breaking news
director Vignesh Shivan
-
భర్త పుట్టినరోజు.. బోలెడంత ప్రేమతో నయనతార పోస్ట్ (ఫొటోలు)
-
మరో ప్రేమ ప్రయాణం!
పబ్లిక్‌గా ప్రేమను ఒప్పుకోలేదు కానీ వీలు చిక్కినప్పుడల్లా ప్రేమపక్షుల మాదిరి విహరిస్తున్నారు హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్. అవసరమనుకుంటే ఫారిన్ ట్రిప్‌కి కూడా వెళ్తున్నారు. మొన్నా మధ్య అమెరికాలో ఈ ఇద్దరూ సందడి చేశారు. తాజాగా అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కి వెళ్లి కొంత సమయాన్ని గడిపారు నయన్ అండ్ విఘ్నేష్. యాక్చువల్లీ నయనతార ఎప్పుడు అమృత్సర్ వెళ్లినా ఒంటరిగా వెళ్లేవారు. కానీ ఇప్పుడు జంటగా వెళ్లడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్. అంటే వీరి పెళ్లికి శుభఘడియలు దగ్గర పడుతున్నాయా? అనే చర్చ మళ్లీ ఊపందుకుంది. ఇద్దరూ అక్కడ ఉన్న ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో వాటిల్లో ఒకటి. ఇక సినిమాల విషయానికి వస్తే... తమిళంలో అజిత్ హీరోగా నటిస్తున్న ‘విశ్వాసం’, తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమాల్లో కథానాయికగా నటిస్తున్నారు నయనతార. ఈ సినిమాలు కాకుండా మరో రెండు తమిళ ప్రాజెక్ట్స్‌తో ఎప్పటిలాగానే ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీగా ఉన్నారీ లేడీ సూపర్‌స్టార్. -
నయా ట్రిక్స్
ఏ నటికైనా, నటుడికైనా ప్రచారం చాలా అవసరం. అందుకు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అవలంభిస్తుంటారు. కొందరు ధనాన్ని వెచ్చిస్తే, మరి కొందరు సమయాన్ని కేటాయిస్తుంటారు. ఇంకొందరు యుక్తిని ఉపయోగిస్తుంటారు. నటి నయనతార ఈ మూడో కోవకి చెందినామె అని చెప్పవచ్చు. బాలీవుడ్‌కు చెందిన హీరోయిన్లు ఎలాంటి గాసిప్స్‌కు చింతించరు. పైగా అలాంటి వాటిని వారు చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే తమపై వదంతుల్ని వారే పుట్టించుకుంటారని కూడా ప్రచారంలో ఉంది. అందుకు కారణం లేకపోలేదు. ఎప్పుడూ ఏదో ఒక సంచలన ప్రచారంతో మీడియాలో హెడ్‌లైన్స్‌లో ఉండాలన్నదే అలాంటి వారి ఆలోచన. ఇప్పుడీ వరుసలో నటి నయనతార చేరారని చెప్పక తప్పదు. దక్షిణాదిలో ఏ నటి ఎదుర్కోని సమస్యలు ఈమెను చుట్టిముట్టాయి. వీటిలో స్వయంకృతాపరాధం వల్లే అధికం అనక తప్పదు. ముఖ్యంగా ప్రేమలో రెండుసార్లు ఓడిపోయారు. మూడోసారి ప్రేమ ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా యువ దర్శకుడు విఘ్నేశ్ శివతో నయనతార ప్రేమాయణం సాగిస్తున్నారన్నది కోలీవుడ్ టక్. ఇలాంటి వదంతులు హోరెత్తుతున్నా ఏమాత్రం చలించని నయనతార దర్శకుడు విఘ్నేశ్‌శివతో సన్నిహితంగా దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ నెట్‌వర్క్స్‌లో హల్చల్ చేస్తోంది. వీరి మధ్య ఏదో ఉందనే సందేహం పరిశ్రమ వర్గాల్లో కలగడం సహజం. వీటిలో దేనికి నయనతార స్పందించక పోవడం చూస్తుంటే ఇలాంటి వదంతులను ఆమే ప్రచారం చేసుకుంటున్నారనిపిస్తోందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. పలు భేటీలతో వచ్చే ప్రచారం కంటే ఇలాంటి వదంతులతో పది రెట్లు అధికంగా పోందవచ్చుననేది నయనతార యుక్తి కావచ్చునన్నది సినీ వర్గాల భావన. కేరళాకు చెందిన ఈ అమ్మడు కొచ్చిలో నివసిస్తూ షూటింగ్‌లకు చెన్నై, హైదరాబాద్ తదితర ఇతర ప్రాంతాలకు వచ్చిపోతుంటారు. అలాంటిది ఇప్పుడు చెన్నై, కోయంబేడులో బ్రహ్మాండమైన ఫ్లాట్‌ను కొనుగోలు చేశారని తెలిసింది. నయనతార భవిష్యత్‌లో చెన్నైలో సెటిల్ అవుతారనే ప్రచారం జరుగుతోంది.