breaking news
drought control
-
సీమ కరువు నివారణకు నిధులివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ ప్రాంత కరువు నివారణకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సలహాదారు అవినాశ్ మిశ్రాకు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా, గాలేరు–నగరి సుజల స్రవంతి కడప ఎస్ఈ ఎం.మల్లికార్జునరెడ్డి, ఎస్ఆర్బీసీ సర్కిల్–1 నంద్యాల ఎస్ఈ షేక్ కబీర్ బాషాలతో కలిసి అవినాశ్ మిశ్రాతో రాజేంద్రనాథ్ భేటీ అయ్యారు. రాయలసీమలో కరువు నివారణకు 19 నీటి పారుదల ప్రాజెక్టులను ప్రధాన మంత్రి క్రిషి సించాయి యోజనలో చేర్చాలని కోరారు. 15 లక్షల ఎకరాల స్థిరీకరణకు రూ.29 వేల కోట్ల ఆర్థిక సాయంపై చర్చించారు. సానుకూలంగా స్పందించిన అవినాశ్ మిశ్రా డీపీఆర్‌ల తయారీకి సంబంధించి కొన్ని సూచనలు చేశారు. డీపీఆర్‌లను నెలరోజుల్లోగా కేంద్ర జల సంఘానికి అందించాలని సూచించారు. సమావేశం సానుకూలంగా జరిగిందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. -
రూ.33,869 కోట్లతో హరిత సీమ
సాక్షి, అమరావతి: దుర్భిక్షానికి చిరునామాగా మారిన రాయలసీమను సుభిక్షంగా మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. కృష్ణా నదికి వరద వచ్చే 40 రోజుల్లో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులను నింపడం ద్వారా ఆయా ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగా శ్రీశైలం జలాశయం నుంచి వరద నీటిని ఒడిసిపట్టి.. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని ప్రాజెక్టులకు తరలించేందుకు కాలువలు, ఎత్తిపోతల పథకాల సామర్థ్యాన్ని పెంచే పనులను చేపట్టనున్నారు. ఇందుకు రూ.33,869 కోట్ల వ్యయం అవుతుందని జలవనరుల శాఖ అంచనా వేస్తోంది. ఈ పనులకు పరిపాలనా అనుమతి ఇచ్చి.. టెండర్లు పిలవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. పనులను శరవేగంగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. శరవేగంగా ప్రణాళిక అమలు రాయలసీమ కరవు నివారణ ప్రణాళికను శరవేగంగా అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రాజోలి, జోలదరాశి జలాశయాల నిర్మాణం, చక్రాయిపేట ఎత్తిపోతల, కుందూ ఎత్తిపోతల పథకాలకు సమగ్ర ప్రాజెక్టు నివేదికల తయారీకి సర్కార్ అనుమతి ఇచ్చింది. మిగిలిన పనులకు డీపీఆర్‌లు తయారు చేసి.. ఆ పనులు చేపట్టడానికి పరిపాలనా అనుమతి ఇవ్వాలని ఆదేశించింది. కరవు నివారణ ప్రణాళిక శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ, శ్రీశైలం కుడి గట్టు కాలువ(ఎస్సార్బీసీ).. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాలకు నీటిని విడుదల చేస్తారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచడం, ఆ నీటిని బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్(బీసీఆర్) వరకూ తరలించే పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పనులకు రూ.571 కోట్లు వ్యయం కానుంది. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 854 అడుగుల కంటే తక్కువగా ఉన్నప్పుడు రోజుకు 3 టీఎంసీల చొప్పున బీసీఆర్‌కు తరలించి.. అక్కడి నుంచి రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్టులకు జలాలను సరఫరా చేయడానికి శ్రీశైలం జలవిస్తరణ ప్రాంతం నుంచి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి రాయలసీమ ఎత్తిపోతలగా నామకరణం చేసింది. ఈ పథకానికి రూ.3,890 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి విడుదల చేసే జలాలను పూర్తిస్థాయిలో తరలించేలా నిప్పుల వాగు సామర్థ్యాన్ని 35 వేల క్యూసెక్కులకు పెంచే పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటికి రూ.1,501 కోట్లు వ్యయం అవుతుంది. కుందూ వరద నీటిని ఒడిసిపట్టేలా రాజోలి ఆనకట్టకు ఎగువన 2.95 టీఎంసీల సామర్థ్యంతో ఒక బ్యారేజీ.. జోలదరాశి వద్ద 0.8 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులకు రూ.1,677 కోట్లు వ్యయం కానుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు చేరిన జలాలను ఎస్సార్బీసీ, గాలేరు–నగరి కాలువల ద్వారా గోరకల్లు జలాశయానికి తరలించడానికి వాటి సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచాలని సర్కార్ నిర్ణయించింది. ఈ పనులకు రూ.1,149 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. గాలేరు–నగరి నుంచి వెలిగల్లు, కాలేటి వాగు, శ్రీనివాసపురం రిజర్వాయర్లను నింపడానికి చక్రాయిపేట ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని సర్కార్ నిర్ణయించింది. ఈ పనులకు రూ.2,600 కోట్లు అవసరం. వైఎస్సార్ జిల్లాలో ముద్దనూరు వద్ద కొత్తగా 20 టీఎంసీల సామర్థ్యంతో ఒక రిజర్వాయర్‌ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనులకు రూ.2,700 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం సామర్థ్యం పెంపు పనులకు రూ.6,310 కోట్లు.. రెండో దశలో కాలువల సామర్థ్యం పెంపు.. జిల్లేడుబండ రిజర్వాయర్ నిర్మాణానికి రూ.1,518 కోట్లు అవసరమని అంచనా. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు ప్రణాళిక -
ఐదేళ్లూ నేనే సీఎం
= నాయకత్వ మార్పు ప్రశ్నే లేదు = అదంతా మీడియా సృష్టి, గాలి వార్తలు = త్వరలో మంత్రివర్గ విస్తరణ = సీఎం సిద్దరామయ్య సాక్షి, బళ్లారి : రాష్ట్రంలో ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా తానే ఉంటానని, ఇందులో ఎలాంటి అనుమానం వద్దని ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేర్కొన్నారు. సోమవారం ఆయన బళ్లారి జిల్లాలో కరువు ప్రాంతాలు పరిశీలన, బళ్లారి జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లాలో కరువు నివారణ గురించి ఏర్పాటు చేసిన ప్రగతి పరిశీలన సమావేశం అయిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నాయకత్వం మార్పు జరుగుతుందనే ప్రచారం జరుగుతోందని విలేకరులు సీఎం దృష్టికి తీసుకుని రాగా ఆయనపై విధంగా ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పాటు పూర్తి అధికార అవధి తానే నిర్వర్తిస్తానన్నారు. తనను ముఖ్యమంత్రి స్థానం నుంచి తప్పించి మరొకరిని నియమించడం జరగదన్నారు. అదంతా మీడియా సృష్టి, గాలి వార్తలేనని కొట్టి పారేశారు. ముఖ్యమంత్రిని మార్పు చేయాలనే ఉద్దేశం హైకమాండ్‌కు కూడా లేదన్నారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కరువు, మంచినీటి సమస్య తీర్చేందుకు వివిధ జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నానని, ఇదంతా ముగిసిన తర్వాత ఢిల్లీకి వెళ్లి హైకమాండ్‌తో చర్చించి మంత్రివర్గ విస్తరణ చేపడతామని చెప్పారు. బళ్లారి జిల్లాలో ఇసుక బంగారంలా మారిందని, కాంట్రాక్టర్లు, అధికారులు దోచుకుంటూ సామాన్య, మధ్యతరగతి వర్గాల వారికి ఇళ్లు కట్టుకునేందుకు కూడా ఇసుక దొరకడం లేదని సీఎం దృష్టికి విలేకరులు తీసుకెళ్లగా, ఆయన స్పందిస్తూ ఇసుకను అందరికి అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరమేశ్వర నాయక్, మంత్రులు హెచ్‌కే.పాటిల్, ఖమరుల్ ఇస్లాం తదితరులు పాల్గొన్నారు.