breaking news
Googles online store
-
భలే ఆప్స్
బుర్రకు పనిచెప్పే లుమోసిటీ... ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్లలో మన జ్ఞానాన్ని పెంచేవి.. బుర్రకు పనిచెప్పేవి ఎన్నో ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి చేరింది లుమోసిటీ. మీ వయసుతోపాటు విద్య స్థాయిని బట్టి మీ మేధను పరీక్షించే క్విజ్లు, సాధారణ గణితశాస్త్ర ప్రశ్నలను సంధిస్తూ సమాధానాలు రాబట్టడం ఈ అప్లికేషన్ ఉద్దేశం. దీనిద్వారా జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు అటెన్షన్ స్పాన్ కూడా ఎక్కువ అవుతుందని అంచనా. ప్రాథమిక వెర్షన్ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఉచితంగా పొందవచ్చు. కొంచెం అడ్వాన్స్డ్ ట్రెయినింగ్ ఎక్సర్సైజ్లు కావాలంటే మాత్రం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మ్యాజిక్యామ్... కెమెరా ప్లస్ వంటి అప్లికేషన్‌ను అభివృద్ధి చేసిన బృందం తాజాగా అందుబాటులోకి తెచ్చిన కెమెరా అప్లికేషన్ ఈ మ్యాజిక్యామ్. దీంట్లోని తొమ్మిది ‘మూడ్స్’తో ఫొటోలపై రకరకాల ఫిల్టర్లను అప్లై చేసి అందంగా తీర్చిదిద్దవచ్చు. ప్రస్తుతం ఈ అప్లికేషన్ ఆపిల్ ఐఫోన్‌తో మాత్రమే పనిచేస్తుంది. కొంత రుసుము చెల్లించడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఇప్పటికే కొన్ని ఇమేజ్ ఎడిటింగ్ అప్లికేషన్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఎవిరీపోస్ట్... స్మార్ట్ఫోన్ల ద్వారా ఏకకాలంలో అనేక సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పోస్ట్ చేయాలనుకునేవారికి ఎవిరీపోస్ట్ భేషైన అప్లికేషన్. ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, లింక్డ్ఇన్, టంబ్లర్ వంటి సోషల్ సైట్లకు ఫోటోలు, వీడియోలతోపాటు టెక్స్ట్ సందేశాలను కూడా పోస్ట్ చేసేందుకు ఉపయోగపడుతుంది ఈ అప్లికేషన్. ఈమెయిళ్ల ద్వారా కూడా పోస్ట్ చేయగలగడం మరో ప్రత్యేకత. ట్విట్టర్‌లోని 140 పదాల పరిమితిని అధిగమించేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి. అన్నింటికీ పోస్ట్ చేయడం మాత్రమే కాకుండా నచ్చిన టంబ్లర్, పింటరెస్ట్ బ్లాగ్లకూ మీ సందేశాలను చేరవేసేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. -
సూపర్ ‘స్మార్ట్’ఫోన్‌కు అయిదు చిట్కాలు
మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? వాడిన కొద్దీ ఫోన్ వేగం మందగిస్తోందా? బ్యాటరీ తరచూ డిస్ఛార్జ్ అయిపోయి చికాకుపెడుతోందా? ఈ సమస్యల పరిష్కారానికి ఉన్న అప్లికేషన్లలో ఏవి బాగుంటాయో తెలియక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ కింది అప్లికేషన్లనూ ఓ సారి ప్రయత్నించి చూడండి... 1. క్లీన్ మాస్టర్ పేరులో ఉన్నట్లే స్మార్ట్‌ఫోన్ ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉండేటా చేస్తుంది. టెంపరరీ, వాడని ఫైల్స్‌తోపాటు, ఆపరేటింగ్ సిస్టమ్‌కు అక్కరకు రాని ఫైళ్లను కూడా తొలగించి ఫోన్ మరింత సమర్థంగా పని చేసేలా చేస్తుంది. తరచూ ఈ ఆప్లికేషన్‌ను వాడటం ద్వారా అనవసరమైన ఫైళ్లతోపాటు ర్యామ్ కూడా క్లియర్ అయిపోయి ఫోన్ స్మార్ట్‌గా పనిచేస్తుందన్నమాట. 2. ఎయిర్ డ్రాయిడ్ ఫోన్ నుంచి పీసీ, టాబ్లెట్లకు ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసేందుకు మేలైన మార్గమీ అప్లికేషన్. పీసీ, లేదా టాబ్లెట్లోనూ ఈ అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. ఐపీ అడ్రస్‌తో కనెక్ట్ అవడం ద్వారా ఫైల్స్ ట్రాన్స్‌ఫర్‌తోపాటు అప్లికేషన్లను మేనేజ్ చేసుకోవచ్చు. పీసీ బ్రౌజర్ ద్వారా పనిచేసే అప్లికేషన్ ద్వారా స్మార్ట్‌ఫోన్ ద్వారానే మెసేజ్‌లు కూడా పంపుకోవచ్చు. 3. గ్రీనిఫై... బ్యాటరీ పొదుపు చేసుకోవాలంటే గ్రీనిఫై అప్లికేషన్ దానికో మార్గం చూపుతుంది. బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్లన్నింటినీ దాదాపుగా నిలిపేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. పెద్దగా అవసరం లేని అప్లికేషన్లను గుర్తిస్తే అవి స్లీప్ మోడ్‌లోనే ఉండేలా చేస్తుంది. దీనివల్ల బ్యాటరీ ఆదా అవడమే కాకుండా డేటా ఛార్జీలు పెరక్కుండా చేస్తుంది. గ్రీనిఫై తాజా వెర్షన్ రూట్ యాక్సెస్ అవసరం లేకుండా పనిచేస్తుంది కాబట్టి దాదాపు అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లపై దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. 4. టైటానియం బ్యాకప్ ప్రొ... స్మార్ట్‌ఫోన్‌లోని డేటా, అప్లికేషన్లనింటినీ బ్యాకప్ చేసుకునేందుకు మెరుగైన అప్లికేషన్ ఇది. అయితే ఇందుకోసం స్మార్ట్‌ఫోన్‌కు రూట్ యాక్సెస్ అవసరం ఉంటుంది. మీరు ఫోన్ మార్చినా... పాత ఫోన్లోని అన్ని అప్లికేషన్లు, డేటాను నేరుగా ఇంపోర్ట్ చేసుకునే సౌలభ్యం చేకూరుతుంది ఈ అప్లికేషన్‌తో. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ అప్లికేషన్ ధర రూ.413. 5. రూట్ బ్రౌజర్... మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఫైల్ మేనేజర్ అప్లికేషన్ లాంటిది ఇది. ఫైల్స్‌ను అటు ఇటు మార్చేందుకు, డిలీట్ చేసేందుకు, జిప్ఫైల్స్లా మార్చేందుకు ఉపయోగించవచ్చు. మీకిష్టం వచ్చిన రీతిలో ఫైల్స్‌ను సార్ట్ చేసుకోవచ్చు.