breaking news
expected price
-
విడుదలకు సిద్దమవుతున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. పూర్తి వివరాలు
భారతీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్లు లేదా బైకులు ఉన్నాయి. అయితే ఇప్పుడు దేశీయ విఫణిలో అడుగుపెట్టడానికి ఒకాయా (Okaya) నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్ సిద్ధమైంది. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఒకాయ మోటో ఫాస్ట్ పేరుతో విడుదలకానున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కిమీ నుంచి 135 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. దీని టాప్ స్పీడ్ గంటకు 60 కిమీ నుంచి 70 కిమీ కావడం గమనార్హం. ఇది అక్టోబర్ 17న అధికారికంగా లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. లేటెస్ట్ ఒకాయ మోటో ఫాస్ట్ స్కూటర్ ధర రూ. 1.50 లక్షల వరకు ఉండవచ్చు. రోజు వారీ వినియోగానికి అనుకూలంగా ఉండే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ LFP బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. సింపుల్ డిజైన్ కలిగిన ఈ స్కూటర్ సియాన్, బ్లాక్, గ్రీన్, రెడ్ అండ్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇదీ చదవండి: మామకు తగ్గ మేనల్లుడు.. అర్జున్ కొఠారి ఆస్తులు ఇన్ని కోట్లా? ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది కాబట్టి ఆఫర్లో ట్యూబ్‌లెస్ టైర్లు కూడా ఉంటాయని భావిస్తున్నారు. 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ద్వారా స్పీడ్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రైడింగ్ మోడ్, టైమ్ మరియు బ్యాటరీ శాతం వంటి వాటిని చూపిస్తుంది. బ్రేకింగ్ సిస్టం, సస్పెన్షవ్ వంటివి కూడా చాలా అద్భుతంగా ఉండనున్నట్లు సమాచారం. ఈ స్కూటర్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
భారీగా పెరగనున్న కాళేశ్వరం అంచనా వ్యయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న బహుళార్థ సాధక ప్రాజెక్టు కాళేశ్వరం అంచనా వ్యయం భారీగా పెరగనుంది. రీడిజైనింగ్‌లో భాగంగా మేడిగడ్డ నుంచి రోజుకు రెండు టీఎంసీల నీటిని తీసుకునే ప్రతిపాదనకు అదనంగా మరో టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా పనులు చేపట్టిన నేపథ్యంలో దీని వ్యయం లక్ష కోట్లను దాటనుంది. బుధవారం జరిగిన గోదావరి బోర్డు సమావేశంలో, గురువారం ఢిల్లీలో కేంద్ర జల సంఘానికి సమర్పించిన ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్)లో అదనపు టీఎంసీ వ్యయాన్ని రూ.30,435.97 కోట్లుగా ప్రభుత్వం చూపింది. గతంలో రెండు టీఎంసీలు తీసుకునేలా సమర్పించిన మొదటి డీపీఆర్‌లో పేర్కొన్న ప్రాజెక్టు వ్యయాన్ని కలిపితే మొత్తం వ్యయం దాదాపు రూ.1.11 లక్షల కోట్లకు చేరుతోంది. మార్పుల కొద్దీ పెరిగిన వ్యయం ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాణహిత–చేవెళ్ల పథకాన్ని రీ డిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చడానికి ముందు 2006–07లో ప్రాజెక్టు వాస్తవ అంచనా వ్యయం రూ.17,875 కోట్లుగా ఉంది. అనంతరం ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ అంచనా వ్యయాన్ని రూ.38,500 కోట్లకు పెంచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రాజెక్టును పూర్తిగా రీ డిజైన్ చేసి 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు, మరో 18.82 లక్షల ఎకరాలను స్థిరీకరించేలా 18 రిజర్వాయర్ల సామరŠాధ్యన్ని 14 టీఎంసీల నుంచి 141 టీఎంసీలకు పెంచారు. దీనికి అనుగుణంగా అంచనా వ్యయం రూ.80,190 కోట్లకు చేరినట్లు కేంద్రానికి సమర్పించిన తొలి డీపీఆర్‌లో సాగునీటి శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే 2015–16 స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లతో తయారు చేసిన ఆ అంచనాలను ఇటీవల సవరించారు. పెరిగిన స్టీలు, సిమెంట్, ఇంధన ధరలతో పాటు జీఎస్టీలను దృష్టిలో పెట్టుకొని నిర్మాణ వ్యయాన్ని రూ.88,557.44 కోట్లకు పెంచారు. అయితే ఇప్పటివరకు మొదటి డీపీఆర్‌నే పరిగణనలోకి తీసుకుంటున్నారు. తాజాగా రోజుకు 2 టీఎంసీల నీటిని తీసుకునే సామరŠాధ్యన్ని 3 టీఎంసీలకు పెంచేలా పనులు చేపట్టారు. ఈ అదనపు టీఎంసీకి రూ.30,435.97 కోట్ల వ్యయం అవుతోంది. ఒక్కో లింకులో ఇలా... లింక్–1లో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు పనులకు రూ.4,227 కోట్లు, లింక్–2లో ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు రూ.11,806 కోట్లు, లింక్–4లో మిడ్‌మానేరు నుంచి అనంతగిరి వరకు రూ.4,412కోట్లు, అనంతగిరి నుంచి మల్లన్నసాగర్ వరకు రూ.10,260 కోట్లు వ్యయం అవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొదటి డీపీఆర్‌లో పేర్కొన్న వ్యయం, ప్రస్తుతం సమర్పించిన డీపీఆర్ వ్యయాలు కలిపితే మొత్తం వ్యయం రూ.1,10,625.97 కోట్లకు చేరుతోంది. ఇప్పటివరకు రూ.65 వేల కోట్ల ఖర్చు ప్రాజెక్టు మొత్తం వ్యయంలో ఇప్పటివరకు సుమారు రూ.65 వేల కోట్ల మేర ఖర్చు జరిగింది. ఇందులో కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాల ద్వారానే రూ.45 వేల కోట్ల మేర ఖర్చు జరిగింది. 50 టీఎంసీల మల్లన్నసాగర్ రిజర్వాయర్ కింద 14 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండటం, దీనికి అదనంగా తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటి లభ్యత పెంచేందుకే అదనపు టీఎంసీ పనులు చేపట్టామని డీపీఆర్‌లో పేర్కొన్నారు. మొదటి డీపీఆర్‌లో పేర్కొన్న మేరకు మేడిగడ్డ నుంచి మళ్లించుకునే 195 టీఎంసీలు, ఎల్లంపల్లి వద్ద లభ్యతగా ఉండే 20 టీఎంసీలు, భూగర్భ జలాల ద్వారా లభ్యతగా ఉండే మరో 25 టీఎంసీలు కలిపి మొత్తం 240 టీఎంసీల్లోనే అదనపు టీఎంసీ నీటి వినియోగం ఉంటుందని, అదనపు నీటి వినియోగం చేయబోమని వెల్లడించారు. -
నష్టాల్లో పెసర రైతు
- పెరిగిన పెట్టుబడులు - దిగుబడి రాక, ధర లేక ఇబ్బందులు రాయికోడ్: పెసర రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. రెండేళ్లుగా మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. రెండేళ్లుగా వివిధ పంటల దిగుబడి రాక ఆర్థికంగా సతమతమయ్యారు. ఈ ఏడాది వాతావరణం కాస్త అనుకూలంగా ఉండటంతో పెసర దిగిబడి చేతికందుతోంది. ఈ దశలో పెసర్లకు మార్కెట్లో ఆశించిన ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పలు గ్రామాల్లో పెసర నూర్పిడిలు పూర్తయి దిగుబడి రైతుల ఇళ్లకు చేరింది. మరికొన్ని గ్రామాల్లో నూర్పిడులు జోరుగా కొనసాగుతున్నాయి. మండలంలో ఈ ఏడాది 1,050 ఎకరాల విస్తీర్ణంలో పెసర సాగు చేశారు. గత ఏడాది క్వింటాలు పెసర ధర రూ.8 వేల వరకు పలుకగా ప్రస్తుతం రూ.4 వేల నుంచి రూ.4,500 వరకు మాత్రమే ధర వస్తోందని రైతులు చెబుతున్నారు. దీంతో పెసర రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెసరర సాగుకు విత్తనాలు, ఎరువులు, చీడపీడల నివారణకు రసాయనాల కొనుగోలు, నూర్పిడి, తదితరాల కోసం పంట ఇంటికి చేరే వరకు ఎకరా పెసర సాగు కోసం రూ.8 వేల వరకు పెట్టుబడులు పెట్టామంటున్నారు. ఎకరా విస్తీర్ణానికి రెండు క్వింటాళ్లకు మించి రావడం లేదంటున్నారు. దీంతో తమ కష్టానికి ఫలితం దక్కకుండా పోతోందని ఆవేదనచెందుతున్నారు. ప్రభుత్వం క్వింటాలు పెసర ధర రూ.8 వేలు పలికేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.