breaking news
Distribution homes documents
-
బొట్టుపెట్టి ఆహ్వానం
తాడేపల్లిరూరల్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పేదల ఇళ్లపట్టాల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈనెల 26న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.ఈ క్రమంలో మంగళగిరి కార్పొరేషన్ పరిధిలోని లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి ఇళ్ల పట్టాల పంపిణీకి రావాలని అక్కచెల్లెళ్లకు బొట్టుపెట్టి ఆహ్వానిస్తున్నారు. సచివాలయ సిబ్బంది సోమవారం తాడేపల్లి పట్టణం, తాడేపల్లి రూరల్‌లోని పెనుమాక, వడ్డేశ్వరం, కొలనుకొండ, గుండిమెడ, చిర్రావూరు, ప్రాతూరు గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 11,822 మంది లబ్ధిదారులకు పట్టాల పంపిణీ మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో 11,822 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే కృష్ణాయపాలెం, నవులూరు, వెంకటపాలెం, నిడమర్రు ప్రాంతాల్లో దాదాపుగా సొంత ఇల్లు లేని నిరుపేదలకు అందజేసేందుకు ప్లాట్లను సిద్ధం చేశారు. ఈ నెల 26న వెంకటపాలెం, కృష్ణాయపాలెం మధ్య అమరావతి రోడ్డులో ఏర్పాటు చేసిన లే అవుట్లలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పట్టాలు పంపిణీ చేయనున్నారు. అర్హులైన మహిళలందరికీ ఇప్పటికే వలంటీర్ల ద్వారా పట్టాలు అందజేస్తామని సమాచారం అందించారు. పట్టాలను సిద్ధం చేస్తున్న సిబ్బంది ఇళ్ల పట్టా పుస్తకాల్ని సచివాలయ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వెల్ఫేర్ అసిస్టెంట్లు, వలంటీర్లు సంయుక్తంగా పట్టాలపై ఫొటోలు అతికించడంతో పాటు అక్షర దోషాల్ని తనిఖీ చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయనున్నట్లు కమిషనర్ శారదాదేవి తెలిపారు. రాజధానిలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన వెంకటపాలెం(తాడికొండ): తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఈ నెల 26న నిర్వహించనున్న పేదలకు పట్టాల పంపిణీ ఏర్పాట్లను సోమవారం ముఖ్యమంత్రి కార్యక్రమాల కో –ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ పరిశీలించారు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు ఎం. వేణుగోపాలరెడ్డి, ఎస్. ఢిల్లీరావులతో కలసి ప్రాంగణ ఏర్పాట్లను తనిఖీ చేశారు. సభా వేదిక, గ్యాలరీ, పార్కింగ్ ప్రాంతాల్ని పరిశీలించి సూచనలు జారీ చేశారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ జి. రాజకుమారి, తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలిశర్మ, విజయవాడ సబ్ కలెక్టర్ అజిత్‌సింగ్, గుంటూరు ఆర్డీవో ఆదిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆర్ అండ్ బీ ఎస్ఈ నిర్మల, సీఆర్డీయే, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
రేపు 'గ్రేటర్'లో ఇళ్ల పట్టాల పంపిణీ
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రేపు(శుక్రవారం) పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆర్హులైన పేదలకు పట్టాలు ఇవ్వనున్నారు. హైదరాబాద్ మల్కాజ్ గిరి పరిధిలో 3,300, ఖైరతాబాద్ పరిధిలోని ఎన్ బీటీ కాలనీలో 7 వేల కుటుంబాలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేయనున్నారు. క్రమబద్ధీకరణలో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే లక్ష్యం..! గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల దృష్ట్యా నగర పరిధిలో కనీసం లక్షమంది పేదలకైనా పట్టాలను పంపిణీ చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ కలెక్టర్లకు లక్ష్యా లు విధించినట్లు సమాచారం. -
పట్టాల పంపిణీ మూడు జిల్లాల్లోనే!
⇒ పేదలకు లక్ష ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వ నిర్ణయం ⇒ హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకే పరిమితం ⇒ గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా సర్కారు కసరత్తు సాక్షి, హైదరాబాద్: పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ రోజును పురస్కరించుకొని జూన్ 2నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. గత డిసెంబర్లో ప్రభుత్వం ప్రకటించిన ఉచిత క్రమబద్ధీకరణ ప్రక్రియకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి మూడున్నర లక్షలమందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం పట్టాలు పొందేందుకు అర్హులైన వారిని (సుమారు లక్షన్నర మందిని) అధికారులు ఎంపిక చేశారు. అర్హుల జాబితాలో పది జిల్లాలకు చెందిన పేదలు ఉండగా, ప్రస్తుతానికి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మూడు జిల్లాలకే పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో రెండు జిల్లాలు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు కాగా, మూడవదైన మెదక్ జిల్లాలో కేవలం రెండు మండలాల (పటాన్చెరు, రామచంద్రాపురం)లో మాత్ర మే పట్టాలను పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించినట్లు సమాచారం. సమస్యాత్మకమైనవే ఎక్కువ.. ప్రభుత్వ భూముల్లోని ఆక్రమణలను క్రమబద్ధీకరించేందుకు గత డి సెంబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (58, 59)జారీచేసింది. ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ, యూఎల్సీ భూము ల్లో ఆక్రమణలకే ఈ సదుపాయం వర్తిస్తుంది. క్రమబద్ధీకరణ ప్రక్రియకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,66,150 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వీటిలో ఉచిత కేటగిరీ కింద 3,36, 869 దరఖాస్తులు రాగా, చెల్లింపు కేటగిరీలో కేవలం 29,281 దరఖాస్తులే వచ్చాయి. ఉచిత క్రమబద్ధీకరణకు అందిన దరఖాస్తుల్లో అభ్యంతరకర భూములకు చెందినవి అధికం గా ఉన్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. వీటిలో కేంద్ర ప్రభుత్వ, రైల్వే, మిలటరీ.. తదితర సంస్థల భూములకు చెందిన దరఖాస్తులు లక్షకుపైగా ఉన్నట్లు నిర్ధారించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే.. ఇప్పటికే పట్టా ఉన్నవి, మున్సిపల్, దేవాలయ/దర్గా భూములు, మురుగు కాలవలు, రహదారుల వెంబడి, శ్మశానవాటికలు, శిఖం భూములు, కోర్టు కేసుల్లో ఉన్నవి, హౌసింగ్‌బోర్డు, జీపీడబ్ల్యుడీ, నిజాం నవాబువి, నాన్ ఐఎస్ఎఫ్, విద్యాశాఖ, దేవాదాయశాఖ.. తదితర 21 రకాల అభ్యంతరకరమైన భూములకు సంబం ధించి దరఖాస్తులు సుమారు లక్ష వరకు ఉన్నట్లు తెలిసింది. గ్రేటర్ పరిధిలో క్రమబద్ధీకరణ ఇలా.. అందిన దరఖాస్తులు : 2,11,798 కేంద్ర ప్రభుత్వ భూములకు చెందినవి : 84,403 పట్టాలకు ఎంపికైన అర్హులు: 99,580 సిద్ధంగా ఉన్న పట్టాలు: 65,673 రాష్ట్రవ్యాప్తంగా... అందిన దరఖాస్తులు: 3,36,869 కేంద్ర ప్రభుత్వ భూములకు చెందినవి: 1,03,331 పట్టాలకు ఎంపికైన దరఖాస్తులు: 1,43,783 సిద్ధమైన పట్టాలు: 82,024 గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే లక్ష్యం..! గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల దృష్ట్యా నగర పరిధిలో కనీసం లక్షమంది పేదలకైనా పట్టాలను పంపిణీ చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ కలెక్టర్లకు లక్ష్యా లు విధించినట్లు సమాచారం. గ్రేటర్ పరిధి లో 2.11లక్షల దరఖాస్తులు రాగా, ఇందులో పరిశీలన అనంతరం 99,580 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. ఇప్పటి వరకు 65,673 మందికి మాత్రమే ఇళ్ల పట్టాలను సిద్ధం చేశారు. అయితే.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి ఈ సంఖ్యను కనీసం లక్ష(పట్టాలను)కు చేర్చాలని కలెక ్టర్లకు సచివాలయం నుంచి ఆదేశాలందినట్లు తెలిసింది.