ఫలాంబరిగా ఏడుపాయల దుర్గమ్మ
పాపన్నపేట: ఏడుపాయల దుర్గమ్మతల్లి ఆదివారం భక్తులకు ఫలాంబరిగా దర్శనిచ్చారు. ఈసందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పండ్లతో ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాలనుంచి భారీగా తరలివచ్చిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులనుఆశీర్వదించారు.
వివిధ ప్రాంతాల భారీగా తరలివచ్చిన భక్తులతో ఏడుపాయల సందడిగా మారింది. కాగా కొంతమంది భక్తులకు అమ్మవారికి బోనాలు సమర్పించుకోగా, మరికొంతమంది భక్తులు ఒడిబియ్యం, తలనీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దేవస్థాన ఈఓ వెంకటకిషన్రావు అన్ని ఏర్పాట్లు చేశారు.