breaking news
forex rates
-
‘డాలర్’కు భారత్ అంటేనే ఇష్టం..!
నిరంతర వాణిజ్యం, కరెంట్ ఖాతా లోటు సమర్థంగా నిర్వహించడానికి ఐటీ రంగం కీలకంగా మారనుందని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ ఐటీ ఎగుమతులు మందగిస్తే దేశ ఫారెక్స్ నిల్వలు తరిగి అది రూపాయి విలువపై ప్రభావం చూపనుంది. ఐటీ రంగం పెద్ద మొత్తంలో ఫారెక్స్ ఆదాయాన్ని తీసుకురావడమే కాదు.. ఇతర ఎగుమతి ఆధారిత రంగాలతో పోలిస్తే ఇందులో ఫారెక్స్ వ్యయాలు కూడా తక్కువ. ఐటీ కంపెనీల ఫారెక్స్ ఖర్చులు వాటి ఎగుమతి ఆదాయంలో సగం కంటే తక్కువ ఉంటుందని అంచనా. మరోవైపు కార్పొరేట్ రంగంలో అతిపెద్ద ఎగుమతిదారులుగా ఉన్న ఆయిల్ అండ్ గ్యాస్, మైనింగ్ కంపెనీల ఫారెక్స్ ఖర్చులు వాటి ఫారెక్స్ ఆదాయాలను మించిపోతాయి. ఇటీవల స్టాక్‌మార్కెట్లు బాగా పుంజుకోవడంతో విదేశీ సంస్థాగత పెట్టుబడులు భారీగా భారత్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా మార్కెట్ సూచీలు జీవితకాల గరిష్ఠాలను చేరుతున్నాయి. ప్రధానంగా అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఛైర్మన్ జెరొమ్‌పావెల్ కీలక వడ్డీరేట్లపై ఇటీవల చేసిన ప్రకటన మార్కెట్లకు దన్నుగా నిలుస్తోంది. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో ఎప్పటినుంచో అనిశ్చితి కొనసాగుతున్న ఐటీ స్టాక్‌లు భారీగా ర్యాలీ అవుతున్నాయి. ఐటీ కంపెనీలు అధికంగా డాలర్లలోనే వ్యాపారం సాగిస్తాయి. దాంతో భారత్‌లోని టాప్ కంపెనీల్లో ఎఫ్ఐఐలు అధికంగా పెట్టుబడి పెట్టడంతో దేశంలోని ఫారెక్స్ నిలువలు పెరిగినట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు. దేశంలోని విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు పెరిగాయి. ఈ నెల 15వ తేదీ కంటే ముందు వారానికి 9.11 బిలియన్ డాలర్లు(రూ.75 వేలకోట్లు) పెరుగుదలతో 615.97 బిలియన్ డాలర్లకు(రూ.51.2 లక్షల కోట్లు) ఫారెక్స్ నిల్వలు పెరిగాయని ఆర్బీఐ శుక్రవారం వెల్లడించింది. ఈ నెల 8వ తేదీ కంటే ముందు వారానికి ఫారెక్స్ నిల్వలు 2.82 బిలియన్ డాలర్లు(రూ.23 వేలకోట్లు) పుంజుకుని 606.86 బిలియన్ డాలర్లకు(రూ.50.5 లక్షల కోట్లు) చేరుకున్నాయి. విదేశీ కరెన్సీ నిల్వలు 8.35 బిలియన్ డాలర్లు(రూ.68 వేలకోట్లు) పెరిగి 545.05 బిలియన్ డాలర్ల(రూ.45 లక్షల కోట్లు) వద్దకు చేరాయి. బంగారం నిల్వలు 446 మిలియన్ డాలర్ల(రూ.3700 కోట్లు) పెరుగుదలతో 47.58 బిలియన్ డాలర్లు(రూ.4 లక్షల కోట్లు), స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 135 మిలియన్ డాలర్ల(రూ.1100 కోట్లు) నుంచి 18.32 బిలియన్ డాలర్లకు(రూ.1.5 లక్షల కోట్లు) పుంజుకున్నాయి. ఇదీ చదవండి: రాష్ట్రాలకు రూ.72,961 కోట్లు విడుదల.. ఎందుకంటే.. ఐఎంఎఫ్‌లో ఫారెక్స్ నిల్వలు 181 మిలియన్ డాలర్లు పెరిగి 5.02 బిలియన్ డాలర్లకు(రూ.41 వేల కోట్లు) చేరాయి. 2021 అక్టోబర్‌లో భారత ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ల డాలర్ల(రూ.53 లక్షల కోట్లు) ఆల్ టైం రికార్డు నెలకొల్పాయి. అంతర్జాతీయ పరిణామాల కారణంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోతున్నపుడు ఆర్బీఐ బహిరంగ మార్కెట్లో డాలర్లను విక్రయిస్తూ రూపాయి విలువ మరింత పడిపోకుండా ఆదుకుంటుంది. -
బ్యాంకుల దోపిడి.. హిడ్డెన్ ఛార్జీల పేరిట రూ.9700 కోట్లు లూటీ
హిడ్డెన్ ఛార్జీల పేరిట భారీ దోపిడికి పాల్పడుతున్నాయి బ్యాంకులు. వేలు కాదు లక్షలు కాదు ఏకంగా వేల కోట్ల రూపాయలను లెక్కాపత్రం లేకుండా పక్కదారి పట్టిస్తున్నాయి. ఇదేంటని ప్రశ్నించే వారు లేకపోవడంతో శ్రమ జీవుల సంపాదనను జలగల్లా పీల్చేస్తున్నారు బ్యాంకర్లు. ఉన్నత విద్య కోసం మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్లే భారతీయు సంఖ్య పెరుగుతోంది. ఇలా విదేశాల్లో ఉన్నవారికి డబ్బులు పంపే కుటుంబ సభ్యుల నుంచి ప్రాసెసింగ్ ఫీజు, ఎక్సేంజ్ మార్క్‌అప్ పేరుతో బ్యాంకులు వేల కోట్ల రూపాయలను దోపిడి చేస్తున్నాయి. ఈ విషయాన్ని క్యాపిటల్ ఎకనామిక్స్ అనే ఇండిపెండెంట్ రీసెర్చ్ సంస్థ బయట పెట్టింది. విదేశాలకు భారీగా విదేశాల్లో ఉన్న తమ వారి కోసం భారతీయులు పెద్ద ఎత్తున నగదును పంపిస్తున్నారు. 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ మొత్తం 12.7 బిలియన్ డాలర్లు ( సుమారు 95 వేల కోట్లు)గా ఉంది. ఇందులో అత్యధికంగా 3.8 బిలియన్ డాలర్లు ఉన్నత విద్య కోసం వెచ్చిస్తుండగా ఆ తర్వాత ట్రావెల్ (3.2 బిలియన్), ఫ్యామిలీ సపోర్ట్ (2.7 బిలియన్) డాలర్లు ఉన్నాయి. తగ్గిస్తున్నామంటూనే విదేశాలకు డబ్బు పంపే విషయంలో ఛార్జీలు తగ్గిస్తున్నామని కొన్నేళ్ల కిందట బ్యాంకులు ప్రకటించాయి. దీంతో వాటి ఆదాయం గణనీయంగా పడిపోయింది. 2016లో ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.15,017 కోట్లు వసూలు అవగా 2019లో ఈ మొత్తం 12,142 కోట్లకు పడిపోయింది. దీంతో ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు ఎక్సేంజీ మార్క్‌అప్ పేరుతో వసూలు చేసే హిడ్డెన్ ఛార్జీలను ఒక్కసారిగా పెంచాయి బ్యాంకులు. 2016లో ఎక్సేంజీ మార్కప్ ఛార్జీల మొత్తం రూ.2,505 కోట్లు ఉండగా 2019కి వచ్చే సరికి రూ.4,422 కోట్లకు పెరిగింది. ఇలా ఓ వైపు ప్రాసెసింగ్ ఛార్జీలు తగ్గించామని చెబుతూనే మరోవైపు వడ్డన కార్యక్రమం చేపడుతున్నాయి బ్యాంకులు. దీంతో బ్యాంకుల కాసుల పెట్టె గలగలమంటోంది. 2020 ఏడాదికి సంబంధించి విదేశీలకు నగదు చెల్లించే సమయంలో ఎక్సేంజీ మార్క్‌అప్ పేరుతో రూ.9,700 కోట్ల రూపాయలు అనధికారికంగా వసూలు చేసినట్టు క్యాపిటల్ ఎకనామిక్స్ సంస్థ తెలిపింది. ఈ ఏడాది విదేశీ చెల్లింపులకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజుగా బ్యాంకులు రూ.26,300 కోట్లు వసూలు చేశాయి. ఇందులో హిడ్డెన్ ఛార్జెస్ పేరుతో వసూలు చేసిన రూ.9,700 వాటా 36 శాతంగా ఉంది. ఎక్సేంజీ మార్క్‌అప్ విదేశాలకు డబ్బు పంపివ్వడం లేదా అక్కడి నుంచి నగదు స్వీకరించే సమయంలో బ్యాంకులు ఎక్సేంజీ మార్క్‌అప్ పేరుతో ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. ఫారెక్స్ మార్కెట్లో డాలరు - రూపాయిల మధ్య మారకం విలువ ఎప్పుడు స్థిరంగా ఉండదు. దీంతో ఎక్సేంజీ మార్కప్ ఛార్జీలను వీటిని నేరుగా కాకుండా హిడ్డెన్ ఛార్జీలుగా బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. అదనపు ఆదాయం కోసం ఈ ఎక్సేంజీ మార్క్‌అప్ ఛార్జీలను పెంచడం ద్వారా బ్యాంకులు తమ వినియోగదారుల జేబుల్లో చేతులు పెడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. శ్రమజీవుల కష్టం గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న భారతీయుల్లో నూటికి 90 శాతం మంది శ్రమ జీవులే. ఇండియాలో తమ కుటుంబాలకు ఆసరగా ఉంటూ కాయకష్టం చేసి నగదు ఇండియాకు పంపిస్తున్నారు. కానీ వీళ్ల దగ్గరి నుంచి కూడా భారీ మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నాయి బ్యాంకులు. 2016లో ప్రాసెసింగ్ ఫీజు మొత్తం రూ.10,200 కోట్లు ఉండగా 2020కి వచ్చే సరికి ఇది రూ.14,000 కోట్లకు చేరుకుంది. ఇదే కాలానికి సంబంధించి రెమిటెన్స్ కోటాలో వసూలు చేసిన హిడ్డెన్ ఛార్జెస్ విలువ రూ. 4,200 కోట్ల నుంచి రూ.7,900 కోట్లకు చేరుకుంది. టెక్నాలజీ పెరిగినా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆర్థిక లావాదేవీలు సుళువుగా జరిగిపోతున్నాయి. ప్రాసెసింగ్ ఫీజులు కూడా తగ్గిపోతున్నాయి. కానీ విదేశాలకు నగదు చెల్లింపులు, స్వీకరణ చేసేప్పుడు మాత్రం వసూలు చేస్తున్న ప్రాసెసింగ్ ఫీజు, హిడ్డెన్ ఛార్జీలు పెరుగుతూ పోతున్నాయి. చదవండి: పీబీ ఫిన్‌టెక్ ఐపీవో నవంబర్ 1న ప్రారంభం -
జనరల్ మోటార్స్ వాహనాల ధరలూ పెరుగుతున్నాయ్
న్యూఢిల్లీ: వాహన కంపెనీలన్నీ కార్ల ధరల పెంపులో నిమగ్నమయ్యాయి. టయోటా, నిస్సాన్, రెనో, టాటా మోటార్స్, మెర్సిడెస్, హ్యుందాయ్ ఇలా కంపెనీలన్నీ ఇప్పటికే వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించేశాయి. ఇప్పుడు జనరల్ మోటార్స్ ఇండియా కూడా వీటి సరసన చేరింది. ఇది తాజాగా జనవరి 1 నుంచి వాహన ధరలను దాదాపు రూ.30,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఫారెక్స్ రేట్లలో ఒడిదుడుకులు, ముడిపదార్థాల ధరల పెరుగుదల, ఉత్పత్తి వ్యయం ఎగయడం వంటి అంశాలను ఇందుకు కారణంగా పేర్కొంది.