breaking news
Exsice SIT Inquiry
-
సిట్ విచారణకు హాజరైన శ్యామ్ కె నాయుడు
టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు సిట్ ముందు హాజరయ్యారు. ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్‌ను విచారించిన అధికారులు, ఆయన నుంచి పలు ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. పూరి అత్యంత సన్నిహితుల్లో శ్యామ్ కె నాయుడు ఒకరు. విచారణలో భాగంగా ఎన్నాళ్లు డ్రగ్స్ వాడుతున్నారు. మీకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి. కెల్విన్‌తో పరిచయం ఎలా ఏర్పడింది.. లాంటి పలు అంశాలపై ప్రశ్నలు సంధించనున్నారు. -
డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్
కొద్ది రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో భాగంగా దర్శకుడు పూరీ జగన్నాథ్ సిట్ ముందు విచారణకు హాజరయ్యాడు. కొద్ది రోజులుగా బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న పైసా వసూల్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న పూరి బుధవారం సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. కుమారుడు ఆకాష్ తో పాటు, తమ్ముడు సాయిరామ్ శంకర్ కూడా పూరితో పాటు అబ్కారీ కార్యాలయానికి చేరుకున్నారు. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న వారిలో ఎక్కువ మంది పూరికి సన్నిహితులు కావటంతో ఈ రోజు జరగబోయే విచారణలో కీలక అంశాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. నోటీసులు అందుకున్న దగ్గర నుంచే న్యాయనిపుణలతో చర్చిస్తున్న పూరి, ఎక్సైజ్ అధికారుల అడగబోయే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వనున్నారని ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రోజు విచారణలో సిట్ అధికారులు పూరి అడిగేందుకు పది ప్రశ్నలు సిద్ధం చేశారు. 1. కెల్విన్ ఎలా పరిచయం అయింది? 2. పార్టీలు ఇంట్లోనే చేసుకుంటారట.. ఎందుకు? 3. కెల్విన్, జిషన్‌లు మీ ఇంటికి ఎందుకు వచ్చారు? 4. ఎంతకాలంగా రోజులుగా డ్రగ్స్ వాడుతున్నారు? 5. కెల్విన్ ఎవరి ద్వారా మీకు డ్రగ్స్ అందజేస్తాడు? 6. నెలకు ఎన్నిసార్లు డ్రగ్స్ తీసుకుంటున్నారు? 7. కెల్విన్ కంటే ముందు మీకు డ్రగ్స్ ఎవరు, ఎలా సరఫరా చేసేవారు? 8. ఛార్మి, ముమైత్‌ఖాన్, రవి తేజ, సుబ్బరాజులకు.. డ్రగ్స్, కొకైన్ మీ నుంచే వెళ్లిన మాట నిజమా, కాదా? 9. డ్రగ్స్ తీసుకున్నాక కొద్దిరోజులు ఎందుకు హైదరాబాద్‌లో ఉండరు? 10. బ్లడ్‌టెస్ట్‌కు సిద్ధమా, మా దగ్గర ఉన్న ఫొటోలకు మీ సమాధానం ఏమిటి?