మెడిసిన్ పీజీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో గైనిక్ పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న డాక్టర్ సంధ్య ఆదివారం ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానిక కన్నావారితోటలో ఓ గదిలో ఉంటున్న ఆమె మత్తు ఇంజక్షన్లు తీసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో గదిలోని తోటి విద్యార్థులు ఆమెను జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సంధ్యకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
ఆమె భర్త డాక్టర్ రవి పిల్లల వైద్య నిపుణుడిగా మిర్యాలగూడలో వైద్య సేవలందిస్తున్నారు. వీరికి పది నెలల క్రితం వివాహమైంది. హైదరాబాద్‌కు చెందిన సంధ్య పీజీ వైద్య విద్య అభ్యసించేందుకు గుంటూరు వచ్చారు. కొంతకాలంగా బోధనా సిబ్బంది వేధింపులకు గురిచేయడం వల్లనే ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. ఈ వేధింపుల గురించి డాక్టర్ సంధ్య కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.