breaking news
Foreign movies
-
దయలేని ట్రంప్.. ఈసారి సినిమాపై సుంకం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలపై సుంకాలు విధించారు. అమెరికా గడ్డపై షూటింగ్ జరగని సినిమాలపై ఏకంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారాయన.కొందరు నిర్మాతల తీరుతో హాలీవుడ్ తీవ్రంగా నష్టపోతోందన్న ట్రంప్.. విదేశాల్లో చిత్రీకరణ జరిగి.. అమెరికాలో రిలీజ్ అయ్యే చిత్రాలపై వెంటనే 100 శాతం సుంకాలను విధించాలని యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్(USTR)కు ఆదేశాలు జారీ చేశారాయన. అమెరికా చలన చిత్ర పరిశ్రమను పునరుద్ధించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారాయన.చాలా దేశాలు అమెరికన్ స్టూడియోలు, చిత్రనిర్మాతలను ఆకర్షించడానికి లాభదాయకమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఇది అమెరికా ఆర్థిక, జాతీయ భద్రతకు ముప్పు కలిగించడమేనని అన్నారాయన. అమెరికన్ సినిమా ఇండస్ట్రీ చాలా వేగంగా మరణిస్తోందన్న ట్రంప్.. మళ్లీ అమెరికా గడ్డపై సినిమాలు చిత్రీకరణ జరగాల్సిన రోజులు రావాలని ఆశిస్తున్నట్లు ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేశారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద చిత్ర మార్కెట్ ఉంది చైనాకే. అలాంటి దేశం కిందటి నెలలో ‘టారిఫ్ వార్’లో భాగంగా హాలీవుడ చిత్రాల విడుదలపై పరిమితి విధించింది. ఈ క్రమంలో ఇప్పుడు ట్రంప్ విదేశాల్లో చిత్రీకరణ చేసుకునే చిత్రాలపై 100 శాతం సుంకాలను విధించడం గమనార్హం. బెడిసికొట్టే అవకాశం?ట్రంప్ తాజా ప్రకటపై విశ్లేషణలు అప్పుడే మొదలయ్యాయి. ఇది హాలీవుడ్‌ను పునరుద్ధరించకపోగా.. నష్టం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. డిస్నీ, పారామౌంట్, వార్నర్ బ్రోస్ లాంటి స్టూడియోలు కరోనా దెబ్బ నుంచి ఇంకా కొలుకోలేదు. ఇప్పటికీ చాలా వరకు అమెరికా చిత్రాలు బయటి దేశాల్లో షూటింగులు చేసుకుంటున్నాయి. పన్ను మినహాయింపులు, సినిమాకు పని చేసే టెక్నీషియన్లకు తక్కువ ఖర్చులు అవుతుండడమే అందుకు ప్రధాన కారణం. -
ఒక ఇటాలియన్ కథ... ఇండియన్ సినిమాలెన్నో..!
విదేశీ సినిమాల సీడీలను చూసి కథాంశాలను కాపీ కొట్టి రూపొందించిన సినిమాలు అంటే అవేవో అత్యంత వైవిధ్యమైన కథనంతో వచ్చినవో, సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కృతమైన అద్భుతాలో కానక్కర్లేదు. చాలా సాధారణం అనిపించే కథల మూలం కూడా ఏ హాలీవుడ్‌లోనో ఉండవచ్చు. సెన్సిబుల్‌గా సాగుతూ అచ్చ తెలుగు కథలు అనుకొన్న సినిమాల రూట్స్ కూడా అమెరికాతో ముడిపడి ఉండవచ్చు. ‘బావగారూ బాగున్నారా’ సినిమా కథాంశంలో కూడా విదేశీహస్తం ఉందనే విషయం తెలిసినప్పుడు కలిగే అభిప్రాయాలివి. 1998లో మెగాస్టార్ చిరంజీవి, రంభ హీరో ీహ రోయిన్లుగా జయంత్ దర్శ కత్వంలో వచ్చిన ‘బావగారూ బాగు న్నారా’ మూల కథ మనది కాదు. ‘ఫోర్స్టెప్స్ ఇన్ క్లౌడ్స్’ అనే ఇటాలియన్ సినిమా కథ అది. ఆ కథలో ఉన్న గొప్పదనం అనేక మంది, అనేక సార్లు దాన్ని కాపీ కొట్టేలా చేసింది. 1942 నుంచి ఇప్పటి వరకూ అనేకసార్లు ఈ సినిమా కథను అటు తిప్పి ఇటు తిప్పి ఎవరో ఒకరు రీమేక్ చేస్తూనే ఉండటం ఈ కథాంశంలో ఉన్న నిత్యనవ్యతకు సాక్ష్యం. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత తమ తమ స్వదేశాలకు చేరుకొన్న సైనికుల భావోద్వేగాల ఆవిష్కరణతో సినిమా ఆరంభం అవుతుంది. ప్రాణాలతో తిరిగొచ్చిన సైనికులకు వారి వారి కుటుంబాలు స్వాగతం పలుకుతుంటాయి. తీరంలో నౌకలు దిగిన వారిని రిసీవ్ చేసుకోవడానికి వాళ్ల వాళ్లంతా వచ్చి ఉంటారు. అయితే లెఫ్టినెంట్ హోదాలోని పాల్ సటన్‌ను మాత్రం పట్టించుకొనే వారు ఎవరూ ఉండరు. ఎందుకంటే అతడొక అనాథ. దాంతో అతడు బాధప డతాడు. తనకూ ఒక కుటుంబం ఉంటే బావుంటుందని అనుకుంటాడు. తాను పెళ్లి చేసుకొంటేనే అది సాధ్యమవు తుందన్న ఉద్దేశంతో ఒక సుదూర ప్రాంతానికి ప్రయాణం మొదలు పెడతాడు. మార్గ మధ్యంలో పాల్‌కు విక్టోరియా పరిచయం అవుతుంది. అంతు లేని విషాదంతో కనిపిస్తోన్న ఆమె కథను అడిగి తెలుసుకుంటాడు పాల్. తన బాయ్‌ఫ్రెండ్ తనను గర్భవతిని చేసి మోసగించాడని, ఇంట్లోవాళ్లకు తెలిస్తే చంపేస్తారని ఆమె చెబుతుంది. ఆమె కష్టాన్ని అర్థం చేసుకొన్న పాల్, విక్టోరియాకు బాయ్‌ఫ్రెండ్‌గా వాళ్ల ఇంటికి వెళతాడు. అయితే కూతురు తన సమ్మతం లేకుండానే భర్తను తెచ్చుకొందన్న కోపంతో ఉన్న హీరోయిన్ తండ్రి పాల్‌ను అసహ్యించుకుంటాడు. మిగతా వాళ్లు మాత్రం పాల్‌ను ఆదరిస్తారు. మరి విక్టోరియా తండ్రిని అతడు ఎలా ఆకట్టుకున్నాడు, ఆ ఇంట్లో ఎలా సభ్యుడయ్యాడు అనేదే మిగతా కథ. ఇక ఈ తరహాలో ఎన్ని తెలుగు సినిమాలు వచ్చాయో చూస్తే పెద్ద లిస్టే తయారవుతుంది. ‘ఫోర్ స్టెప్స్ ఇన్ క్లౌడ్స్’ని ‘ఎ వాక్ ఇన్ ద క్లౌడ్స్’ పేరుతో ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్ వారు హాలీవుడ్లో తీశారు. ఇది హాలీవుడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్. ఆ తర్వాత ఈ కథనాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నో భాషల్లో సినిమాలొచ్చాయి. మన ‘బావగారూ బాగున్నారా’ కూడా ఇలా వచ్చిందే. ఆత్మహత్య చేసుకొనే ప్రయత్నంలో ఉన్న రచన కోసం చిరంజీవి పరేష్ రావెల్ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అయితే రచన హీరోయిన్ కాకపోవడమే మన కథలో మార్పు. రచనకు ప్రేమించినవాడితో పెళ్లి చేసి, తాను ప్రేమించిన రచన చెల్లెలు రంభని చిరంజీవి పెళ్లి చేసుకోవడంతో కథ ముగుస్తుంది. అలాగే జగపతిబాబు నటించిన ‘అల్లుడుగారు వచ్చారు’పై కూడా ‘ఫోర్ స్టెప్స్ ఇన్ క్లౌడ్స్’ ప్రభావం కనిపిస్తుంది. ఎన్టీయార్ నటించిన ‘బృందావనం’లో కూడా పై సినిమా ఛాయలే కనిపిస్తాయి. 2000 సంవత్సరంలో బాలీవుడ్లో ‘థాయి అక్షర్ ప్రేమ్‌కీ’ అనే సినిమా వచ్చింది. అభిషేక్‌బచ్చన్, ఐశ్వర్యారాయ్ తొలిసారి కలసి నటించిన ఈ సినిమా ‘ఏ వాక్ ఇన్ ద క్లౌడ్స్’కు అనధికార రీమేక్ అని చెప్పవచ్చు. ఈ విధంగా ఒక ఇటాలియన్ కథ.. ఇండియాలో అనేక సినిమాలకు మూలంగా నిలిచింది. - బి.జీవన్‌రెడ్డి