breaking news
good climate
-
ప్రపంచంలో బెస్ట్ సిటీ ‘వెలెన్సియా’.. టాప్ 10 నగరాలివే..
న్యూయార్క్: మూడు ఖండాల నుంచి మూడు నగరాలు ఇంటర్నేషన్స్ సంస్థ తాజా సర్వేలో అత్యుత్తమ సిటీల జాబితాలో నిలిచాయి. ప్రవాసులు నివసించడానికి 2022లో ప్రపంచంలో అత్యుత్తమ నగరాల్లో స్పెయిన్‌లోని వెలెన్సియా టాప్‌లో నిలిచింది. అద్భుతమైన జీవన ప్రమాణాలుంటాయని జీవన వ్యయం భరించే స్థాయిలో ఉంటుందని, ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారని సర్వేలో అత్యధికులు వెలెనికా నగరానికి ఓటు వేశారు. ఆ తర్వాత స్థానంలో దుబాయ్, మూడో స్థానంలో మెక్సికో సిటీ నిలిచాయి. 181 దేశాల్లో నివసిస్తున్న 11,970 మంది ప్రవాసుల అభిప్రాయాలను తెలుసుకొని ఈ జాబితాకు రూపకల్పన చేశారు. టాప్ 10 నగరాలివే.. 1. వెలెన్సియా (స్పెయిన్): జీవన ప్రమాణాలు, అల్ప జీవన వ్యయం, మంచి వాతావరణం. 2. దుబాయ్: పని చేయడానికి అనుకూలం, ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేయొచ్చు. 3. మెక్సికో సిటీ: ఫ్రెండ్లీ నగరం. 4. లిస్బన్ (పోర్చుగల్): అద్భుత వాతావరణం. 5. మాడ్రిడ్ (స్పెయిన్): సాంస్కృతిక అద్భుతం. 6. బాంకాక్: సొంత దేశంలో ఉండే ఫీలింగ్. 7. బాసిల్ (స్విట్జర్లాండ్): ఆర్థికం, ఉపాధి, జీవన ప్రమాణాల్లో ప్రవాసుల సంతృప్తి 8. మెల్బోర్న్ (ఆస్ట్రేలియా): అన్నింటా బెస్ట్. 9. అబుదాబి: ఆరోగ్యం రంగట్లో టాప్. ప్రభుత్వోద్యోగుల పనితీరు అద్భుతం. 10. సింగపూర్: మంచి కెరీర్. రోమ్ (ఇటలీ), టోక్యో (జపాన్), మిలన్ (ఇటలీ), హాంబర్గ్ (జర్మనీ), హాంగ్‌కాంగ్ ప్రవాసుల నివాసానికి అనుకూలంగా ఉండవని సర్వే పేర్కొంది. -
ఇలా అయితే.. శ్వాసించడం ఎలా?
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నెలకొన్న తీవ్ర వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మండిపడింది. ఇక్కడి ప్రజలు శ్వాస ఎలా తీసుకోవాలని ప్రభుత్వాన్నిఆగ్రహంగా ప్రశ్నించింది. కాలుష్య నియంత్రణకు తీసుకున్న చర్యల వివరాలతో నవంబర్ 25న తమ ముందు హాజరు కావాలని ఢిల్లీ, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ల చీఫ్ సెక్రటరీలను ఆదేశించింది. ఢిల్లీలో కాలుష్యం అత్యధికంగా ఉన్న 13 ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణకు వారంరోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆధికారులను ఆదేశించింది. స్వచ్ఛ వాతావరణం ఉన్న ఢిల్లీని చూడలేమా? అని ప్రశ్నించింది. నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం పాటిస్తున్న ‘వాహనాల సరి – బేసి’ విధానం సరిపోదని సుప్రీంకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. ఆ విధానం ఒక అసంపూర్ణ పరిష్కారమని అభిప్రాయపడింది. ఈ విధానం ద్వారా ఢిల్లీలో కాలుష్యం తగ్గిందా? అని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ విధానంలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను మినహాయించడాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు లెక్కల ప్రకారం ఢిల్లీలో కార్ల వల్ల ఏర్పడుతున్న కాలుష్యం కేవలం 3 శాతమేనని ప్రస్తావించింది. ‘సరి బేసి విధానం అమల్లో ఉన్నప్పటికీ.. కాలుష్యం భారీగా పెరుగడం మనం చూశాం. ఈ విధానం శాశ్వత పరిష్కారం కాదు. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలో అత్యంత తీవ్ర స్థాయికి వాయు కాలుష్యం చేరింది. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలి’ అని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్గుప్తాల ధర్మాసనం వ్యాఖ్యా నించింది. కాలుష్య స్థాయిని తగ్గించడంలో సరి బేసి విధానం విఫలమైందని కాలుష్య నియంత్రణ బోర్డు అధ్యయనంలో తేలిందని అదనపు సొలిసిటర్ జనరల్ ఏఎన్ఎస్ నాదకర్ణి కోర్టు కు తెలిపారు. ఈ వాదనను ఢిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ ఖండించారు. సరి బేసి విధానం అమల్లో ఉన్న సమయంలో కాలుష్య స్థాయిలు 5% నుంచి 15% వరకు తగ్గాయని వాదించారు. -
ఇకపై పల్లెలు పరిశుభ్రం
మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు.. పల్లెల్లో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది.. పట్టణాల కంటే పల్లెలే ఎంతో మేలు.. ఇలాంటి వాక్యాలు మనం ఎన్నో సందర్భాల్లో చదివాం. విన్నాం. కానీ వర్షాకాలం వచ్చిందం టే పల్లెల్లోకి వెళ్లాలంటేనే భయమేస్తుంది. ఎందుకంటే పారిశుధ్య లోపం. ఎక్కడ చూసినా చెత్తాచెదారం. పూడికతో నిండిన డ్రెయినేజీలు, శుభ్రంగా లేని రోడ్లు, మరుగుదొడ్లు లేని ఇళ్లు. ఇలాంటి వాతావరణమే ప్రస్తుతం గ్రామాల్లో కనిపిస్తోంది. దీంతో పట్టణాలకు వలస వెళ్లిన వారు పల్లెలకు రావాలంటేనే జంకుతున్నారు. పారిశుధ్యలోపం, చెత్తతో దోమల విజృంభన, సీజనల్ వ్యాధుల దాడి, మరుగుదొడ్లు లేని ఇళ్లు, అసౌకర్యాలు కనుమరుగు కానున్నాయి. కొద్ది రోజుల్లో పరిశుభ్రానికి ‘ఉపాధి’ బాటలు వేయనుంది. ఇప్పటివరకు మున్సిపాలిటీల్లోనే ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తారని తెలుసు.. ఇకపై గ్రామాల్లోని చెత్తను తొలగించేందుకు ప్రతీ పంచాయతీలో ఉపాధిహామీ పథకం ద్వారా చెత్త డంపింగ్ యార్డుల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిం చారు. జిల్లాలోని 866 గ్రామపంచాయతీల్లో ఉపాధిహామీ పథకం ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. ఇందుకు రూ.9100 ప్రభుత్వం అందిస్తుండగా లబ్ధిదారు వాటాగా రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రతీ గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతోపాటు 866 జీపీల్లో చెత్త డంప్‌యార్డుల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో స్థల సేకరణ చేసి, పనులు కూడా ప్రారంభించారు. పల్లెల అభివృద్ధికి పాటుపడాలనుకునే సర్పంచులకు ఇది చక్కని అవకాశం. డంపింగ్ యార్డు ఏర్పాటు ఇలా.. ఉపాధిహామీ పథకం ద్వారా ప్రతీ గ్రామ పంచాయతీలో ఒక డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తారు. ముందుగా ప్రభుత్వ/పంచాయతీకి చెందిన 7 గుంటల భూమిని, గ్రామానికి 500 మీటర్ల నుంచి కిలోమీటరు దూరంలో గుర్తిస్తారు. భూమి ఎత్తయిన ప్రదేశంలో ఉండేలా చూడడం వల్ల వర్షపు నీరు చెత్తలోకి రాకుండా ఉంటుంది. 15 మీటర్ల పొడవు, 9 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల గుంతను తవ్వుతారు. చెత్త వేసేందుకు, రిక్షాలు, తోపుడు బండ్లు డంపింగ్ యార్డుకు చేరుకోవడానికి దారి, ర్యాంపు ఏర్పాటు చేస్తారు. గుంతగా తవ్విన మట్టిని చెత్తలోకి నీరు వెళ్లకుండా కట్టలా పోస్తారు. ఈ పనులన్నీ ఉపాధిహామీ కూలీల ద్వారా చేపడతారు. డంపింగ్ యార్డు ఏర్పాటు పనుల వల్ల 180 రోజుల పని దొరుకుతుంది. కూలీ కింద ఒక్కో డంప్ యార్డుకు రూ.1,16,888, మెటీరియల్‌కు రూ.7,152 చెల్లిస్తారు. డంపింగ్ యార్డు పూర్తయిన తర్వాత ఉపాధికూలీలతో గ్రామాల్లోని చెత్తను నెలలో 15 రోజులపాటు సేకరించడం, 4 రోజులపాటు డంపింగ్ యార్డులోకి తరలించడం చేస్తారు. నిర్వహణ తీరు.. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో చెత్త సేకరణకు ప్రత్యేకంగా కార్మికులు లేరు. ప్రభుత్వం చేపట్టే పారిశుధ్య వారోత్సవాల్లోనే చెత్తాచెదారం తొలగించడం, గ్రామాల్లోని కాలనీలను శుభ్రపరచడం చేసేవారు. ఏడాదికి నాలుగైదు సార్లు గ్రామంలోని చెత్త తొలగించే కార్యక్రమాలు చేపడుతున్నారు. నిధుల లేమి, కార్మికుల కొరతతో ఇన్నాళ్లు చెత్త సేకరణకు ప్రత్యేకంగా కార్మికులను పంచాయతీల్లో నియమించలేదు. మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు కార్మికులను ఏర్పాటు చేసినట్లే, ఇక నుంచి గ్రామాల్లో కూడా చెత్త సేకరణ కోసం ఉపాధిహామీ కూలీలను నియమిస్తారు. వీరు వారంలో 3 సార్లు ఇంటింటికి వెళ్లి చెత్త పోగు చేస్తారు. దీన్ని రిక్షా/తోపుడు బళ్ల ద్వారా తరలించి డంపింగ్ యార్డులో పోస్తారు. చెత్త సేకరించినందుకు ఒక్కో కూలీకి రోజుకు రూ.149 చెల్లిస్తారు. ఇలా ఏడాదిలో 180 పనిదినాలకు ఉపాధి లభిస్తుంది. చెత్తను డంప్‌యార్డుకు తరలించేందుకు రూ.7వేలు అదనంగా లభిస్తుంది. పోగు చేసిన చెత్తాచెదారం ద్వారా పంచాయతీలకు అదనపు ఆదాయం చేకూరే అవకాశం ఉంది. డంప్ నిండిన తర్వాత దాన్ని ఎరువుగా మార్చి వేలం పాట ద్వారా విక్రయిస్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయి. ఇవి గ్రామపంచాయతీ అభివృద్ధికి ఉపయోగించవచ్చు.