breaking news
general condition
-
మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు
ఇంఫాల్/న్యూఢిల్లీ: గిరిజన, గిరిజనేతరుల నడుమ భీకర ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్‌లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ నిబంధనలు సడలించారు. జనం ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. ఆహారం, నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నారు. మణిపూర్‌లో పరిణామాలపై దర్యాప్తునకు ఆదేశించాలని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. íగిరిజనేతరులైన మైతీలకు ఎస్టీ హోదా ఇవ్వాలంటూ మణిపూర్ హైకోర్టుజారీ చేసిన ఉత్తర్వును నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ సమర్పించారు. హింసాకాండపై సమగ్ర దర్యాప్తును కోరుతూ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ ‘మణిపూర్ ట్రైబల్ ఫోరం’ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టనుంది. -
సాధారణ స్థితికి కొత్త నోట్ల సరఫరా!
ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం... ప్రస్తుతం వ్యవస్థలో సాధారణ ద్రవ్య పరిస్థితులు దాదాపు నెలకొన్నాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు ముందు పరిస్థితి త్వరలో నెలకొనబోతోందనీ భరోసా ఇచ్చారు. ‘‘సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచి వారానికి రూ.24,000 విత్‌డ్రాయెల్ పరిమితి మినహా, దాదాపు అన్ని ఆంక్షలూ తొలగిపోయాయి. ఈ పరిమితిని కూడా కాలక్రమంలో తొలగించడం జరుగుతుంది’’ అని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన అన్నారు. ఇంకా ఇక్కడ ఆయన ఏమన్నారంటే... ⇔ నవంబర్ 8 డీమోనిటైజేషన్ తరువాత 90 రోజుల లోపే పరిస్థితిని తిరిగి సాధారణ స్థాయికి తీసుకురావడం జరిగింది. ⇔ కరెన్సీ సరఫరా, నిర్వహణ ఆర్బీఐ బాధ్యత. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచి వారానికి రూ.24,000 విత్‌డ్రాయెల్ పరిమితిని త్వరలో ఆర్బీఐ తొలగిస్తుంది. ⇔ చిన్న స్థాయి విలువ నోట్ల పంపిణీని విస్తృతం చేయడానికి చర్యలు ఉంటాయి.