breaking news
Door-to-door
-
గడపగడపకూ టీకా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటింటికీ వెళ్లి కరోనా టీకాలు వేయాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. ఇప్పటికే మొబైల్ వ్యాన్లతో పల్లెలు, బస్తీలకు చేరుకున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింతగా విస్తృతం చేయడంపై దృష్టి పెట్టింది. వ్యాక్సిన్ కోసం ఎదురుచూడటం, గంటల తరబడి క్యూలో నిల్చోవడం వంటివేవీ లేకుండా.. ఆయా ప్రాంతాల్లో నిర్దేశించిన రోజున ఇంటివద్దకే వచ్చి టీకాలు వేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రోజుకు సగటున లక్షన్నర వరకు వ్యాక్సిన్లు వేస్తుండగా.. గడపగడపకు వెళ్లే కార్యక్రమంతో ఇంతకు రెట్టింపు వేసేలా ప్రణాళిక రచించినట్టు వైద్యారోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా.. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.66 కోట్ల డోసుల టీకా వేశారు. ఇందులో 1.24 కోట్ల మందికి మొదటి డోస్ వేయగా.. 42.55 లక్షల రెండు డోసులూ పూర్తయ్యాయి. మొదటిడోసు వేసుకున్నవారిలో అత్యధికంగా 18–44 ఏళ్ల మధ్య వయసు వారు 61 లక్షల మంది ఉన్నారు. వీరిలో 8.72 లక్షల మంది రెండు డోసులూ తీసుకున్నారు. అయితే రాష్ట్రంలో అర్హులందరికీ వ్యాక్సిన్ వేయాలంటే ఈ ఏడాది చివరివరకు సమయం పడుతుందని గతంలో అంచనా వేశారు. కానీ అంతకన్నా ముందే టీకా వేయాలని తాజాగా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. డోసుల లభ్యతను బట్టి.. టీకాల లభ్యతను బట్టి ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఒక్కోసారి అనుకున్నంతగా వ్యాక్సిన్లు రాష్ట్రానికి అందడం లేదు. అలాంటప్పుడు టీకా కార్యక్రమం సజావుగా సాగడం లేదు. గత నెలలో రెండో డోసు వారికి మాత్రమే టీకాలు వేశారు. లభ్యత పెరగడంతో ఈ నెలలో మొదటి డోసు వారికి కూడా ఇస్తున్నారు. కొత్త వ్యాక్సిన్లకు అనుమతి వస్తుండటం, టీకాల ఉత్పత్తి పెరుగుతుండటంతో.. ఇంటింటికీ వెళ్లి టీకాలు వేయాలని నిర్ణయించినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రముఖుల ఇళ్లకు వెళ్లి కరోనా టీకాలు వేస్తున్నారు. అదే తరహాలో సాధారణ ప్రజలకూ టీకాలు ఇంటిముందుకే రానున్నాయి. పీహెచ్సీ, బస్తీ దవాఖానాలు కేంద్రంగా.. రాష్ట్రంలో ప్రతి మండలానికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) ఉంది. పెద్ద మండలాల్లో రెండు వరకు ఉన్నాయి. అలాగే హైదరాబాద్ నగరంలో బస్తీ దవాఖానాలు ఉన్నాయి. వీటిని కేంద్రంగా చేసుకొని వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయాలని అధికారులు భావిస్తున్నారు. పీహెచ్‌సీల్లో ప్రతి బుధ, శనివారాల్లో సాధారణ వ్యాక్సినేషన్ల కార్యక్రమం జరుగుతుంటుంది. ఏఎన్ఎంలు ఈ రోజుల్లో పిల్లలు, గర్భిణులకు పలురకాల టీకాలు ఇస్తారు. ఇకముందు సాధారణ వ్యాక్సినేషన్‌తోపాటు కరోనా టీకాలు కూడా వేయాలని నిర్ణయించారు. రియాక్షన్ వచ్చే అవకాశం ఉంటుందన్న అంచనాల కారణంగా వ్యాక్సినేషన్ మొదలుపెట్టిన కొత్తలో డాక్టర్, అంబులెన్స్ తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూశారు. అయితే వ్యాక్సిన్లతో రియాక్షన్ సమస్య దాదాపుగా లేనందున.. ఆ ఏర్పాట్లు అవసరం లేదని వైద్యారోగ్యశాఖ భావిస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కొందరికి ఒళ్లు నొప్పులు, జ్వరాలు వస్తుంటాయి. అందువల్ల పారాసిటమాల్ మాత్రలు అందజేయాలని నిర్ణయించారు. -
బ్బారాముల్లాలో భద్రతా దళాల గస్తీ
-
ఇకపై డోర్ కొట్టకూడదట..!
డోర్ టు డోర్ ప్రచారం చేసేవాళ్ళు... సేల్స్ మెన్స్ తలుపు కొట్టి విసిగించడం చాలామందికి అనుభవమే అయ్యుంటుంది. అదే అనుభవం లండన్ లోని బ్రాడ్ పోర్డ్ కు చెందిన మహిళ విషయంలోనూ జరిగింది. పదే పదే జనం విసిగించకుండా ఉండేందుకు ఆమె తమ ఇంటి డోర్ పై ఓ స్టిక్కర్ ను అతికించింది. అయినా ఆమెకు బాధ తప్పలేదు. దీంతో విసిగిపోయిన ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది. అంతే కాకుండా గట్టిగా తన వాదనను వినిపించి... మొత్తానికి అనుకున్నది సాధించింది. ఏకంగా డోర్ టు డోర్ సేల్స్ నే బ్యాన్ చేసేట్టు చేసింది. వివరాల్లోకి వెళితే...రోజుకు కనీసం మూడు, నాలుగు సార్లు డోర్ కొట్టి విసిగిస్తున్న సేల్స్ మెన్స్ బాధ నుంచి తప్పించుకునేందుకు లండన్ కు చెందిన కెల్లీ రోజ్ తనవంతు ప్రయత్నం చేసింది. ''నా అడ్రస్ తో ఏదైనా పార్శిల్ వచ్చినా దయచేసి నన్నుడిస్ట్రబ్ చేయొద్దు'' అంటూ కెల్లీ తన ఇంటి డోర్ పై ఓ సూచనను అతికించింది. ఆ స్టిక్కర్ చూసైనా సేల్స్ వాళ్ళు తనను అనవసరంగా విసిగించరని అభిప్రాయ పడింది. తలుపు కొట్టొద్దు అన్న సంకేతాన్ని స్టిక్కర్ తో సూటిగా చెప్పాననుకుంది. కానీ లాభం లేకపోయింది. ఆ విషయాన్ని పట్టించుకున్న నాధుడే కనిపించలేదు. ఎప్పట్లాగే తలుపు కొడుతూనే ఉన్నారు. హడావిడిగా బయటకు వెడుతున్న సమయంలోనూ అడ్డుకొట్టేవారూ లేకపోలేదు. దీంతో సహనం కోల్పోయిన ఆమె తలుపు కొట్టిన వారిని కోపంగా ప్రశ్నించింది కూడా. తలుపుపై అంటించిన స్టిక్కర్ మీకు కనిపించలేదా అని.. దానికి కొందరు తాము గమనించలేదని, మరి కొందరు మరో అడుగువేసి ఆ స్టిక్కర్ పై ఎటువంటి లీగల్ అథారిటీ లేదని చెప్పడాన్ని తట్టుకోలేక పోయింది. ఇరుగు పొరుగులను కూడా సంప్రదించింది. వారూ అదే సమస్యతో ఇబ్బందులు పడుతూనే ఉన్నామని చెప్పారు. మరొకరు ఇప్పటికే లీగల్ అథారిటీతో స్టిక్కర్ తీసుకున్నామని చెప్పారు. సమస్యను నివారించేందుకు ఏం చేయాలో కెల్లీ తీవ్రంగా ఆలోచించింది. ఇంటికి వచ్చిన సేల్స్ బాయ్స్ తాలూకు ఏజెన్సీకి ఫోన్ చేసింది. తాను బుక్ చేయకుండానే వారి ఏజెన్సీనుంచి సేల్స్ బాయ్స్ వచ్చి తలుపు కొట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఏజెన్సీ నుంచి కూడ కెల్లీకి భంగపాటు ఎదురైంది. మేడమ్..! మీకు ఎవరూ డిస్ట్రబ్ చేయడం నచ్చకపోతే అఫీషియల్ స్టిక్కర్ ను అతికించుకోమన్న సమాధానం రావడంతో ఆగ్రహంతో ఊగిపోయింది. ఇక లాభం లేదనుకున్న కెల్లీ... డోర్ టు డోర్ ప్రచారం, సేల్స్ వంటివి బ్యాన్ చేయించడం తప్పితే... సమస్యకు పరిష్కారం లేదని భావించింది. ఇంతకు ముందే ఇటువంటి గుర్తింపులేని, నిబంధనలు ఉల్లంఘించి అమ్మకాలు జరుపుతున్న పలువురు వ్యాపారస్తుల కేసుల్లో శిక్షార్హులైన వారి ఆధారాలను సేకరించింది. సౌత్ వేల్స్ లోని న్యూ పోర్ట్ క్రౌన్ కోర్టులో దావా వేసి గట్టిగా తన వాదనను వినిపించి... చివరికి కేసు గెలిచింది. ఆప్రాంతంలో డోర్ టు డోర్ సేల్స్ బ్యాన్ చేయించింది. అయితే ఇలా డోర్ టు డోర్ ప్రచారాలు, అమ్మకాలకు విసిగిపోయేవారితో పాటు వారికి సపోర్ట్ ఇచ్చేవారూ ఉన్నారనేందుకు కెల్లీ కేసు ఉదాహరణగా నిలుస్తోంది. ఆమె కేసు గెలిచి, డోర్ టు డోర్ సేల్స్ బ్యాన్ చేయించడాన్ని కొందరు తప్పు బడుతున్నారు. అలా బ్యాన్ చేయడం వల్ల అవసరమైన, ముఖ్యమైన సమాచారం, పార్శిళ్ళు, కొరియర్లు మిస్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అలాగే .. కడుపు నింపుకునేందుకు సేల్స్ పై ఆధారపడి జీవించే వారు ఉంటారని, అటువంటి వారికి ఇది పెద్ద అవరోధమని అంటున్నారు. డిస్ట్రబెన్స్ వద్దనుకునేవారు ఇటీవల అందుబాటులో ఉన్న ఐ-బెల్ వంటి (తలుపు తెరవకుండా, తమ ఫోన్లలో డోర్ బయట ఉన్నవారి వివరాలు చూసే) యాప్ లను డౌన్ లోడ్ చేసుకొని, ఆధునిక పద్ధతులను అమలు చేసి సేల్స్ వారి బాధనుంచీ దూరమవ్వొచ్చనీ అంటున్నారు. అంతేతప్ప.. మొత్తానికే నిరోధించడం సరికాదని అభిప్రాయ పడుతున్నారు.