు (28%), ఇంజనీరింగ్ (23.9%) లెదర్ (17.23 శాతం), మెరైన్ ప్రొడక్ట్స్ (25%), ఆయిల్ సీడ్స్ (19.25%), కెమికల్స్ (16.67%), ఔషధాలు (10.78%) ఉన్నాయి. ఎఫ్ఐఈఓ వ్యాఖ్య... తాజా గణాంకాల నేపథ్యంలో భారత ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) ఒక ప్రకటన చేస్తూ రత్నాలు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల ఎగుమతుల ప్రతికూల వృద్ధి ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. రానున్న విదేశీ వాణిజ్య విధానం ఎగుమతుల వృద్ధికి తగిన చర్యలను తీసుకుంటుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చింది. బంగారం, వెండి ఇలా... కాగా జూలైలో బంగారం, వెండి దిగుమతులు వార్షిక ప్రాతిపదికన 34.46% తగ్గాయి. 1.94 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇందులో బంగారం వాటా 1.81 బిలియన్ డాలర్లు. ఒక్క బంగారాన్ని చూసుకుంటే దిగుమతులు వార్షిక ప్రాతిపదికన 26.39 శాతం పడిపోయాయి. క్యాడ్ కట్టడిలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు దీనికి ప్రధాన కారణం. వార్షికంగా చూస్తే... ఏప్రిల్-జూలై మధ్య కాలంలో గత ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే- ఎగుమతుల విలువ 99.28 బిలియన్ డాలర్ల నుంచి 107.83 బిలియన్ డాలర్లకు ఎగసింది. వృద్ధి 8.62%. కాగా దిగుమతులు 3.8 శాతం క్షీణించి 159.15 బిలియన్ డాలర్ల నుంచి 153.15 బిలియన్ డాలర్లకు తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం మొత్తంమీద ఎగుమతులు విలువ 312 బిలియన్ డాలర్లు కాగా, ఈ యేడాది ఈ విలువ 325 బిలియన్ డాలర్లకు పెంచాలన్నది లక్ష్యం.