breaking news
Grand Canyon
-
టెక్నాలజీ కన్నే ఎరుగని అమెరికా పల్లెటూరు.. నేటికీ గాడిదలపైనే ప్రయాణం..!
Grand Canyon Supai Village Interesting Facts In Telugu: అభివృద్ధి, టెక్నాలజీ గురించి ఒక నిముషం మాట్లాడమంటే మదిలో మొదటమెదిలే దేశం అమెరికా. ఎత్తైన భవనాలు, సైంటిఫిక్ కల్చరల్ లైఫ్, కొత్త కొత్త టెక్నాలజీలతో దూసుకుపోయే ప్రపంచం అక్కడి ప్రజలది. ఒక్క మాటలో చెప్పాలంటే అభివృద్ధికి మారుపేరు అమెరికా. ప్రతి ఒక్కరూ అమెరికాలో స్థిరపడాలని కోరుకుంటారనడంతో సందేహంలేదు. ఇతంటి ఘన చరిత్ర ఉన్న అమెరికాలోకూడా వెనుకబడిన ప్రాంతాలు ఉంటాయా.. అనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా? అవును.. అసలు అభివృద్ధి అంటే ఏమిటో కూడా తెలియని ఓ గ్రామం ఉంది. ఏంటీ.. అమెరికాలో గ్రామాలా? అదీ అభివృద్ధేలేని గ్రామం.. అస్సలు నమ్మం..! అనుకుంటున్నారా? ఐతే ఇది చదవండి. 3 వేల అడుగుల లోతులో ఆ గ్రామం.. గ్రాండ్ కాన్యన్ అనే లోతైన లోయ అమెరికాలో చాలా ఫేమస్. ప్రతీ ఏట దాదాపుగా 55 లక్షల మంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు కూడా. దీనికి సమీపంలోనే సుపాయ్ అనే గ్రామం ఉంది. అతిలోతైన భూగర్భ గ్రామంగా ఇది ప్రసిద్ధి. ఎందుకంటే అమెరికా భూమట్టానికి దాదాపుగా మూడు వేల అడుగుల లోతులో ఉందీ గ్రామం. ఇక్కడ దాదాపు 208 మంది అమెరికన్ స్థానికులు నివసిస్తున్నారు. చదవండి: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..! ఈ రోజుకీ గాడిదలపైనే ప్రయాణం.. ఈ గ్రామస్తులు ఎంత వెనుకబడి ఉన్నారో తెలిస్తే షాక్ అవుతారు. ఇక్కడి ప్రజలు పూర్తిగా విభిన్న ప్రపంచంలో నివసిస్తున్నారు. వీరికి ప్రత్యేక ఆచార వ్యవహారాలు ఉన్నాయి. సుపాయ్ గ్రామస్థులు హవాసుపాయి భాషను మాట్లాడుతారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వాటిని అనుసరిస్తారట. ఈ గ్రామంలో ప్రయాణించడానికి రైలు లేదు. కనీసం సరైన రోడ్డు కూడా లేదు. ఈ గ్రామానికి చేరుకోవాలంటే కాలి కాలినడకన వెళ్లాల్సిందే!! లేదంటే గాడిదలపై రావాలి. అంతేకాకుండా 1, 2 గుర్రాలు కూడా ప్రయాణాలకు వినియోగిస్తారట. వీటిద్వారానే సమీపంలో ఉన్న హైవేకి వెళ్తుంటారు. ఈ గ్రామానికి, సిటీని కలిపే ఖచ్చితమైన మార్గం కూడా ఏదీ లేదు. కేవలం గుర్రాలు, గాడిదలపైనే సిటీలకు ప్రయాణిస్తుంటారు అక్కడి స్థానికులు. వెదురుతో బుట్టలను అల్లి.. నగరానికి వెళ్లి.. టెక్నాలజీకి పూర్తిగా దూరంగా ఉందీ గ్రామం. ఐతే ఇక్కడ కొన్ని పోస్టాఫీసులు, కేఫ్‌లు, రెండు చర్చిలు, లాడ్జీలు, ప్రాథమిక పాఠశాలలు, కిరాణా దుకాణాలు ఉన్నాయి. ఇక్కడి ప్రజల జీవనోపాధి ఏంటంటే.. వెదురుతో బుట్టలను అల్లి సమీపంలోని నగరాల్లో అమ్ముకుని జీవనం సాగించటం. చిక్కుడు, మొక్కజొన్నలను సాగు చేసి పొట్టపోసుకుంటారు. చదవండి: Cerebrovascular Disease: ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణం ఇదే.. చేపలు తిన్నారంటే.. ఫోన్ అంటే ఏమిటో కూడా వీళ్లకు తెలియదు! ఇంతగా వెనుక బడిన సుపాయి గ్రామానికి ఉత్తరాలేమైనా వచ్చినా.. అక్కడి ప్రజలకు సమయానికి చేరవు. సరైన రవాణా సదుపాయాలు లేకపోవడమే అందుకు ప్రధాన కారణం. ఉత్తరాలు అందజేయడానికి కూడా గాడిదలు, గుర్రాలపైనే ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ గ్రామంలో ఫోన్, ఈమెయిల్, ఫ్యాక్స్ సౌకర్యాలు అస్సలుండవు. ఇదంతా చదువుతుంటే.. పాత కాలం నవలలాగా, బ్లాంక్ అండ్ వైటు సినిమాలా అనిపించినా.. నేటికీ సుపాయి గ్రామం పరిస్థితికి అద్దంపట్టే వాస్తవాలివి. అమెరికా లాంటి దేశంలో ఇంత వెనుకబడిన గ్రామం ఉండడం చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ...! అంతేకాదు ఈ ఊరుకి వెళ్లాలంటే దారంతా పొదలతో నిండిన అడవులను దాటుకుంటూ వెళ్లవలసి ఉంటుంది. ప్రతీ ఏట వేలాది మంది పర్యాటకులు ఈ గ్రామాన్ని చూసేందుకు వెళుతుంటారు. ఐతే ఈ గ్రామంలోకి ప్రవేశించేముందు హవాసుపాయి గిరిజన మండలి అనుమతి తప్పక తీసుకోవాలి. లేదంటే లోపలికి ప్రవేశం లేదు. గ్రామంలో ప్రవేశించిన తర్వాత కూడా వారి నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలట. నేటి ఆధునిక యుగంలో అమెరికాలాంటి దేశంలో అభివృద్ధి కన్నే ఎరుగని సుపాయి గ్రామం ఇలా పూర్తిగా వెనుకబడి ఉండటం వెనక కారణం ఏమైఉంటుందో..! చదవండి: అపెండిక్స్‌కు క్యాన్సర్ వస్తుందా! -
ఆమె ఇంకాస్త కాలు జారుంటే అంతే..!
-
ఆమె ఇంకాస్త కాలు జారుంటే అంతే..!
సాక్షి, న్యూఢిల్లీ : ఒకప్పుడు వినోదం, విహారం కోసం కొండ కోనల్లోకి వెళితే ఇప్పుడు సెల్ఫీల కోసం, ఫొటోల కోసం అలాటి చోట్లకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. టెక్సాస్‌లోని ఆస్టిన్‌కు చెందిన 20 ఏళ్ల ఎమలీ కొఫోర్డ్, తన తల్లి ఎరిన్ కొఫోర్డ్‌ను తీసుకొని ఇటీవల ఆరిజోనాలోని గ్రాండ్ కన్యన్ పర్వత శ్రేణుల్లోకి వెళ్లారు. నల్లటి చలి కోటు, మెడలో మఫ్లర్ ధరించిన తన తల్లి ఎరిన్ కొఫోర్డ్‌ను లోయ బ్యాక్ ట్రాప్‌లో అందంగా ఫొటో తీసేందుకు ఎమలీ కొఫొర్డ్ సిద్ధమైంది. కెమేరా లెన్స్ పరిధిలోని నిలువెత్తు ఫొటో పూర్తిగా రావాలకొని ఎమలీ కెమేరా చేతిలో పట్టుకొనే రెండడుగలు వెనక్కి వేసింది. ఒక్క అడుగు వేయగానే ‘ఇంకో అడుగు వేయరాదు’ అని ఆమె తల్లి హెచ్చరించారట. అది వినని ఎమలీ రెండో అడుగు వెనక్కి వేయగానే కొండ అంచున చీలిన రాతి మధ్య కాలు స్లిప్పయింది. అదష్టవశాత్తు నిలదొక్కుకుందిగానీ ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా రాతి లోయలో పడి ఎమలీ పర లోకానికి వెళ్లిపోయేదే..! అనుకోకుండా అక్కడే ఉన్న ‘ఏబీసీ న్యూస్’ ఫొటో గ్రాఫర్ ఎమలీ స్లిప్పయిన దశ్యాన్ని వీడియో తీశారు. ఇప్పుడు దాన్ని ఆన్లైన్లో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది. -
చావుకి మేం భయపడం.. దానికి మేమంటేనే !
ప్రమాదం ఏ క్షణాన, ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. విమానంలో వెళుతున్నప్పడు అది అనుకోకుండా కూలిపోవచ్చు , నడిసంద్రంలో నావ తలకిందులవ్వొచ్చు , లేకపోతే క్రూర జంతువులున్న దట్టమైన అడవిలో దారి తప్పిపోవచ్చు. అయితే, ఇలాంటి సందర్భాల్లోనూ కొందరు మృత్యువును జయిస్తారు. ప్రాణాలతో బయటపడతారు. థాయ్‌లాండ్‌లో ఫుట్‌బాల్ ఆటగాళ్లైన 12 మంది చిన్నారులు, వారి కోచ్ ఓ గుహలో చిక్కుకొని పదిరోజులు పైనే అయ్యింది. వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీళ్లు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ.. ఇలాంటి కొన్ని ప్రమాదాల్లో చిక్కుకొని క్షేమంగా బయటపడిన కొందరు మృత్యుంజయుల గురించి తెలుసుకుందాం... విమానం నుంచి దట్టమైన అడవిలో పడి.. దక్షిణ అమెరికా దేశమైన పెరూలో 1971 డిసెంబర్లో జరిగింది ఈ సంఘటన. ఇక్కడి రాజధాని నగరం లిమాలోని ఓ వర్సిటీలో చదువుతున్న జులియన్ మార్గరెట్ కోపెకె(17).. జర్మనీలో ఉన్న తన తండ్రిని కలిసేందుకు తల్లి మారియా కోపెక్తో కలసి ఓ చిన్నవిమానంలో బయల్దేరింది. మరో 10 మంది ప్రయాణికులు వారికి తోడుగా ఉన్నారు. ఆకాశంలో దాదాపు 2 మైళ్ల ఎత్తులో వెళుతుండగా హఠాత్తుగా ఓ మెరుపు విమానాన్ని తాకింది. దీంతో వెంటనే అది ముక్కలై సమీపంలోని అడవిలో కూలింది. సీటు బెల్టు పెట్టుకొని ఉన్న జులియన్ ఓ చెట్టు కొమ్మకు సీటుతో సహా చిక్కుకుంది. కాసేపటికి తేరుకుని వెంటనే కిందకు దిగి తల్లికోసం చుట్టుపక్కల వెతికింది. అప్పటికే తల్లితోపాటు మిగిలిన ప్రయాణికులూ మృతిచెందడాన్ని గుర్తించింది. వెంటనే అడవి నుంచి బయటపడేందుకు మార్గం వెతుకుతూ బయల్దేరింది. బయాలజీ విద్యార్థిని అయిన జులియన్.. అడవిలోని క్రూరజంతువుల నుంచి బయటపడుతూ అక్కడక్కడా దొరికే పండ్లు తిని, నీళ్లు తాగుతూ తొమ్మిది రోజుల తర్వాత చివరకు ఓ నది ఒడ్డుకు చేరుకుంది. అక్కడ బోటులో ఉన్న కొంతమంది ఆమెను గమనించి తిరిగి ఇంటికి చేర్చారు. సముద్రంలో ఒంటరిగా 76 రోజులు! అమెరికాకు చెందిన స్టీవెన్ కల్హాన్ రచయిత, ఫిలాసఫర్, జర్నలిస్ట్, పరిశోధకుడు. నేవల్ ఆర్కిటెక్చర్ చదివిన కల్హాన్ పడవల తయారీలో నిపుణుడు. 1986లో స్పెయిన్‌లో తీరంలో జరిగిన పడవల పోటీల్లో పాల్గొనేందుకు బయల్దేరాడు. అక్కడ పోటీలు జరుగుతుండగా తుపానులో చిక్కుకొని బోటు దెబ్బతిని ఆఫ్రికాలోని మొరాకోకు దగ్గరలో ఉన్న ఓ దీవికి చేరుకున్నాడు. అక్కడ బోటును రిపేరు చేసుకొని తిరిగి అమెరికాకు పయనమయ్యాడు. అప్పటికే బోటులో ఆహారం అయిపోవడంతో చేపలు, పక్షుల్ని పట్టుకొని తింటూ, వర్షాలు పడినపుడు బోటులోని ఓ డబ్బాలో నీళ్లు నిల్వచేసుకుని తాగుతూ 76 రోజుల ఒంటరి ప్రయాణం తర్వాత ఎట్టకేలకు వెస్టిండీస్‌లోని ఓ దీవికి చేరుకున్నాడు. అక్కడ కొందరు స్థానిక జాలర్లు ఈయన్ని రక్షించడంతో తిరిగి అమెరికా చేరుకున్నాడు. సముద్రంలో తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితుల గురించి ఆ తర్వాత ఆయన రాసిన అడ్రిఫ్ట్ నవలకు ఎంతో పేరొచ్చింది. అలాగే 2012లో వచ్చిన లైఫ్ ఆఫ్ పై సినిమాలో కొన్ని సంఘటనలకూ స్టీవెన్ అనుభవమే ప్రేరణ. ఆ సినిమాకు ఆయన సహాయకుడిగానూ వ్యవహరించాడు. 127 గంటలు..! అమెరికాకు చెందిన రాల్స్టన్కు ట్రెక్కింగ్(పర్వతారోహణ) అంటే ఇష్టం. 2003లో ప్రసిద్ధ గ్రాండ్ కేన్యన్ లోయల ప్రాంతంలో ఉన్న ఓ పర్వతాన్ని అధిరోహించడానికి బయల్దేరాడు. ట్రెక్కింగ్ చేస్తుండగా పట్టుతప్పి రెండు పెద్ద గుండ్ల మధ్య పడ్డాడు. అతని కుడి చేయి రెండు గుండ్ల మధ్య ఉన్న ఓ చిన్న సందులో ఇరుక్కుపోయింది. దీంతో ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయాడు. కొండ ప్రాంతం కావడంతో జనసంచారమూ లేదు. దీంతో రక్షించమని గట్టిగా అరుస్తూ అతను వేసిన కేకలు అరణ్య రోదన అయ్యాయి. బ్యాగులో ఉన్న ఆహారం, నీళ్లు అయిపోయాయి. చివరకు తన బ్యాగులోని ఓ కత్తితో గుండ్ల మధ్య ఇరుక్కున్న చేతిని మోచేయి వరకు కత్తిరించి ఎలాగోలా అతికష్టం మీద బయటపడ్డాడు. అప్పటికే బాగా నీరసించిన అతన్ని కొంతమంది సందర్శకులు గుర్తించి క్షేమంగా ఇంటికి చేర్చారు. రాల్స్టన్ సంఘటనతోనే ఆ తర్వాత ‘127 అవర్స్’ అనే ఇంగ్లిష్ మూవీ వచ్చింది. తిరగబడిన బోటు కింద మూడ్రోజులు! ఇది నైజీరియాలో జరిగింది. తీరంలో పెద్ద ఓడల్ని లంగరు వేసేందుకు సహాయపడే టగ్‌బోట్‌లో హారిసన్ ఒకీనే అనే వ్యక్తి వంటవాడిగా పనిచేసేవాడు. 2013 డిసెంబర్ 9న తీరంలో ఆగి ఉన్న వీరి బోటును హఠాత్తుగా వచ్చిన పెద్ద అలలు సుమారు 3 కిమీ లోపలికి లాక్కెళ్లాయి. దీంతో బోటు తిరగబడింది. ఆ సమయానికి బోటులోని బాత్రూంలో ఉన్న ఒకీనే అక్కడే చిక్కుకుపోయాడు. అయితే, అదృష్టవశాత్తు ఆ బాత్రూంలోని కొద్దిపాటి ప్రాంతంలో నీటి బుడగలా ఏర్పడింది. దీంట్లో కొద్దిగా గాలి ఉండడంతో ఒకీనేకు శ్వాస అందడానికి వీలు కుదిరింది. మూడ్రోజుల తర్వాత బోటు వద్దకు చేరుకున్న సహాయకుల బృందం ఇంకా ప్రాణాలతోనే ఉన్న ఒకీనేను గుర్తించి రక్షించింది. అయితే, అప్పటికే ఆహారం, మంచినీరు లేకపోవడం, సముద్రంలోని చల్లదనం కారణంగా ఒకీనే బాగా నీరసించిపోయాడు. ఒడ్డుకు చేరాక సపర్యలతో కోరుకున్నాడు. ఇలాంటివే మరికొన్ని.. 1992లో హవాయిలోని కిలౌయ అగ్నిపర్వతం వద్ద రెండు పాయలుగా ప్రవహిస్తున్న లావా మధ్యభాగంలో చిక్కుకున్న బెన్సన్ అనే సినిమాటోగ్రాఫర్ రెండు రోజుల అనంతరం క్షేమంగా బయటపడ్డాడు. 2012లో ఆస్ట్రేలియాలోని సిడ్నీకి సమీప అడవిలో తప్పిపోయిన ఓ 18 ఏళ్ల యువకుడిని తొమ్మిది వారాల అనంతరం రక్షక బృందాలు క్షేమంగా తీసుకొచ్చాయి. అయితే తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వేడిగాలులు ఉండే ఆ ప్రాంతంలో ఆ యువకుడు అన్ని రోజులు బతికి ఉండడం చూసి వారు ఆశ్చర్యపోయారు. 2014లో ఎల్‌సాల్వెడార్‌కు చెందిన మత్స్యకారుడు జోస్ సముద్రంలో దారి తప్పి 13 నెలల తర్వాత మెక్సికో తీరానికి చేరాడు.